/rtv/media/media_files/2025/07/21/duvvada-srinivas-madhuri-in-wayanad-2025-07-21-16-43-21.jpg)
Duvvada Srinivas Madhuri In Wayanad
దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి మధ్య సంబంధం గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. వారిద్దరి మధ్య ప్రేమ సంబంధం ఉందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై వారిద్దరూ కూడా బహిరంగంగా స్పందించారు. దివ్వెల మాధురి పలు సందర్భాల్లో మాట్లాడుతూ.. దువ్వాడ శ్రీనివాస్‌తో తనది పవిత్రమైన బంధం అని, ఇది అక్రమ సంబంధం కాదని స్పష్టం చేశారు. విడాకులు వచ్చాక ఇరువురు పెళ్లి చేసుకుంటామని కూడా ఆమె బహిరంగంగా ప్రకటించారు. ఆయనను 'రాజా' అని పిలుస్తూ, తమ ప్రేమకు వయసుతో సంబంధం లేదని పేర్కొన్నారు.
Also Read: లోక్‌సభలో పహల్గాం ఉగ్రదాడిపై చర్చించాలని విపక్షాల పట్టు.. సభ వాయిదా
Duvvada Srinivas Madhuri
అనంతరం ఈ జంట తరచూ సోషల్ మీడియాలో కనిపించి రచ్చ రచ్చ చేస్తుంది. వారు కలిసి ఆలయాలను సందర్శించడం, ముఖ్యంగా తిరుమలలో ఫోటోషూట్‌లు చేయడం, రీల్స్ చేయడం వంటివి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి కలిసి డ్యాన్స్ చేసిన వీడియోలు, ఇంటర్వ్యూలు కూడా విపరీతంగా వైరల్ అయ్యాయి.
Also Read: వీడసలు మనిషేనా.. రూ.20 కోసం కన్నతల్లిని చంపిన కసాయి.. ఎక్కడంటే?
ఇందులో భాగంగా ఈ లవ్ కపుల్ మరోసారి వార్తల్లో నిలిచారు. దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి ఈసారి లాంగ్ టూర్ వేసినట్లు తెలుస్తోంది. ఇద్దరూ కలిసి వయనాడ్‌లో ఎంజాయ్ చేస్తున్న ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వయనాడ్‌లో దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి కలిసి ఒక స్పెషల్ సాంగ్ వీడియోను షూట్ చేశారు.
Also Read:ఈ వారం ఓటీటీ, థియేటర్ లో రచ్చ రచ్చ.. ఫుల్ సినిమాలు లిస్ట్ ఇదే
ఈ వీడియోలో వారిద్దరూ కలిసి డ్యాన్స్ చేయడం చూడవచ్చు. ఈ సాంగ్ షూట్‌లో వారిద్దరి మధ్య ఉన్న 'కెమిస్ట్రీ' అభిమానుల దృష్టిని ఆకర్షించిందని పలువురు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ వీడియో షూటింగ్ ఒక సినిమా కోసమా లేదా వారి వ్యక్తిగత సోషల్ మీడియా కోసం చిత్రీకరించబడిందా అనేది స్పష్టంగా తెలీదు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.
divvela madhuri news