/rtv/media/media_files/2025/07/23/dr-samaram-movie-2025-07-23-21-43-08.jpg)
Dr Samaram Movie
Dr. Samaram Movie: డాక్టర్ సమరం.. ఓ వైద్యుడు, ఓ సంఘసేవకుడు, ఓ సంచలన నటుడు కూడా అని మీకు తెలుసా.. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల నుండి ఎం.బీ.బీ.ఎస్. పట్టా పొందిన డాక్టర్ గోపరాజు సమరం, 1970లో విజయవాడలో తన వైద్య జీవితాన్ని ప్రారంభించారు. ఆయన కేవలం వైద్యుడు మాత్రమే కాదు. ఆయన జీవితమే సేవ, అవగాహన, జ్ఞాన ప్రసారం అనే మూడు స్థంభాలపై నిలిచింది.
వైద్యుడిగా కాదు, మార్గదర్శిగా…
ఫోన్లు లేని రోజుల్లో, ఇంటర్నెట్ అనే పదమే తెలియని కాలంలో, శృంగార సంబంధిత సందేహాలపై ప్రజలకు స్పష్టతనిచ్చిన మొదటి వ్యక్తుల్లో డాక్టర్ సమరం ప్రముఖుడు. అప్పట్లో ఈ విషయాల గురించి మాట్లాడటానికి అందరూ భయపడేవారు, ఆయన మాత్రం నేరుగా తెరపై ఈ సమస్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు.
Also Read: వీడసలు మనిషేనా.. రూ.20 కోసం కన్నతల్లిని చంపిన కసాయి.. ఎక్కడంటే?
ఓ ప్రత్యేక పాత్రలో నటుడిగా నిలిచిన సమరం వైద్యుడు, రచయితగా మాత్రమే కాకుండా, డాక్టర్ సమరం నటుడిగానూ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. "మీ కోసం" అనే సినిమాలో ఆయన వైద్యుడి పాత్ర చేశారు. ఈ సినిమాలో ఆయన పాత్రతోపాటు, పాఠాలు కూడా శృంగార సంబంధిత అవగాహన కల్పించేవే. ఈ సినిమా అప్పట్లో ఎంతో సంచలనం సృష్టించడంతో పాటు, థియేటర్లు హౌస్‌ఫుల్ కావడం విశేషం.
ఆ చిత్రం ప్రస్తుతం యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. ఇంకా చూడకపోతే, "మీ కోసం" అనే చిత్రాన్ని ఓసారి చూసేయండి. అందులోని సూటి మాటలు, సున్నితంగా చెప్పిన డైలాగులు మీకు కచ్చితంగా నచ్చుతాయి.
Also Read : మా పవన్ అన్న సినిమా.. నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్!
రూ. 2తో ఆరోగ్య సేవలు!
వైద్యం ఓ వృత్తిగా కాకుండా ధర్మంగా చూసిన డాక్టర్ సమరం, దాదాపు మూడు దశాబ్దాల పాటు కేవలం రెండు రూపాయల ఫీజుకి సేవలందించారు. పేదల కోసం ఉచిత వైద్య శిబిరాలు, టీకా కార్యక్రమాలు, నేత్ర శిబిరాలు, రక్తదాన శిబిరాలు, పోలియో శస్త్ర చికిత్సలు, కుటుంబ నియంత్రణ శిబిరాలు, హెచ్‌ఐవీ పరీక్షల శిబిరాలు నిర్వహించి వారి గుండెల్లో నిలిచిపోయారు.
మూఢనమ్మకాలపై అపరాజిత పోరాటం
వైద్యం ద్వారా ప్రజల్ని ఆరోగ్యంగా చేస్తూనే, సమాజాన్ని అంధవిశ్వాసాల నుంచి కాపాడటం కోసం ఆయన నిరంతరం పోరాడారు. ఎంతటి విమర్శలు వచ్చినా, ఆయన స్థిరంగా తన పని కొనసాగించారు. 80 ఏళ్ల వయసులోనూ రోజు 18 గంటలపాటు పనిచేస్తూ, నేటికీ సెక్స్ ఎడ్యుకేషన్‌ను తెలుగువారికి దగ్గర చేస్తూ ముందుకు సాగుతున్నారు.
Also Read: లోక్‌సభలో పహల్గాం ఉగ్రదాడిపై చర్చించాలని విపక్షాల పట్టు.. సభ వాయిదా