Supreme Court: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు నోటీసులు

రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోగా తమ నిర్ణయం చెప్పాలని కోర్టులు ఆదేశించవచ్చా? అనే అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ అభిప్రాయాన్ని చెప్పాలని నోటీసులు జారీ చేసింది.

New Update
Supreme Court

Supreme Court

ఓ విషయంలో సుప్రీం కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను తెలియజేయాలని నోటీసులు జారీ చేసింది. రాష్ట్రాల శాసనసభలు ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు, రాష్ట్రపతి నిర్దిష్ట గడువులోగా తమ నిర్ణయం చెప్పాలని కోర్టులు ఆదేశించవచ్చా? అనే అంశంపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ మేరకు అభిప్రాయం తెలియజేయాలంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 (1) కింద 14 ప్రశ్నలను సంధిస్తూ సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని కోరారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టును 14 ప్రశ్నలు సంధించారు. తాజాగా అంశంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్రాల అభిప్రాయాలను కోరింది.

Also Read:పహల్గాం ఉగ్ర అనుమానితుడు అరెస్టు.. పట్టించిన ఫేసియల్ రికగ్నిషన్‌

Supreme Court Notices

Also Read: భార్య చేతిలో బలైన మరో భర్త.. సాంబారులో విషం కలిపి హత్య

సీజేఐ జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ ఏఎస్ చందూర్కర్‌లతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణ జరిపింది. వారంలోగా ఈ విషయంలో స్పందన చెప్పాలని ఆదేశించింది. ఈ అంశం రాష్ట్రానికి మాత్రమే కాదని.. దేశానికి సంబంధించిన విషయాన్ని గమనించాలని సుప్రీం కోర్టు   వ్యాఖ్యానించింది. 

Also Read: వీడసలు మనిషేనా.. రూ.20 కోసం కన్నతల్లిని చంపిన కసాయి.. ఎక్కడంటే?

శాసనసభ ఆమోదించిన 10 బిల్లులను ఆమోదించడంలో గవర్నర్‌ తీవ్ర జాప్యం చేస్తున్నారంటూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆశ్రయించింది. ఈ విషయంలో విచారణ జరిపిన సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. నిర్దిష్ట గడువులోగా బిల్లులపై నిర్ణయం చెప్పాలని.. 3 నెలల్లోగా ఆమోదించడమే.. తిరస్కరించడమో చేయాలని సూచించింది. ఈ తీర్పు తర్వాత సైతం ఇలాగే చేస్తూ మళ్లీ తమను ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. రాష్ట్రాలు అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకునే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు కాలపరిమితి ఎలా విధిస్తారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టును ప్రశ్నించారు.

Also Read :  వివో నుంచి మరో కిర్రాక్ స్మార్ట్‌ఫోన్.. ఈసారి తగ్గేదే లే!

latest-telugu-news | state-government | central-government | notices

Advertisment
తాజా కథనాలు