Pakistan: పాకిస్తాన్ లో పరువు హత్య..ప్రేమజంటను కాల్చి చంపిన గుంపు

మనదేశంలో పరువు హత్యలు జరుగుతుంటాయి. అయితే ఇది ఒక్క మన దేశంలోనే కాదు పాకిస్తాన్ లో కూడా చాలా ఎక్కువే ఉంది. ప్రస్తుతం పాకిస్తాన్ లో జరిగిన ఓ పరువు హత్య తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

New Update
pak murder

Pak woman's dishonour-killing

బానో బీబీ, ఇహ్సానుల్లా  జంటను కొంత మంది గ్రైపుగా జీపుల్లో తీసుకువచ్చి మరీ గన్స్ తో కాల్చి చంపేశారు. నిర్జన ఎడారి ప్రదేశంలో జరిగిన ఈ హత్య తాలూకా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో వివరాల్లోకి వెళితే...ఇది పాకిస్తాన్ లో జరిగిన పరువు హత్య అని తెలుస్తోంది. జూన్ లో ఈ హత్య జరిగిందని చెబుతున్నారు. దీని తరువాత ఈ దారుణ సంఘటనలో పాల్గొన్న 13 మందిని బలూచ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. వీరిలో అక్కడ ఒక గిరిజన తెగకు చెందిన అధిపతి సర్దార్ షెర్బాజ్ సతక్జాయ్ కూడా ఒకరు. 

Also Read :  ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టిన గంజాయ్‌ బ్యాచ్‌

Also Read :  సరూర్‌నగర్‌ కిడ్నీరాకెట్‌ కేసులో కీలక పరిణామం..సీఐడీ చేతికి చిక్కిన సూత్రదారి

పాక్ లో మితి మీరుతున్న పరువుహత్యలు..

బానో బాబీ ఆమె ప్రియుడు ఇహ్సానుల్లాల హత్య పరువు హత్య అని చెబుతున్నారు. పాష్టో గిరిజన వంశానికి చెందిన బానో బీబీ జిర్గా వర్గానికి చెందిన ఇహ్సానుల్లా లు ప్రేమించుకున్నారు. ఇది ఆమె అన్నతో పాటూ ఎవరికీ నచ్చలేదు. అందుకే వారు సతక్జాయ్ ఆమోదంతో ప్రేమికులను ఇద్దరినీ ఒకేసారి చంపేశారు. చనిపోయినప్పుడు బానూ బీబీ చేతిలో ఖురాన్ పట్టుకుని ఉంది. మీరు నన్ను కాల్చడం తప్ప ఏమీ చేయలేరని..నాతో ఏడడుగులు నడవండి..ఆ తర్వాత మీరు నన్ను కాల్చి చంపొచ్చని బానూ బీబీ చివరి మాటలు మాట్లాడినట్లు వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. బానో బీబీ హత్య తర్వాత దానికి సంబంధించిన వీడియో పాకిస్తాన్ లో వైరల్ అయింది. దీంతో అక్కడంతా ఆగ్రహావేశాలు చెలరేగాయి.  దీంతో బలూచ్ పోలీసులు వెంటనే గిరిజన నాయకుడు సతక్జాయ్ తో సహా 13 మందిని అరెస్ట్ చేశారు. 

Also Read :  సూర్య బర్త్ డే స్పెషల్ అదిరింది.. 'కరుప్పు' టీజర్ చూశారా

పాకిస్తాన్ లో పరువు హత్యల తీవ్ర సమస్యగా ఉన్నాయని అక్కడి స్థానికులు చెబుతున్నారు. పాక్ మానవ హక్కుల కమిషన్ 2024లో అక్కడ 405 పరువు హత్యలు జరిగాయని చెబుతోంది. ఇందులో ఎక్కువగా మహిళలు 335 మంది ఉండగా..119 మంది పురుషులు ఉన్నారు. ఈ పరువు హత్యలు ఎక్కువగా బెలూచిస్తాన్, పంజాబ్ లలో జరుగుతున్నాయి. బంధువులే వీటిని ఎక్కువగా చేస్తున్నారని అంటున్నారు. 

Also Read: Jagdeep Dankhar: జడ్జి యశ్వంత్ వర్మ వ్యవహారం.. ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ ఖడ్ రాజీనామా అందుకేనా?

pakistan | today-latest-news-in-telugu

Advertisment
తాజా కథనాలు