Shocking Video: షాకింగ్ వీడియో.. యువతిని ఉతికారేశాడు - కడుపులో తన్ని, జుట్టు పట్టుకుని ఈడ్చేసిన యువకుడు!

మహారాష్ట్ర కల్యాణ్ లోని ఓ క్లినిక్ లో రిసెప్షనిస్ట్ పై గోకుల్ ఝా అనే వ్యక్తి దారుణంగా దాడి చేశాడు. జుట్టు పట్టుకుని లాగి, పిడిగుద్దులతో తన్నిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. వెయిట్ చేయమని చెప్పినందుకు ఆ వ్యక్తి ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది.

New Update
A receptionist girl beaten up by a Guy in Kalyan MH

A receptionist girl beaten up by a Guy in Kalyan MH

మహారాష్ట్రలోని థానే జిల్లా కల్యాణ్‌లో దారుణం జరిగింది. హాస్పిటల్‌లో పనిచేస్తున్న రిసెప్షనిస్ట్ పై ఓ యువకుడు రెచ్చిపోయాడు. ఆ యువతి కడుపులో ఎగిరెగిరి తన్నుతూ.. జుట్టు పట్టుకుని అటు ఇటు గుంజేశాడు. ఈ దారుణ దాడి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి సంచలనం సృష్టిస్తోంది. జులై 21న (సోమవారం) సాయంత్రం జరిగిన ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

receptionist girl beaten by man

కల్యాణ్ లోని నందివలి ప్రాంతంలో డా. అనికేత్ పాలందేకికి సంబంధించిన శ్రీ బాలచికిత్సాలయ క్లినిక్ ఉంది. అందులో సోనాలి కలసరే (25) అనే యువతి రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తోంది. సోమవారం సాయంత్రం డాక్టర్ మెడికల్ రిప్రెజెంటేటివ్‌తో సమావేశంలో ఉన్నారు. అదే సమయంలో ఓ పేషెంట్ బంధువు అయిన గోకుల్ ఝా అనే వ్యక్తిని కాసేపు వెయిట్ చేయమని సోనాలి కోరింది. దీనిపై ఆగ్రహం చెందిన గోకుల్ ఝా.. ఆ యువతిపై దాడి చేశాడు. 

సీసీటీవీ ఫుటేజీలో రికార్డ్ అయిన వీడియో ప్రకారం.. గోకుల్ ఝా ఆగ్రహంతో సోనాలి కడుపులో తన్నాడు. ఆపై ఆమె జుట్టు పట్టుకుని కిందకు లాగి, ముఖంపై పిడిగుద్దులు గుద్దాడు. దీంతో అక్కడే ఉన్న ఇతర పేషెంట్ల బంధువులు జోక్యం చేసుకుని ఆ యువతిని రక్షించారు. ఈ దాడిలో సోనాలికి తీవ్ర గాయాలయ్యాయి. 

Also Read : మా పవన్ అన్న సినిమా.. నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్!

ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో.. మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (MNS) నాయకులతో పాటు పలు రాజకీయ పార్టీల కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు అప్రమత్తమై దాడి చేసిన నిందితుడు గోకుల్ ఝాను మంగళవారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. గోకుల్ ఝాకు క్రిమినల్ చరిత్ర ఉందని, గతంలో కూడా పలు కేసులు నమోదయ్యాయని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఝాతో పాటు అతని సోదరుడు, మరో ఇద్దరు మహిళలను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

Advertisment
తాజా కథనాలు