Nagarkurnool : నాగర్ కర్నూలు జిల్లాలో నలుగురు పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్‌

నాగర్ కర్నూల్ జిల్లాలో నలుగురు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేశారు. ఆర్థిక సంఘం నిధుల దుర్వినియోగం, పాత పునాదులకు ఇందిరమ్మ ఇళ్ల బిల్లులకు సిఫార్సు చేయటంతో కార్యదర్శులను సస్పెండ్ చేస్తూ కలెక్టర్‌ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

New Update
Panchayat Secretaries

Panchayat Secretaries

Suspension Of Four Panchayat Secretaries

నాగర్ కర్నూల్ జిల్లాలో నలుగురు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేశారు. ఆర్థిక సంఘం నిధులను దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో వారిని సస్పెండ్ చేసినట్లు సమాచారం. మరోవైపు పాత పునాదులకు ఇందిరమ్మ ఇళ్ల బిల్లులకు సిఫార్సు చేయటంతో కలెక్టర్‌ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌ సస్పెన్షన్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా సస్పెండ్‌ అయిన వారిలో బలమూర్‌ మండలం పోలిశెట్టిపల్లి కార్యదర్శి బాలరాజ్‌,బిజినేపల్లి మండలం గంగారాం కార్యదర్శి నరేందరెడ్డి ,బిజినేపల్లి మండలం అల్లీపూర్‌ కార్యదర్శి రజని,ఊర్కొండ మండలం గుడిగానిపల్లి కార్యదర్శి రాంచంద్రయ్య ఉన్నారు.

Also Read :  ఉపరాష్ట్రపతి రేస్‌లో ఉన్న ఐదుగురు.. వారిలో ఇద్దరు దక్షణాది మహిళలే!

Also Read :  మరో కొద్ది గంటల్లో భారీ వర్షం.. ఈ జిల్లాల వారు జర ఫైలం

Also Read :  బాయ్ ఫ్రెండ్ తో రెచ్చిపోయిన బిగ్ బాస్ బ్యూటీ.. అక్కడ రొమాంటిక్ షూట్!

Also Read :  మీ ఫేవరేట్ హీరో సూర్య గురించి మీకు తెలియని షాకింగ్ విషయాలివే!

Mahabhubnagar | suspension | panchayat-secretary | nagar-kurnool | nagar-kurnool-district

Advertisment
తాజా కథనాలు