Hari Hara Veera Mallu: ఇంత అభిమానమేంట్రా.. ‘హరిహర వీరమల్లు’ కోసం ఫ్యాన్స్ ఎలా కష్టపడుతున్నారో చూశారా?

పవన్ కల్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా సందడి చేస్తున్నారు. సినిమా విడుదల ఉత్సాహాన్ని చాటుతూ పలు జిల్లాల్లో భారీ బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

New Update
Pawan fans create a buzz by holding rallies on bikes

Pawan fans create a buzz by holding rallies on bikes

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ‘హరిహర వీరమల్లు’ సినిమా రేపు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో పవన్ అభిమానులు రాష్ట్రవ్యాప్తంగా సందడి చేస్తున్నారు. సినిమా విడుదల ఉత్సాహాన్ని చాటుతూ పలు జిల్లాల్లో భారీ బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని పలు నగరాలు, పట్టణాల్లో పవన్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున బైక్ లపై ర్యాలీలు తీస్తున్నారు. 

Hari Hara Veera Mallu

సినిమా విడుదలవుతున్న థియేటర్ల వద్ద, ముఖ్య కూడళ్లలో పవన్ కళ్యాణ్ కటౌట్లు, బ్యానర్లు ఏర్పాటు చేసి బైక్‌లపై తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ‘జై పవన్’, ‘జై జనసేన’, ‘హరిహర వీరమల్లు’ అంటూ నినాదాలు చేస్తూ సందడి చేస్తున్నారు. బైక్ ర్యాలీలతో పాటు, చాలా చోట్ల పవన్ అభిమానులు సామాజిక కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ హీరో పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో పోలీసులు కూడా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు