/rtv/media/media_files/2025/07/23/mission-impossible-final-reckoning-ott-2025-07-23-15-29-17.jpg)
Mission Impossible Final Reckoning OTT
Mission Impossible Final Reckoning OTT: టామ్ క్రూజ్(Tom Cruise ) నటించిన స్పై థ్రిల్లర్ సిరీస్ "మిషన్ ఇంపాజిబుల్" చివరి భాగం అయిన "మిషన్ ఇంపాజిబుల్ - ది ఫైనల్ రెకనింగ్" త్వరలో డిజిటల్ ప్లాట్‌ఫామ్లపై అందుబాటులోకి రానుంది. థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ సొంతం చేసుకున్న ఈ మూవీ త్వరలో మీ ఇంటికే వస్తోంది.
ఈ సినిమా 2025 ఆగస్టు 19 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో, యాపిల్ టీవీ, ఫాండాంగో అట్ హోం లాంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కొనుగోలు చేయడానికి, అద్దెకు లభ్యం కానుంది అని తెలుస్తోంది.
కథ ఏంటంటే..?
ఈ సినిమా కథ, గత భాగం కథ ముగిసిన కొన్ని నెలల తరువాత నుండి ప్రారంభమవుతుంది. హీరో ఈథన్ హంట్ (టామ్ క్రూజ్) ఓ డిజిటల్ విలన్‌తో యుద్ధానికి సిద్ధమవుతాడు. "ది ఎంటిటీ" అనే పేరు కలిగిన ఓ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచ దేశాలను విడదీస్తోంది. ఇది జాతుల మధ్య చిచ్చు పెడుతూ, రాజకీయ సంక్షోభాలను సృష్టిస్తూ మానవాళిని అణు యుద్ధానికి దగ్గర చేస్తోంది.
Also Read: ఛీ.. వీడు తండ్రేనా.. కన్న కూతురుపై శాడిజం! కాలితో తన్నుతూ చిత్రహింసలు!
ఈ పరిస్థితిలో, ప్రపంచాన్ని రక్షించగల వ్యక్తి ఈథన్ మాత్రమేనన్న అందరూ నమ్ముతారు. రష్యన్ సబ్‌మెరిన్‌లో బేరింగ్ సముద్ర తలభాగంలో ఉన్న AI యొక్క సోర్స్ కోడ్‌ను ఎలా పొందుతాడు అనేది కధలో కీలకం. "Our lives are the sum of our choices" లాంటి డైలాగ్స్ ఎమోషనల్ గా సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి.
Also Read : మా పవన్ అన్న సినిమా.. నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్!
ఈ సినిమాను డిజిటల్‌గా కొన్నవారికి ఎక్సట్రా కంటెంట్ కూడా లభిస్తుంది. విమానాలపై, సముద్రపు సాహసాల్లో తీసిన స్టంట్‌లు ఎలా తెరకెక్కించారో చూపించే ప్రత్యేక వీడియోలు, తొలగించిన సన్నివేశాలు, దర్శకుడు క్రిస్టోఫర్ మెక్వారీతో ఇంటర్వ్యూలు, టామ్ క్రూజ్‌తో పాటు ఫిల్మ్ యూనిట్ మాట్లాడిన ప్రత్యేక వీడియో బైట్స్ ఇవన్నీ లభించనున్నాయి. అయితే, ఈ మూవీ 2025 మే 23 న నేషనల్ వైడ్ గా థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.
ఈ సినిమాను 4K అల్ట్రా హెచ్‌డీ, బ్లూ-రే, డీవీడీలు 2025 అక్టోబర్ 14 న విడుదల కానున్నాయి. "మిషన్ ఇంపాజిబుల్" సిరీస్ మొదటి ఏడూ సినిమాలు Paramount+ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్నాయి.
Also Read: నువ్వో పిల్ల బచ్చగాడివి, నీకేం తెలుసు ..అసెంబ్లీలో ఊగిపోయిన సీఎం నితీష్!