Hari Hara Veera Mallu: సంచలన వీడియో.. పవన్ బ్యానర్ చించి కాళ్లతో తొక్కిన కార్యకర్తలు..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' సినిమా రేపు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని ఓ థియేటర్ వద్ద నిరసనకారులు రచ్చ రచ్చ చేశారు. థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించేశారు. ఫ్లెక్సీలో పేరు కన్నడలో లేదని గొడవకు దిగారు.

New Update
Hari Hara Veera Mallu bengaluru banner controversy

Hari Hara Veera Mallu

పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ భారీ అంచనాలతో రేపు రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, సాంగ్స్‌, ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 

పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి సినిమా ఇదే కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ ‘హరి హర వీరమల్లు’ సినిమా రేపు విడుదల కానుండగా తాజాగా ఒక షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది.  

Hari Hara Veera Mallu

ఈ మూవీ రిలీజ్‌కు మరికొన్ని గంటలు మాత్రమే ఉండగా.. ఈ నేపథ్యంలో కర్ణాటకలోని ఓ థియేటర్ వద్ద కర్ణాటక రక్షణ వేదిక కార్యకర్తలు రచ్చ రచ్చ చేశారు. ఇందులో భాగంగా థియేటర్ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించేసి హల్ చల్ చేశారు. 

 ఫ్లెక్సీలో పేరు కన్నడలో లేదని వారు గొడవకు దిగారు. సినిమాను కర్ణాటకలో రిలీజ్ చేస్తే.. దాని పేరును కూడా కన్నడలో పెట్టాల్సిందేనంటూ రచ్చ రచ్చ చేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే దీనిపై చాలా మంది రకరకాలు స్పందిస్తున్నారు. ఇలా చేయడం సరికాదని కొందరు విమర్శలు చేస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు