Ganjai Batch: ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టిన గంజాయ్‌ బ్యాచ్‌

రాష్ట్ర వ్యాప్తంగా గంజాయ్‌ బ్యాచ్‌ రెచ్చిపోతుంది. రాష్ట్రంలో విచ్చల విడిగా గంజాయ్ లభిస్తుండటంతో గ్రామాల్లో సైతం గంజాయ్‌ బ్యాచ్‌లు వీరంగం సృష్టిస్తున్నాయి. తాజాగా  పార్కింగ్‌లో ఉన్న నైట్‌హాల్ట్‌ ఆర్టీసీ బస్సుకు ఆకతాయి గంజాయ్‌ గ్యాంగ్‌ నిప్పుపెట్టింది.

New Update
Ganjai batch sets fire to RTC bus

Ganjai batch sets fire to RTC bus

రాష్ట్ర వ్యాప్తంగా గంజాయ్‌ బ్యాచ్‌ రెచ్చిపోతుంది. రాష్ట్రంలో విచ్చల విడిగా గంజాయ్ లభిస్తుండటంతో గ్రామాల్లో సైతం గంజాయ్‌ బ్యాచ్‌లు వీరంగం సృష్టిస్తున్నాయి. తాజాగా  పార్కింగ్‌లో ఉన్న నైట్‌హాల్ట్‌ ఆర్టీసీ బస్సుకు ఆకతాయి గంజాయ్‌ గ్యాంగ్‌ నిప్పుపెట్టిన ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం తడకమళ్ల గ్రామంలో అర్ధరాత్రి చోటు చేసుకుంది. నైట్ హాల్ట్ కోసం పార్క్ చేసిన బస్సుకు నిప్పు పెట్టడంతో బస్సు లోపలి భాగం కాలిబూడిదైంది. స్థానికంగా తాగుబోతులు, గంజాయ్ బ్యాచ్‌ ఆగడాలు మితిమీరాయని, ఈ ఘటనకు వారే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.

Also Read : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం కోర్టు నోటీసులు

Also Read :  యూఎన్ లో పాక్ మళ్ళీ భంగపాటు..అప్పులు అడుక్కుంటోందంటూ భారత్ చురకలు

Ganjai Batch Fire RTC Bus

స్థానికుల కథనం ప్రకారం..మిర్యాలగూడ డిపోకు చెందిన టీఎస్‌ 05జెడ్‌ 0047 నంబర్‌ పల్లెవెలుగు బస్సును రోజు మాదిరిగానే గ్రామంలోని ప్రధాన బస్‌స్టాప్‌ కూడలిలో పార్కింగ్‌ చేశారు. గుర్తుతెలియని వ్యక్తులు బస్సు వెనుకవైపు నిప్పంటించడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్‌, కండక్టర్‌.. పోలీసులు, ఫైర్‌ సిబ్బందికి సమాచారమివ్వడంతో వారు ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో బస్సు వెనుక భాగం టైర్లతో సహా పూర్తిగా దగ్ధమైంది. తాగుబోతులు, గంజాయి బ్యాచ్ పనేనని స్థానికుల సమాచారం మేరకు నిప్పుపెట్టిన ఆకతాయిల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.

Also Read: Duvvada Srinivas – Maduri: దువ్వాడ జంట రొమాంటిక్ ప్రీవెడ్డింగ్ షూట్.. వీడియో చూస్తే పిచ్చెక్కిపోతారు..!

Also Read :  పాకిస్తాన్ లో పరువు హత్య.. ప్రేమజంటను కాల్చి చంపిన గుంపు

Fire Acc!dent | miryalaguda news | miryalaguda | rtc-bus-stand | tgsrtc-bus | rtc-bus

Advertisment
తాజా కథనాలు