Missile Test Fail: మళ్లీ పరువు తీసుకున్న పాకిస్తాన్.. సొంత దేశంలోనే కూలిన క్షిపణి.. దుమ్మెత్తి పోస్తున్న ప్రజలు

పాకిస్తాన్ సైన్యం షాహీన్-3 క్షిపణిని పరీక్షించింది. కానీ ఆ టెస్ట్ ఫెయిలైంది. షాహీన్ క్షిపణి టార్గెట్ తప్పి పంజాబ్ ప్రావిన్స్ డేరా ఘాజీ ఖాన్ అణు కేంద్రం సమీపంలో భారీ బ్లాస్ట్ జరిగింది. పేలుడు ధాటికి శిథిలాలు బలూచిస్తాన్‌లోని డేరా బుగ్టి జిల్లాలో పడ్డాయి.

New Update
Missile test fail

PaK Missile test fail

పాకిస్తాన్ సైన్యం ఇటీవల అణ్వాయుధాలను మోసుకెళ్లగల షాహీన్-3 క్షిపణిని పరీక్షించింది. కానీ ఈ టెస్ట్ ఫెయిల్ అయ్యింది. ఆ క్షిపణి టార్గెట్ తప్పిపోయి పంజాబ్ ప్రావిన్స్ డేరా ఘాజీ ఖాన్ అణు కేంద్రం సమీపంలో భారీ బ్లాస్ట్ జరిగింది. పేలుడు ధాటికి దాని శిథిలాలు బలూచిస్తాన్‌లోని డేరా బుగ్టి జిల్లాలో పడ్డాయి. ఇది జనావాసాలకు దగ్గరగా జరిగింది. ఈ సంఘటన పాకిస్తాన్ సైనిక సామర్థ్యం గురించి ప్రశ్నలను లేవనెత్తడమే కాకుండా, బలూచిస్తాన్ ప్రజల భద్రతను కూడా ప్రమాదంలో పడేసింది. 2025 జూలై 22న జరిగిన ఈ ప్రమాదం తర్వాత, పాకిస్తాన్ సైన్యం ఆ ప్రాంతంలో ఇంటర్నెట్‌ను నిలిపివేసి, మీడియాని నిలిపివేసి, ప్రజలను ఇంటి లోపలే ఉండమని సూచించింది.

Also Read :  మీ ఫేవరేట్ హీరో సూర్య గురించి మీకు తెలియని షాకింగ్ విషయాలివే!

షాహీన్-3 క్షిపణి గురించి..

షహీన్-3 పాకిస్తాన్ అత్యంత శక్తివంతమైన క్షిపణులలో ఒకటి. ఇది ఉపరితలం నుండి ఉపరితలానికి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి. ఇది 2750 కిలోమీటర్ల వరకు దూసుకుపోతుంది. అంటే ఇది ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి భారతదేశంలోని అనేక సిటీలను లక్ష్యంగా అటాక్ చేయగలదు. షాహీన్ 20-25 నుంచి 300-500 కిలోటన్నుల వరకు అణ్వాయుధాలను మోసుకెళ్లగలదు. పాకిస్తాన్ 2000లలో చైనా సాంకేతిక సహాయంతో దీనిని నిర్మించడం ప్రారంభించింది. పాకిస్తాన్ దీనిని తన రక్షణ వ్యూహంలో భాగంగా భావిస్తుంది. ముఖ్యంగా భారతదేశాన్ని ఎదుర్కోడానికి తయారు చేస్తోంది. కానీ దాని పరీక్షలలో తరుచూ ఫెయిల్ అవుతూ వస్తుంది. 

Also Read :  నెల్లూరు జిల్లా రాపూరు స్టేట్ బ్యాంక్ ఖాతాలలో నగదు మాయం

జూలై 22న అసలు ఏం జరిగిందంటే

2025 జూలై 22న పాకిస్తాన్ డేరా ఘాజీ ఖాన్‌లోని రాఖీ ప్రాంతం నుంచి షాహీన్-3 క్షిపణిని పరీక్షించింది. కానీ ఆ క్షిపణి దాని టార్గెట్ చేరుకోవడం ఫెయిల్ అయ్యింది. ఇది బలూచిస్తాన్‌లోని డేరా బుగ్టి జిల్లాలోని మాట్ ప్రాంతంలో పడింది. అక్కడ జనావాసాలకు కేవలం 500 మీటర్ల దూరంలో బ్లాస్ట్ అయ్యింది. లూప్ సెహ్రానీ లెవీ స్టేషన్ సమీపంలోని గ్రాపాన్ లోయలో శిథిలాలు పడి భారీ పేలుడు సంభవించింది. బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతాలతో సహా 20-50 కిలోమీటర్ల దూరం వరకు పేలుడు శబ్ధం వినిపించింది. దీనిక సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ప్రజలు భయంతో పారిపోతున్నట్లు కనిపించింది. డేరా ఘాజీ ఖాన్ అణు కేంద్రంపై క్షిపణి పడిందని కొందరు పేర్కొన్నారు. మరికొందరు ఇది శత్రు డ్రోన్ దాడి అని అంటున్నారు.

పాక్ సైన్యం వెంటనే ఆ ప్రాంతంలో ఇంటర్నెట్‌ను నిలిపివేసి, మీడియాను బ్లాక్ చేసి, ప్రజలను ఇంటి లోపలే ఉండమని కోరింది. డీజీ ఖాన్ కమిషనర్ ప్రతినిధి మజార్ షీరానీ మాట్లాడుతూ, ఇది బహుశా ఫైటర్ జెట్ నుంచి వచ్చిన సోనిక్ బూమ్ అయి ఉండవచ్చు. పూర్తి వివరాలకు కోసం దర్యాప్తు చేస్తామన్నారు. రిపబ్లిక్ ఆఫ్ బలూచిస్తాన్ అనే సంస్థ ఈ పరీక్షను తీవ్రంగా ఖండించింది. ఈ క్షిపణి పరీక్ష బలూచిస్తాన్ ప్రజల ప్రాణాలకు ప్రమాదమని వారు అన్నారు. 

Also Read :  మా పవన్ అన్న సినిమా.. నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్!

గతంలో చాలా సార్లు

2023 అక్టోబర్‌లో కూడా షాహీన్-3 పరీక్ష విఫలమైంది. ఆ సమయంలో కూడా డేరా ఘాజీ ఖాన్ సమీపంలో పేలుడు సంభవించింది. దీని శబ్దం 30-50 కిలోమీటర్ల దూరం వరకు వినిపించింది. క్షిపణి అణు కేంద్రంపై పడిందని కొందరు పేర్కొన్నారు, కానీ ప్రభుత్వం దానిని సోనిక్ బూమ్ అని పిలిచింది.

Also Read :  ఖమ్మంలో ప్రేమజంట ఆత్మహత్య.. ఫ్యాన్ కు ఉరేసుకుని ప్రేయసి...చెట్టుకు ఉరేసుకుని ప్రియుడు..

2021 జనవరిలో షాహీన్-3 పరీక్ష విఫలమైంది. క్షిపణి డేరా బుగ్తిలోని జనావాసాల్లో కూలిపోయింది. అనేక ఇళ్ళు ధ్వంసమయ్యాయి. ప్రజలు గాయపడ్డారు. బలూచిస్తాన్‌ను పాకిస్తాన్ సైన్యం ప్రయోగశాలగా మార్చడానికి ఇది రుజువు అని బలూచ్ రిపబ్లికన్ పార్టీ పేర్కొంది.
2020లో బాబర్-II క్షిపణి భూమి, సముద్రం నుండి ప్రయోగించగల బాబర్-II క్షిపణి బలూచిస్తాన్‌లో పరీక్షల సమయంలో కూలిపోయింది.
2022లో జంషోరో: సింధ్‌లోని జంషోరో నగరంలో గుర్తు తెలియని క్షిపణి కూలిపోయింది. ఇది భారతదేశ బ్రహ్మోస్ క్షిపణి ప్రమాదానికి ప్రతిస్పందించే ప్రయత్నం అని కొందరు పేర్కొన్నారు.
పాకిస్తాన్ క్షిపణి సాంకేతికతలో ఇప్పటికీ లోపాలు ఉన్నాయని ఈ ప్రమాదాలు చూపిస్తున్నాయి.

Shaheen 3 test fail | india pak war | blast | latest-telugu-news | pakistan missile test | Shaheen missile

Advertisment
తాజా కథనాలు