Hyderabad: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత.. 9మంది అరెస్ట్‌

HYDలో డ్రగ్స్‌ విక్రయిస్తున్న 9 మందిని హెచ్‌న్యూ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 286 గ్రాముల కొకైన్‌, 11 గ్రాముల ఎక్స్‌టసీ, తుపాకీ, 12 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

New Update
Hyderabad Police arrest 9 people selling drugs

Hyderabad Police arrest 9 people selling drugs

హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ మాఫియాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగానే తాజాగా నగరంలో భారీ ఎత్తున డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.  డ్రగ్స్‌ విక్రయిస్తున్న 9 మందిని హెచ్‌న్యూ పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

drugs seized in hyderabad

ఈ తొమ్మిది మందిలో ఆరుగురు కొకైన్‌ సరఫరా చేస్తున్నవారు కాగా.. మరో ముగ్గురు మెఫిడ్రీన్‌ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన అనంతరం నిందితుల నుంచి 286 గ్రాముల కొకైన్‌, 11 గ్రాముల ఎక్స్‌టసీ, ఒక గన్, 12 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు