/rtv/media/media_files/2025/07/23/raja-singh-u-turn-2025-07-23-13-03-30.jpg)
ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజాసింగ్.. యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది. రాజీనామా ఆమోదం ముందు వరకు బీజేపీ ముఖ్య నేతలు టార్గెట్ గా విమర్శలు గుప్పించిన రాజాసింగ్.. ఇప్పుడు సైలెంట్ అవ్వడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇటీవల ఆయన మాట్లాడుతూ.. ధర్మం కోసం పని చేసే ఏకైక పార్టీ బీజేపీ అని వ్యాఖ్యానించారు. తనను ఏ పార్టీ భరించదన్నారు. తెలంగాణలో బీజేపీ తప్పా మిగతా పార్టీలన్నీ ఎంఐఎంతో కలిసి పని చేస్తాయని.. అలాంటి పార్టీల్లోకి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఇంతటితో ఆగకుండా మోదీ, అమిత్ షా, యోగి సారథ్యంలో పని చేస్తానని ప్రకటించారు. దీంతో రాజసింగ్ బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. రాజాసింగ్ పాజిటివ్ వ్యాఖ్యలను పార్టీ నేతలు సైతం స్వాగతిస్తున్నారు. ఇటీవల ఆయనకు వ్యతిరేకంగా కామెంట్స్ చేసిన మాధవీలతను సైతం ముఖ్య నేతలు మందలించినట్లు తెలుస్తోంది. సైలెంట్ గా ఉండాలని ఆమెకు సూచించినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో రాజాసింగ్ తిరిగి కాషాయ గూటికి చేరుతారనే చర్చ కమలం పార్టీలో జోరుగా సాగుతోంది.