/rtv/media/media_files/2025/06/05/jUxHQGblw98OOdrKLLl8.jpg)
Trump issues travel ban on 12 countries, Saving US from foreign terrorists
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాలను ప్రకటించాక...అన్ని దేశాలు అగ్రరాజ్యంతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి చర్చలు చేస్తున్నాయి. భారత్ కూడా ఇందులో ఉంది. అయితే అందరికన్నా ముందు జపాన్ తో అమెరికా అతి పెద్ద ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం జపాన్ అమెరికాలో 550 బిలియన్ డాలర్ల పెట్టుబడిని పెట్టనుంది. దాంతో పాటూ ట్రంప్ 15 శాతం సుంకాలను కూడా అనుమతించింది. దీంతో లక్షలాది ఉద్యోగాలను సృష్టించవచ్చని...అమెరికాకు 90 శాతం లాభాలు వస్తాయని ట్రంప్ తెలిపారు.
Also Read : ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టిన గంజాయ్ బ్యాచ్
/filters:format(webp)/rtv/media/media_files/2025/07/23/japan-deal-2025-07-23-07-29-28.png)
Also Read : సూర్య బర్త్ డే స్పెషల్ అదిరింది.. 'కరుప్పు' తో తెర పైకి!
మొత్తం నేనే చేశాను..
ఈ ఒప్పందం తర్వాత జపాన్ తో ఉన్న అన్ని రకాల వాణిజ్య అడ్డంకులు తొలగిపోనున్నాయి. కార్లు, ట్రక్కులు, బియ్యంతో ఇతర వ్యవసాయ ఉత్పత్తులను అమెరికా దిగుమతి చేసుకోనుంది. దీని ద్వారా జపాన్ సరుకులకు అమెరికాలో ఎక్కువ వినియోగం వస్తుందని ట్రంప్ చెప్పారు. దీంతో పాటూ ట్రంప్ ముందు నుంచీ చెబుతున్న 15 శాతం సుంకాలను కూడా ఇవ్వడానికి టోక్యో ఒప్పుకుంది. ఈ మొత్తం ఒప్పందం తానే చూసుకున్నానని...చర్చలు జరపడంలో చురుకుగా వ్యవహరించానని అమెరికా అధ్యక్షుడు తెలిపారు. తన సూచనలు మేరకే జపాన్ అమెరికాలో 550 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి ఒప్పుకుందని చెప్పారు.
Also Read : జడ్జి యశ్వంత్ వర్మ వ్యవహారం.. ఉపరాష్ట్రపతి జగదీప్ దన్ ఖడ్ రాజీనామా అందుకేనా?
Also Read : ఇదైనా గెలుస్తారా..నాలుగో టెస్ట్ ఈరోజు నుంచే
today-latest-news-in-telugu | america tarrifs