Rain Tips: ఈ వారమంతా వానలే.. ఈ 5 జాగ్రత్తలు తీసుకుంటే మీరు సేఫ్!

మరో వారంపాటు వర్షాలు దంచికొట్టనున్నాయి. అందువల్ల ప్రజలు కొన్ని సూచనలను ముందుగానే పాటిస్తే టైంను ఎంతో సేవ్ చేసుకోగలుగుతారు. వాతావరణాన్ని ముందుగానే గ్రహించి ఆఫీసుకు బయల్దేరాలి. సరుకులు ముందునే తెచ్చుకోవాలి. వాహనాల్లో పెట్రోల్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి.

New Update
monsoon tips

Rain Tips

రెండు రాష్ట్రాల్లో వర్షం దంచికొడుతోంది. గత వారం రెండు వారాల నుంచి వర్షం బీభత్సం సృష్టిస్తోంది. దీంతో జాబ్స్ చేస్తున్న ఉద్యోగస్థులు, పనిమీద బయటకు వెళ్లాల్సిన ప్రజలు, స్కూల్‌కు వెళ్లాల్సిన పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుని ఆఫీసులకు లేట్‌గా వెళ్తూ మేనేజర్లు, కంపెనీ హెడ్‌ల చేత తిట్లు తింటుంటారు. అయితే వర్షాకాలంలో కొన్ని జాగ్రత్తలు, ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల అన్ని పనులను అనుకున్న టైం కంటే ముందుగానే చేసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందాం. 

ఆఫీసుకు ముందుగానే చేరుకునే మార్గం

పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు.. మరీ ముఖ్యంగా ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో జాబ్స్ చేస్తున్న వారు వాతావరణ పరిస్థితిని ముందుగానే గ్రహించి ఆఫీసుకు బయలుదేరితే మంచిది. ఆ సమయంలో ట్రాఫిక్‌లో ఇరుక్కుపోకుండా.. హ్యాపీగా ఆఫీసుకు అనుకున్న టైం కంటే ముందుగానే చేరుకోవచ్చు. ఇలా ఉద్యోగానికి వెళ్లేవారు మాత్రమే కాకుండా ఇంటి పనులు చేసుకోవలసిన వారు కూడా ముందుగానే వాతావరణ పరిస్థితిని గ్రహించి అన్ని పనులు చేసుకుంటే మంచిది. 

ఇంటికి సరుకులు

ఇది వర్షాకాలం కాబట్టి తరచూ ఏదో ఒక సమయంలో వర్షం పడుతూనే ఉంటుంది. అందువల్ల ముందుగానే ఇంటికి సరుకులు తెచ్చుకోవాలి. పొడి వాతావరణం ఉన్నపుడు కూరగాయలు వంటివి తెచ్చుకుంటే మంచిది. లేదంటే వర్షానికి మార్కెట్‌లో ఉన్న చెడు నీరు కూరగాయలపై పడి.. అది అనేక బ్యాక్టీరియాలకు దారి తీస్తుంది.

పెట్రోల్/డీజిల్ చెక్

మరోవైపు ఈ సీజన్‌లో దూర ప్రయాణాలు చేసేవారు.. ఇతర పనుల కోసం వాహనాలు ఉపయోగించేవారు కొన్ని ముఖ్యమైన సూచనలు పాటించాల్సి ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా బైక్స్, కారులు, ఇతర వాహనాలు ఉపయోగించేవారు ముందుగానే తమ వాహనాలలో పెట్రోల్, డీజిల్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకోవడం ద్వారా వర్షం సమయంలో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. వాహనాలు మధ్యలో ఆగిపోతాయన్న భయం కూడా ఉండదు. అలాగే బ్రేక్స్ కూడా తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలి. ఎందుకంటే ఈ సీజన్‌లో వర్షం కారణంగా బ్రేకులు ఒక్కోసారి ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. 

Also Read : మా పవన్ అన్న సినిమా.. నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్!

వాటర్ హీటర్‌తో జాగ్రత్త

ఇక ఇళ్లలో ఉన్నవారు కూడా కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సీజన్‌లో చాలా మంది వేడినీళ్ల కోసం వాటర్ హీటర్ ఉపయోగిస్తుంటారు. అయితే అలాంటి వారు చాలా కేర్ ఫుల్ గా ఉండాలి. ఇంట్లో వాటర్ హీటర్‌ను సిల్వర్ బకేట్ లేదా స్టీల్ బిందెలు వంటి పాత్రలలో పెట్టకూడదు. దాని వల్ల కరెంట్ షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. అలాగే చిన్న పిల్లలు ఉన్న దగ్గర మరింత జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. పిల్లలు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. 

రెయిన్ కోట్‌/ గొడుగు

ఈ సీజన్‌లో అతి ముఖ్యమైది రెయిన్ కోట్ లేదా గొడుగు. ఇది లేకుండా ఎక్కడకీ వెళ్లలేరు. జోరు వానలో ఇవి తడవకుండా చూస్తాయి. వీటిని కాదని.. వర్షంలో తడిస్తే మాత్రం హాస్పిటల్స్‌కు భారీ మూల్యం చెల్లించక తప్పదు. వర్షంలో తడవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. దీంతో హాస్పిటల్ పాలై వేలకు వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.  

Advertisment
తాజా కథనాలు