BREAKING: వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగించండి.. హైదరాబాద్ పోలీసులు కీలక ఆదేశాలు!

హైదరాబాద్ లో భారీ వర్ష సూచన నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. ట్రాఫిక్ అంతరాయాన్ని నివారించడానికి ఐటీ కంపెనీలు బుధవారం కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగించాలని సూచించారు. 

New Update

HYD Rain Alert: సైబరాబాద్ ప్రాంతంలో భారీ వర్ష సూచన నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు. ట్రాఫిక్ అంతరాయాన్ని నివారించడానికి ఐటీ కంపెనీలు బుధవారం కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగించాలని సూచించారు. రాత్రి కురిసిన భారీ వర్షాలతో పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ వరద నీటితో జలమయమయ్యాయి. దీంతో వాహనాల రాకపోకలు ఎక్కడిక్కడే నిలిచిపోయి ప్రజలు, ఆఫీసులకు వెళ్లే ఉద్యోలు తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ముందస్తు జాగ్రత్త ఐటీ కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ సూచించారు.  ఇలా చేయడం ద్వారా ఉద్యోగులు సురక్షితంగా ఉండటంతో పాటు, ట్రాఫిక్ రద్దీని తగ్గించవచ్చని పోలీసులు ఆశిస్తున్నారు. అలాగే  భారీ వర్షాల సమయంలో అత్యవసర సేవలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు కూడా ఈ సూచనలు ఉపయోగపడతాయని అధికారులు అభిప్రాయం. 

Rain Alert
Rain Alert

ఆరెంజ్ అలెర్ట్ 

ఇదిలా ఉంటే హైదరాబాద్ తో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్‌ భూపాలపల్లి, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నటు తెలిపింది. నిన్న మంగళవారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి 7.5, కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి 7.4, మంచిర్యాల జిల్లా భీమినిలో 7 సెం.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో 9.1 సెంటీ మీటర్లు, మంచిర్యాల జిల్లా నస్పూర్‌ 8.4  వర్షపాతం నమోదైంది.

Also Read: BREAKING: వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగించండి.. హైదరాబాద్ పోలీసులు కీలక ఆదేశాలు!

ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల అధికారులు సూచనలు జారీ చేశారు. చెట్ల కింద, కరెంటు పోల్స్ కింద ఉండకూడని హెచ్చరించారు. తప్పనిసరి పరిస్థితుల్లో తప్పా బయటకు రాకూడదని సూచించారు. అలాగే రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. 

Also Read: Duvvada Srinivas – Maduri: దువ్వాడ జంట రొమాంటిక్ ప్రీవెడ్డింగ్ షూట్.. వీడియో చూస్తే పిచ్చెక్కిపోతారు..!

Advertisment
తాజా కథనాలు