/rtv/media/media_files/2025/07/23/na-anvesh-2025-07-23-07-46-01.jpg)
ప్రముఖ యుట్యుబర్ నా అన్వేష్ ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడు. అక్కడ నుంచి ఆయన హరిహరవీరమల్లు సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయన మొదటి సినిమా రివ్వ్యూ చేస్తున్నట్లు చెప్పాడు. సినిమా సూపర్ ఉందని, థియేరటర్‌లో గూస్ బమ్స్ వస్తున్నాయని రివ్వ్యూ ఇచ్చాడు. హరిహర వీరమల్లులో బాలయ్య బాబు స్పెషల్ ఎంట్రీ ఉందని అన్నాడు. సినిమా విజయనగరం సామాజ్యం గురించి ఉందని.. హిస్టారిక్ కథలో పవన్ అద్భుతంగా నటించాడని నా అన్వేష్ చెప్పుకొచ్చాడు.
Also Read : ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టిన గంజాయ్ బ్యాచ్
అంతా అబద్ధం అని అన్వేష్ ట్విస్ట్
తర్వాత అదంతా ఫేక్ అని ట్విస్ట్ ఇచ్చాడు నా అన్వేష్. సినిమా రివ్యూలు ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పాడు. అసలు సినిమానే అతను చూడలేదని వీడియోలో చెప్పాడు నా అన్వేష్. మూవీ రివ్యూలు ఇచ్చే వారికి ఓ గుణపాఠం చెప్పాలని ఈ వీడియో చేశానని చెప్పి ఓ పెద్ద షాక్ ఇచ్చాడు.
Also Read : సూర్య బర్త్ డే స్పెషల్ అదిరింది.. 'కరుప్పు' తో తెర పైకి!
Also Read : జడ్జి యశ్వంత్ వర్మ వ్యవహారం.. ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ ఖడ్ రాజీనామా అందుకేనా?
మూవీ రివ్యూలు చెప్పే వారిపై నా అన్వేష్ విరుచుకు పడ్డాడు. ఎంతో మంది కష్టపడి, కోట్లు ఖర్చపెట్టి తీసిని సినిమాలను ఎలా 2 నిమిషాల్లో బాగుంది, బాలేదు అని తేల్చేస్తారని మూవీ రివ్యూలు ఇచ్చే వారిని ప్రశ్నించారు. మూవీ అనేది ప్రొడక్ట్ కాదని, అది అనుభూతి అని చెప్పాడు.రివ్యూలపేరు చెప్పి యూటుబర్లు వేలు వేలు సంపాధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. కొందరు కనీసం సినిమా చూడకుండా రివ్యూలు ఇస్తున్నారని ఆరోపించాడు అన్వేష్.
గతంలో నా అన్వేష్ యూటూబర్ల చేస్తున్న బెట్టింగ్ యాప్‌లపై పోరాటం చేశాడు. ప్రస్తుతం అతను మూవీ రివ్యూలను అరికట్టేందుకు ఈ వీడియో చేసినట్లు తెలుస్తోంది. రివ్యూస్ ఇచ్చే వారిపై బూతులతో రెచ్చిపోయాడు నా అన్వేష్. సినిమా రివ్యూలను అసలు పట్టించుకోవద్దని ప్రేక్షకులను కోరాడు.
Also Read : పాకిస్తాన్ లో పరువు హత్య..ప్రేమజంటను కాల్చి చంపిన గుంపు
deputy cm pavan kalyan | pavan-kalyan | latest-telugu-news | naa anveshana fight | naa anveshana | naa anveshan | Harihara veeramallu reviews | harihara-veeramallu-movie | pawan kalyan harihara veera mallu | Harihara veeramallu