/rtv/media/media_files/2025/07/23/police-couple-flees-with-cybercriminals-money-2025-07-23-08-23-16.jpg)
Police couple flees with cybercriminals' money
సైబర్ నేరగాళ్లు కాజేసిన రూ.కోట్ల సొమ్మును రికవరీ చేసిన పోలీసుజంట అదే సొమ్ముతో ఉడాయించడం సంచలనం రేపింది. ఈ కేసులో ఓ ఎస్సైతో పాటు మరో మహిళా ఎస్సై కూడా భాగస్వామిగా ఉండటం గమనార్హం. ఢిల్లీలో వెలుగు చూసిన ఈ కేసుకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.
Also Read: వీడసలు మనిషేనా.. రూ.20 కోసం కన్నతల్లిని చంపిన కసాయి.. ఎక్కడంటే?
ఢిల్లీకి చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ అంకుర్ మాలిక్ తన స్టేషన్ పరిధిలో సైబర్ నేరాలకు సంబంధించిన కేసులను నమోదు చేశాడు. ఈ క్రమంలో పలువురు బాధితులు పోగొట్టుకున్న సుమారు రూ.కోట్లను రికవరీ చేశాడు. అలా స్వాధీనం చేసుకున్న నిధులను నకిలీ ఫిర్యాదుదారులను ఉపయోగించి తన నియంత్రణలో ఉన్న ఖాతాల్లోకి సొమ్మును బదిలీ చేసుకున్నాడు. అనంతరం ఆరోగ్య సమస్యల పేరుతో సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. అదే సమయంలో అంకుర్ మాలిక్‌కు తన తోటి మహిళా ఎస్సై నేహాపునియాతో లవ్ ఎఫైర్ కూడా ఉన్నట్లు గుర్తించారు. అయితే వీరిద్ధరికీ వేర్వేరుగా పెళ్లిళ్లు కావడమే కాకుండా జీవితభాగస్వాములు ఉన్నారు.
Also Read : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు నోటీసులు
Police Couple Flees With Cybercriminals' Money
ఈ క్రమంలోనే తమ జీవిత భాగస్వాములను విడిచిపెట్టి కొట్టేసిన సైబర్ సొమ్ముతో పరారైన వీరు వేరు కాపురం పెట్టాలని నిర్ణయించుకున్నారు. అలా గోవా, మనాలీ, కశ్మీర్ తదితర ప్రాంతాలను సందర్శించిన ఎంజాయ్ చేశారు. తమ పేర్లు మార్చుకుని మధ్యప్రదేశ్‌లో స్థిరపడాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే వారి ప్రయత్నాలను ఢిల్లీ పోలీసులు భగ్నం చేశారు. నాలుగు నెలల పాటు వేటాడి ఇండోర్‌లో వారిని అరెస్ట్ చేశారు. దొంగిలించబడిన డబ్బును వారి ఖాతాల్లోకి బదిలీ చేసిన మరో ముగ్గురు వ్యక్తులు - మొహమ్మద్ ఇలియాస్, ఆఫి అలియాస్ మోను, షాదాబ్ లను - కూడా అరెస్టు చేశారు. కాగా పోలీసులు వారి నుండి ₹1 కోటి విలువైన బంగారం, ₹12 లక్షల నగదు, ఫోన్లు, ల్యాప్‌టాప్ , ATM కార్డులను స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ కేసులో సైబర్ క్రైమ్ విభాగంలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది అనే విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, స్వాధీనం చేసుకున్న మొత్తాన్ని ఎవరూ క్లెయిమ్ చేయరని అంకుర్ మాలిక్‌కు తెలుసు, కాబట్టి అతను తప్పుడు పత్రాలను సమర్పించడం ద్వారా కోర్టు నుండి డబ్బును విడుదల చేసి, ఆపై పారిపోయాడు. "ఈ డబ్బుతో, అతను గోవా, మనాలి మరియు కాశ్మీర్ వంటి ప్రదేశాలకు కూడా వెళ్ళాడు" అని పోలీసులు తెలిపారు."తరువాత, ఇండోర్ చేరుకున్న తర్వాత, అతను నగదుకు బదులుగా బంగారం కొన్నాడు, తద్వారా ట్రాక్ చేయడం కష్టం అవుతుందని అతనికి తెలుసు. నకిలీ ఐడీలను తయారు చేసి మధ్యప్రదేశ్‌లోని కొండ ప్రాంతాలలో కొత్త జీవితాన్ని ప్రారంభించడమే వారి ప్రణాళిక. ఈ మోసంలో ఇంకా ఎవరెవరు పాల్గొన్నారో తెలుసుకోవడానికి పోలీసులు ఇప్పుడు వారిని విచారిస్తున్నారని వారు తెలిపారు.
Also Read:పహల్గాం ఉగ్ర అనుమానితుడు అరెస్టు.. పట్టించిన ఫేసియల్ రికగ్నిషన్
sub-inspector-in-delhi-police | arrested-by-delhi-police | delhi-police | cyber crime in india | cyber-crime-news | cyber crime cases | cybercrime | cyber-alert | cyberattack | cyber