/rtv/media/media_files/2025/07/23/india-in-un-2025-07-23-10-47-29.jpg)
India In UN
అంతర్జాతీయ శాంతి, భద్రతల అంశంపై ఐరాస భద్రతా మండలిలో ఉన్నతస్థాయి చర్చ జరిగింది. ఇందులో పాకిస్తాన్ మళ్ళీ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. అది వివాదాస్పద భూభాగమని ప్రపంచం మొత్తానికి తెలుసునంటూ పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ నోరు పారేసుకున్నారు. దాంతో పాటూ సింధుజలాల ఒప్పందం గురించి కూడా మాట్లాడారు.
Also Read : నెల్లూరు జిల్లా రాపూరు స్టేట్ బ్యాంక్ ఖాతాలలో నగదు మాయం
అడ్డుకోవడంతోనే సరిపోతోంది..
దీనికి భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ పాక్ కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. ఐక్యరాజ్యసమితిలో ఇండియా వ్యవస్థాపక సభ్యదేశం. తాము ఎప్పుడు బాధ్యతాయుతంగా ఉంటామని...అన్ని దేశాలతో శాంతి, శ్రేయస్సు కోసం పాటు పడతామని చెప్పారు. భారత్ అన్ని రకాలుగా సమర్ధవంతంగా పని చేస్తూ బలమైన ఆర్ధిక వ్యవస్థగా రూపుదిద్దుకుంటోందని చెప్పారు. కానీ పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదానికి ఊతమిస్తూ ఉన్మాదంలో కూరుకుపోతోందని హరీశ్ దుయ్యబట్టారు. ఐఎంఎఫ్ వంటి అంతర్జాతీయ సంస్థల నుంచి అప్పులు తీసుకోవడంలో ఆ దేశం బిజీగా ఉందంటూ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దాన్ని గుర్తించి , గౌరవించాలని చురకలంటించారు. ఇలాంటివేమీ చెయ్యని పాకిస్తాన్ నీతిసూత్రాలు వల్లించడం హాస్యాస్పదమన్నారు.
Also Read : మా పవన్ అన్న సినిమా.. నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్!
అలాగే పాకిస్తాన్ తో పాటూ అమెరికాకు ఇండియా కౌంటర్ ఇచ్చింది. భారత్, పాక్ మధ్య కాల్పలు విరమణకు తామే కారణమంటూ అమెరికా యూఎన్ లో మళ్ళీ అదే పాట పాడింది. దానికి భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ గట్టి సమాధానం ఇచ్చారు. ఆపరేషన్ సింధూర్ లో తాము అనుకున్న లక్ష్యాలపై అటాక్ చేశాక...పాక్ అభ్యర్ధనతో కాల్పుల విరమణ చేశామని...ఇందులో ఎవరి మధ్యవర్తిత్వం లేదని నొక్కి చెప్పారు.
Also Read: Pakistan: పాకిస్తాన్ లో పరువు హత్య..ప్రేమజంటను కాల్చి చంపిన గుంపు
Also Read : తెలంగాణలో ద్రోణి ప్రభావం...మరో రెండు రోజులు దంచుడే..దంచుడు
un | india | today-latest-news-in-telugu