/rtv/media/media_files/2025/07/23/ambati-rambabu-tweet-on-pawan-kalyan-hari-hara-veera-mallu-movie-2025-07-23-15-14-36.jpg)
Ambati Rambabu tweet on pawan kalyan hari hara veera mallu movie
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'హరిహర వీరమల్లు' చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా పవన్ కళ్యాణ్‌పై విమర్శల దాడి చేసే అంబటి.. ఈసారి ఊహించని విధంగా సినిమా విజయాన్ని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.
Ambati Rambabu Tweet
అంబటి రాంబాబు తన ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో ట్వీట్ చేస్తూ.. ‘‘పవన్ కల్యాణ్ గారి 'హరిహర వీర మల్లు' సూపర్ డూపర్ హిట్టై కనక వర్షం కురవాలని కోరుకుంటున్నాను!’’ అని పోస్ట్ చేశారు. ఆయన ఈ ట్వీట్‌లో పవన్ కళ్యాణ్‌తో పాటు నాగబాబును కూడా ట్యాగ్ చేశారు.
పవన్ కళ్యాణ్ గారి
— Ambati Rambabu (@AmbatiRambabu) July 23, 2025
"హరిహర వీర మల్లు"
సూపర్ డూపర్ హిట్టై
కనక వర్షం కురవాలని
కోరుకుంటున్నాను !@PawanKalyan@NagaBabuOffl
ఈ ట్వీట్ ఇప్పుడు అటు సినీ, ఇటు రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగించడమే కాకుండా తీవ్రమైన చర్చను రేకెత్తించింది. ఒకవైపు వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ తన సొంత సినిమా కోసం టికెట్ ధరలు భారీగా పెంచారని విమర్శలు చేస్తున్నారు. ఈ తరుణంలో అంబటి రాంబాబు ఇలా సినిమా విజయాన్ని కోరుకోవడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే కొంతమంది నెటిజన్లు అంబటి రాంబాబులో ఇంత మార్పా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు ఆయన వ్యంగ్యంగా ట్వీట్ చేసి ఉంటారని అభిప్రాయపడుతున్నారు.
Also Read : మా పవన్ అన్న సినిమా.. నారా లోకేష్ ఇంట్రెస్టింగ్ ట్వీట్!
ఏదేమైనా, రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, ఒక సినీ ప్రముఖుడి సినిమా విజయాన్ని ఆకాంక్షిస్తూ ఒక రాజకీయ నాయకుడు ట్వీట్ చేయడం అరుదైన విషయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంబటి రాంబాబు ట్వీట్ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో మాత్రం జోష్ నింపుతోంది.