Jagdeep Dankhar: జడ్జి యశ్వంత్ వర్మ వ్యవహారం.. ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ ఖడ్ రాజీనామా అందుకేనా?

ఉన్నట్టుండి ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ ఖడ్ రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశం అయింది. దీనికి కారణం ఆయన ఆరోగ్యమే అని చెబుతున్నా..తెర వెనుక జరిగింది మరొకటి అని అంటున్నారు. హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ వ్యవహారమే దెబ్బ కొట్టిందని అంచనా.

New Update
ind

Vice President Jagdeep Dhankar

హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ శర్మ ఇంట్లో డబ్బుల కట్టలు దొరికాయి. దీంతో ఆయనను పదవి నుంచి తొలగించాలని డిమాండ్లు వినిపించాయి. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక తీర్మానాన్ని సిద్ధం చేసింది. దీనికి సంబంధించి ప్రతిపక్షాల సంతకాలు కూడా తీసుకుంది. లోక్ సభలో ప్రవేశపెట్టాలని కూడా కోరింది. అయితే ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ ఖడ్ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయకుండా ప్రతిపక్ష ఎంపీల తీర్మానాన్ని ఆమోదించారు. అంతేకాదు దీనికి సంబంధించి ప్రభుత్వానికి ఏమీ చెప్పలేదు కూడా. ఇది కేంద్ర ప్రభుత్వానికి ఆగ్రహం కలిగించిందని చెబుతున్నారు. 

Also Read :  యూఎన్ లో పాక్ మళ్ళీ భంగపాటు..అప్పులు అడుక్కుంటోందంటూ భారత్ చురకలు

Also Read :  ఇప్పటికిప్పుడే.. నన్ను పెళ్లి చేసుకుంటావా? లేక చావామంటావా? ఇదేం సైకో లవ్‌రా నాయనా?

అంతా గంటల్లోనే జరిగిపోయింది..

దీని తరువాత కొన్ని గంటల్లోనే జగదీప్ దన్ ఖడ్ రాజీనామా చేశారు.  జగదీప్ ప్రతిపక్ష తీర్మానాన్ని ఆమోదించిన తరువాత ప్రధాని మోదీ తో సీనియర్ మంత్రుల సమావేశం జరిగింది. ఆ తర్వాత మంత్రులు, కేబినెట్‌లోని అత్యంత సీనియర్ సభ్యులలో ఒకరైన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కార్యాలయంలో కలిసి కూర్చుని, అధికార పార్టీ రాజ్యసభ ఎంపీలందరినీ అక్కడికి పిలవాలని బిజెపి చీఫ్ విప్‌ను కోరారు. 10 మంది సభ్యుల బృందాలుగా బిజెపి ఎంపీలను పిలిచి, సిద్ధంగా ఉంచిన ఒక ముఖ్యమైన తీర్మానంపై సంతకం చేయమని కోరారు. ఈ బృందాలు వెళ్లిపోయిన తర్వాత, బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏలోని ఇతర సభ్యుల ఎంపీల సంతకాలను కూడా కోరారు. ఈ తీర్మానం గురించి అందరు ఎంపీలు మాట్లాడకుండా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం తర్వాత తీర్మానం గురించి ఉపరాష్ట్రపతి దన్ ఖడ్ కు చెప్పారని...ఆ తర్వాత ఆయన రాజీనామా చేశారని చెబుతున్నారు. 

మరోవైపు బీహార్‌ ఎన్నికల రాజకీయాలు ప్రారంభమయ్యాయి. జగదీప్ ధన్‌ఖడ్ రాజీనామాపై, ఆర్జేడీ ఎమ్మెల్యే ముఖేష్ రోషన్ మంగళవారం మీడియాతో మాట్లాడారు. నితీష్‌ కుమార్‌ని ఉపరాష్ట్రపతిని చేయడానికి జగదీప్‌ దన్‌ఖడ్ చేత రాజీనామా చేయించారని ఆయన అన్నారు.

Also Read: Fourth Test: ఇదైనా గెలుస్తారా..నాలుగో టెస్ట్ ఈరోజు నుంచే

Also Read :  భారతీయుడికి ఐర్లాండ్‌లో ఘోర అవమానం.. బట్టలు చించి, చిత్రహింసలు

today-latest-news-in-telugu | vice-president | Jagdeep Dhankhar resigns

Advertisment
తాజా కథనాలు