Henley Passport Index: భారతీయులు 59 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు.. ఎలానో తెలుసా?

విదేశాలకు టూర్ వెళ్లాలనుకునే వారికి గుడ్‌న్యూస్. ఇక నుంచి భారతీయులు 59 దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు. వీసా లేకుండా అనుమతించే దేశాల సంఖ్య ఆధారంగా పాస్‌పోర్టు శక్తిని లెక్కిస్తారు. ఇందుకు సంబంధించి హెన్లీ పాస్‌పోర్టు సూచీ 2025 విడుదలైంది.

New Update
Henley Passport Index

విదేశాలకు టూర్ వెళ్లాలనుకునే వారికి గుడ్‌న్యూస్. ఇక నుంచి భారతీయులు 59 దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు. వీసా లేకుండా అనుమతించే దేశాల సంఖ్య ఆధారంగా పాస్‌పోర్టు శక్తిని లెక్కిస్తారు. ఇందుకు సంబంధించి హెన్లీ పాస్‌పోర్టు సూచీ -2025 విడుదలైంది. శక్తిమంతమైన పాస్‌పోర్టుల జాబితాలో భారత్‌ గతేడాదితో పోలిస్తే మరింత మెరుగుపడింది. 2024లో 80వ స్థానంలో ఉండగా ప్రస్తుతం 77వ స్థానానికి చేరుకుంది. వీసా రహిత ప్రయాణాలను అనుమతించే దేశాల సంఖ్య మాత్రం 59కి పరిమితమైంది. గతంలో ఇది 62 దేశాలుగా ఉన్న విషయం తెలిసిందే. గతేడాది ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, సింగపూర్‌, స్పెయిన్‌ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలవగా.. ఈసారి సింగపూర్‌ ఒక్క దేశం మాత్రమే తొలి స్థానంలో నిలిచింది.

Also Read :  సూర్య బర్త్ డే స్పెషల్ అదిరింది.. 'కరుప్పు' తో తెర పైకి!

Henley Passport Index

Also Read :  జడ్జి యశ్వంత్ వర్మ వ్యవహారం.. ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ ఖడ్ రాజీనామా అందుకేనా?

సింగపూర్‌ పాస్‌పోర్టుతో 193 దేశాలకు వీసా-ఫ్రీ ట్రావెల్ చేయవచ్చు. రెండో స్థానంలో ఉన్న జపాన్‌, దక్షిణకొరియాల పాస్‌పోర్టుతో 190 దేశాలు చుట్టిరావచ్చు. డెన్మార్క్‌, ఫిన్లాండ్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఐర్లాండ్‌, ఇటలీ, స్పెయిన్‌లు మూడో స్థానంలో ఉన్నాయి. మలేసియా, ఇండోనేసియా, మాల్దీవులు, థాయ్‌లాండ్‌ వంటి దేశాలు వీసారహిత ప్రయాణాలకు అనుమతిస్తున్నాయి.  శ్రీలంక, మకావు, మయన్మార్‌ తదితర దేశాలు మాత్రం అక్కడి దిగిన తర్వాత వీసాలు మంజూరు చేస్తున్నాయి. ఈ జాబితాలో అఫ్గానిస్థాన్‌ చివరి స్థానంలో ఉంది. ఇక్కడి పాస్‌పోర్టుతో కేవలం 25 దేశాలకు మాత్రమే వీసా ఫ్రీ ఎంట్రీ ఉంటుంది.

Also Read :  భర్తని చంపి.. డోర్ డెలివరీ చేసిన భార్య, బంధువులు

Also Read :  ఇదేం చోరీరా నాయనా..సైబర్‌ నేరగాళ్ల సొమ్ముతో ఉడాయించిన పోలీసు జంట..ట్విస్ట్‌ ఏంటంటే?

Visa-Free Entry

Advertisment
తాజా కథనాలు