కార్పొరేట్ హత్యలు.. పని చేస్తున్నామా..చావుకు దారులు వేసుకుంటున్నామా?

ఎర్నెస్ట్ అండ్ యంగ్ లో పనిచేస్తూ చనిపోయిన అన్నా మరణం ఇప్పుడు కార్పొరేట్ హత్యల మీద చర్చకు దారి తీస్తోంది. ఉద్యోగులు పని చేస్తున్నారా లేదా తమ చావుకు తామే దారులు వేసుకుటున్నారా అనే సందేహాలు వెలువడుతున్నాయి. ఏ వెలుగుల కోసం ఇదంతా అనే ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.

George: లోయలో పడ్డ బస్సు.. ముగ్గరు జవాన్లు మృతి

జమ్మూకశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో సరిహద్దు భద్రతా దళం (BSF) బలగాలు ప్రయాణిస్తున్న ఓ బస్సు లోయలో పడి ముగ్గురు జవాన్లు మృతి చెందారు. మరో 30 మంది గాయాలపాలయ్యారు. అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

Canara Bank:కెనెరా బ్యాంకులో 3000 ఉద్యోగాలు.. రేపటినుంచే అప్లికేషన్స్!

నిరుద్యోగులకు శుభవార్త. డిగ్రీ అర్హతతో కెనెరా బ్యాంక్ లో 3000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజైంది. అర్హతగల అభ్యర్థులు సెప్టెంబర్‌ 21 నుంచి అక్టోబర్‌ 4వరకు ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి. https://canarabank.com/pages/Recruitment

స్టార్ హెల్త్ కస్టమర్లకు షాక్.. టెలిగ్రామ్‌లో కస్టమర్ల డేటా!

స్టార్ హెల్త్ కంపెనీ కస్లమర్ల డేటా చోరీకి గురైంది. టెలిగ్రామ్‌లో చాట్‌బోట్ల ద్వారా స్టార్ హెల్త్‌కి చెందిన కస్లమర్ల వ్యక్తిగత డేటా లీక్ అయ్యిందని తెలుస్తోంది. చాట్ బాట్ సష్టికర్త ఓ సెక్యూరిటీ రీసెర్చ్‌కు ఈ విషయాన్ని చెప్పడంతో వెలుగులోకి వచ్చింది.

Breaking: తిరుమల ప్రసాదంపై సీబీఐ విచారణకు కేంద్ర మంత్రి డిమాండ్‌

తిరుమల ప్రసాదంపై సీబీఐ విచారణకు కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ డిమాండ్‌ చేశారు. లక్షలాది మంది భక్తులకు సంబంధించిన ఈ అంశాన్ని అత్యంత సీరియస్ గా పరిణించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయన్ని వ్యక్తం చేశారు.

Kolkata: ఆందోళన విరమించిన జూడాలు..శనివారం నుంచి విధుల్లోకి

కోలకత్తా ట్రైనీ డాక్టర్ హత్యాచారం తర్వాత దాదాపు నెల రోజులుగా నిరసనలు చేస్తూ విధులకు దూరంగా ఉన్న జూనియర్ డాక్టర్లు మొత్తానికి తమ ఆందోళనను విరమించారు. శనివారం నుంచి డ్యూటీలో జాయిన్ అవుతామని ప్రకటించారు.

Pesticide: తెలంగాణలో మితిమీరిన పురుగు మందుల వాడకం.. ఎన్‌ఐఎన్‌ ఆందోళన!

దేశంలోనే తెలంగాణలో పెస్టిసైడ్స్ అతిగా వినియోగిస్తున్నట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి తెలిపింది. ప్రమాదకరమైన 11 మందులు వాడుతున్నట్లు జాతీయ పోషకాహార సంస్థ వెల్లడించింది. రైతుల రక్తం, మూత్ర నమూనాల్లో వ్యాధుల బారినపడే లక్షణాలు కనిపించినట్లు స్పష్టం చేసింది.

Web Stories
web-story-logo 'బిగ్‌బాస్‌' లో మొదటి వారమే ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్స్‌ వీళ్లే! వెబ్ స్టోరీస్

'బిగ్‌బాస్‌' లో మొదటి వారమే ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్స్‌ వీళ్లే!

web-story-logo చీరలో మెరిసిపోతున్న మిత్రవింద..! వెబ్ స్టోరీస్

చీరలో మెరిసిపోతున్న మిత్రవింద..!

web-story-logo బిగ్ బాస్ సీజన్ 8లో ఆర్జీవీ హీరోయిన్.! వెబ్ స్టోరీస్

బిగ్ బాస్ సీజన్ 8లో ఆర్జీవీ హీరోయిన్.!

web-story-logo సంయుక్త అందాల అరాచకం.. చీరలో అదుర్స్! వెబ్ స్టోరీస్

సంయుక్త అందాల అరాచకం.. చీరలో అదుర్స్!

web-story-logo పింక్ లెహంగాలో మిల్కీ బ్యూటీ అందాలకు ఫిదా..! వెబ్ స్టోరీస్

పింక్ లెహంగాలో మిల్కీ బ్యూటీ అందాలకు ఫిదా..!

web-story-logo ఉర్ఫీ మ్యాజికల్ ఫ్యాషన్ ..  చూస్తే ఫిదా.! వెబ్ స్టోరీస్

ఉర్ఫీ మ్యాజికల్ ఫ్యాషన్ .. చూస్తే ఫిదా.!

web-story-logo ఒళ్లు నొప్పులు వేధిస్తున్నాయా..? వెబ్ స్టోరీస్

ఒళ్లు నొప్పులు వేధిస్తున్నాయా..?

web-story-logo టైగర్ నట్స్ డైట్‌లో చేర్చుకుంటున్నారా..? వెబ్ స్టోరీస్

టైగర్ నట్స్ డైట్‌లో చేర్చుకుంటున్నారా..?

web-story-logo రెస్టారెంట్‌లో పచ్చి ఉల్లిపాయ క్రంచీగా ఎలా ఉంటుంది? వెబ్ స్టోరీస్

రెస్టారెంట్‌లో పచ్చి ఉల్లిపాయ క్రంచీగా ఎలా ఉంటుంది?

web-story-logo 10 నిమిషాలు వ్యాయామాలతో కళ్లు పదిలం వెబ్ స్టోరీస్

10 నిమిషాలు వ్యాయామాలతో కళ్లు పదిలం

Hezbollah: బీరుట్‌లో ఇజ్రాయెల్ దాడి..హిజ్బుల్లా కీలక కమాండర్ మృతి

హిజ్బుల్లాను నాశనం చేసే లక్ష్యంతో ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తోంది. ఈరోజు లెబనాన్‌లో బీరుట్ ప్రాంతంలో వైమానిక దాడులను నిర్వహించింది. ఇందులో 8 మంది చనిపోయారు. వారితో పాటూ హిజ్బుల్లా కీలక కమాండర్ అకిల్ కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. 

వెస్ట్‌బ్యాంక్‌లో కీలక ఉగ్ర కమాండర్‌ను మట్టుబెట్టిన ఇజ్రాయెల్ సైన్యం

ఇజ్రాయెల్‌కు చెందిన ఎయిర్‌ఫోర్స్‌ జరిపిన దాడుల్లో వెస్ట్‌బ్యాంక్‌లోని క్వాబాటియా నగరంలో కీలక ఉగ్ర కమాండర్‌ షాదీ జకర్నే హతమయ్యాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ ప్రకటించింది. ఈ కాల్పుల్లో మొత్తం నలుగురు గన్‌మెన్‌లను సైనికులు మట్టుబట్టారు.

Israel: ఇజ్రాయెల్ మీదకు 140 రాకెట్లతో హెజ్బుల్లా దాడి

ఇజ్రాయెల్, హెజ్బుల్లాల మధ్య యుద్ధం ముదురుతోంది. నిన్నటివరకు వరుస దాడులతో ఇజ్రాయెల్ విరుచుకుపడితే...ఈరోజు హెజ్బుల్లా...ఆ దేశం మీద రాకెట్ల వర్షం కురిపించింది. ఒకసారి 140 రాకెట్లను ఇజ్రాయెల్ మీదకు వదిలింది.

ఎలాన్‌ మస్క్‌కు షాక్.. స్టార్‌లింక్‌ శాటిలైట్లతో ఇతర పరిశోధనలకు ఆటంకం

మారుమూల ప్రాంతాలకు ఇంటర్నేట్‌ సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఎలాన్‌మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ శాటిలైట్లపై ఖగోళ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ శాటిలైట్లు కీలకమైన రేడియో సిగ్నళ్లను బ్లాక్‌ చేస్తున్నాయని చెబుతున్నారు.

విరుచుకుపడిన ఇజ్రాయెల్‌...1000 రాకెట్లు ధ్వంసం!

లెబనాన్‌ లో పేజర్లు, వాకీటాకీల పేలుళ్ల నేపథ్యంలో పశ్చిమాసియాలో మరోసారి యుద్దమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటి వరకు దాదాపు వంద రాకెట్‌ లాంఛర్లలో ఉన్న 1000 రాకెట్లను తమ యుద్ద విమానాలను ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్‌ వెల్లడించింది.

Hezbollah :  హెజ్బుల్లా స్థావరాల మీద విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్

ఎలక్‌ట్రానిక్ పరికరాల మీద దాడ అయిపోయింది ఇప్పుడు ప్రత్యక్ష దాడులతో హెజ్బుల్లా మీద విరుచుకుపడుతోంది ఇజ్రాయెల్. హెజ్బుల్లా ఉగ్ర కార్యకలాపాలు, మౌలిక సదుపాయాల నాశనమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ చెప్పింది.

Lebanon: లెబనాన్ కీలక నిర్ణయం.. పేజర్లు, వాకీటాకీలు నిషేధం

లెబనాన్, సిరియాలో వందల సంఖ్యలో పేజర్లు పేలిన ఘటనలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. దీంతో లెబనాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి తమ దేశం నుంచి వెళ్లే విమానాల్లో పేజర్లు, వాకీటాకీలు తీసుకెళ్లకుండా నిషేధం విధించింది.

Telangana: దుర్గం చెరువు ఎఫ్‌టీఎల్‌పై హైకోర్టులో విచారణ వాయిదా

హైదరాబాద్‌లోని చెరువు ఎఫ్‌టీఎల్‌ 160 ఎకరాలుగా పేర్కొనడంపై ప్రియతం రెడ్డి అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ వేశారు. గతంలో 65 ఎకరాలుగా మాత్రమే ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే తెలంగాణ హైకోర్టులో దీనిపై చేపట్టిన విచారణ సోమవారానికి వాయిదా పడింది.

Ganja: తెలంగాణలో భారీగా పట్టుబడిని గంజాయి.. ట్రాక్టర్ లో తరలిస్తూ

ఒడిశా నుంచి కామారెడ్డికి అక్రమంగా ట్రాక్టర్‌లో తరలిస్తున్న 338 కిలోల గంజాయి ప్యాకెట్లను తెలంగాణ యాంటీ డ్రగ్స్ విభాగం పోలీసులు పట్టుకున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ ఏపీకి చెందిన లక్ష్మీ నారాయణను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు పరారీలో ఉన్నారు. 

అదృశ్యమైన ముగ్గురు గురుకుల విద్యార్థుల ఆచూకీ లభ్యం

నల్గొండ మైనార్టీ గురుకుల పాఠశాలలో అదృశ్యమైన విద్యార్థులను పోలీసులు పట్టుకున్నారు. కల్లు ప్యాకెట్ దొరకడంతో భయపడి ఈ నెల ఈ నెల 17న స్కూల్ నుంచి ముగ్గురు స్టూడెంట్స్ పారిపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు హైదరాబాద్ లో వీరిని పట్టుకున్నారు. 

సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్‌..ఒక్కొక్కరికీ రూ.లక్షా 90 వేల బోనస్‌

సింగరేణి కార్మికులకు రేవంత్ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. శాశ్వత ఉద్యోగుల్లో ఒక్కొక్కరికీ రూ.లక్షా 90 వేల బోనస్‌ ఇస్తున్నట్లు ప్రకటిస్తుంది. మరోవైపు కాంట్రక్టు కార్మికులకు కూడా రూ.5 వేల బోనస్‌ ప్రకటించారు.

మాకు నీతులు చెప్పకండి.. కేటీఆర్‌పై మంత్రి దామోదర రాజనర్సింహ ఫైర్

బీఆర్ఎస్‌ హయాంలో హాస్పిటళ్లకు బకాయిలు విడుదల చేయకుండా, ప్యాకేజీల రేట్లు రివైజ్ చేయకుండా ఆరోగ్యశ్రీ పేషెంట్లకు వైద్యం అందకుండా చేశారని మంత్రి దామోదర రాజనర్సింహ విమర్శించారు. ఇప్పుడు కేటీఆర్‌ నీతులు చెప్పడం సిగ్గు చేటంటూ మండిపడ్డారు.

Hydra: హిమాయత్‌సాగర్‌ కబ్జాలపై హైడ్రా యాక్షన్.. 83 కట్టడాలు నేలమట్టం!

హైడ్రా నెక్ట్స్ ఫోకస్ హిమాయత్ సాగర్‌. ఇక్కడ కేంద్ర మాజీ మంత్రులు, వ్యాపారవేత్తల ఫామ్ హౌజ్‌లతోపాటు ఇతర 83 అక్రమ నిర్మాణాలున్నట్లు అధికారులు గుర్తించారు. మరో రెండు రోజుల్లో వీటిని నేలమట్టం చేయనున్నట్లు తెలుస్తోంది. 

బీజేపీ ఎంపీ రఘునందన్ రావుపై కేసు నమోదు!

TG: మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్ కన్వేషన్ కూల్చివేతపై స్టే ఇస్తూ ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై విమర్శలు చేసినందుకు సీజే ధర్మాసనం సుమోటోగా క్రిమినల్‌ కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేసింది.

Sharmila: చంద్రబాబు 100 రోజుల పాలనపై షర్మిల సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు 100 రోజుల పాలన వైఎస్‌ఆర్‌ విగ్రహాలు కూల్చడం, పేర్లను తొలగించేందుకే సరిపోయినట్లుగా ఉందని ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల విమర్శించారు. సూపర్ సిక్స్‌లో కనీసం ఒక్క సిక్స్ కూడా అమలు కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

JATHWANI: జెత్వానీ కేసులో ఐపీఎస్ కాంతి రాణాకు బిగుస్తున్న ఉచ్చు!

ముంబై నటి జెత్వాని కేసులో ఐపీఎస్ కాంతి రాణా టాటాకు ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కాంతి రాణా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. కాంతిరాణా పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనుంది.

శ్రీవారి లడ్డూ కల్తీ పాపం జగన్‌కి చుట్టుకుంటుంది.. మండిపడ్డ ఎంపీ

తిరుమల లడ్డూ వివాదంపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి స్పందించారు. లడ్డూలో చేప నూనె, జంతువుల మాంసం వంటివి ఉపయోగించడం పాపమన్నారు. ఈ పాపమంతా జగన్‌కే చుట్టుకుంటుందని బైరెడ్డి శబరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తక్కువ రేటుకే నెయ్యి సరఫరా.. అనుమానం వ్యక్తం చేసిన టీటీడీ ఈవో

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ జరిగిందంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో టీటీడీ ఈవో మీడియాతో మాట్లాడారు. లడ్డూ నాణ్యత విషయంలో భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాయన్నారు. తక్కువ రేటుకు నెయ్యి సరఫరా చేయడంతో అనుమానం వచ్చి పరీక్షలు నిర్వహించగా.. జంతువుల కొవ్వు ఉన్నట్లు తేలిందన్నారు.

Tirumala Laddu: తిరుపతి లడ్డూలోనే కాదు.. స్ట్రీట్ ఫుడ్ లోనూ జంతువుల నూనె?

మీరు స్ట్రీట్ ఫుడ్ బాగా తింటారా? తక్కువ ధరకే టేస్టీ ఫుడ్ అంటూ వీధుల్లో లభించే ఫుడ్ ను తెగ లాగించేస్తూ ఉంటారా? జంతువుల కొవ్వును తిరుపతి లడ్డూలోనే మాత్రమే కాదు.. స్ట్రీట్ ఫుడ్ లో కూడా వాడతారని మీకు తెలుసా? ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ లో..

మా నెయ్యిలో ఏముందంటే.. AR డెయిరీ సంచలన ప్రకటన

దేశవ్యాప్తంగా శ్రీవారి లడ్డూలో కల్తీ ఉందనే వార్త తీవ్ర దుమారం రేపుతుంది. అయితే తిరుపతి లడ్డూకి నెయ్యి సరఫరా చేసే ఏఆర్ డెయిరీ ఫుడ్ ఈ విషయంపై స్పందిస్తూ.. తమ నెయ్యిలో ఎలాంటి కల్తీ లేదని స్పష్టం చేసింది. 

జెత్వానీ కేసులో కుక్కల విద్యాసాగర్ అరెస్ట్!

జెత్వానీని వేధించిన కేసులో కుక్కల విద్యాసాగర్‌ అరెస్ట్‌ అయ్యారు.విద్యాసాగర్‌ ను డెహ్రాడూన్‌లో ఏపీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. విద్యాసాగర్‌ కోసం ఆరు బృందాలు గాలిస్తుండగా సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతని అచూకి గుర్తించి అరెస్ట్ చేశారు.

Stock Markets: ఒక్కరోజులో 6లక్షల కోట్లు..మార్కెట్ల సరికొత్త రికార్డ్

మార్కెట్ ఆఖరి రోజైన శుక్రవారం స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్‌ 1359 పాయింట్లు, నిఫ్టీ 375 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. బీఎస్‌ఈలో మొత్తం విలువ ఒక్కరోజులోనే 6 లక్షల కోట్ల సంపద పెరిగింది.

iPhone 16 సిరీస్ కోసం ఎగబడిన జనం.. ఉదయం నుంచే స్టోర్ ముందు భారీ క్యూలైన్లు

యాపిల్ ప్రేమికులు ఎదురుచూసే ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు ఈరోజు నుంచి మార్కెట్లో లభ్యమవుతున్నాయి. దీంతో కొనుగోలు దారులు ఉదయం నుంచే యాపిల్ స్టోర్ల ముందు బారులుదీరారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Stock Market: భారీ లాభాలతో దూసుకుపోతున్న స్టాక్‌ మార్కెట్లు!

శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్​ మొదటి సారి 84,000 మార్కును దాటింది. నిఫ్టీ సరికొత్త జీవనకాల గరిష్ఠాలను తాకింది. ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లు తగ్గించడం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు లాభాలకు కారణంగా చెప్పొచ్చు.

Gold Prices: ఇదే మంచి ఛాన్స్‌...భారీగా దిగొచ్చిన ధరలు..!

బంగారం ధరలు గత కొద్ది రోజులుగా దిగి వస్తుండగా..ఈ రోజు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 68 వేల 250 కు పడిపోయింది. ఇక 24 క్యారెట్ల పసిడి రేటు పది గ్రాముల పై రూ.280 మేర తగ్గి రూ. 74 వేల 450 వద్దకు దిగివచ్చింది.

Laddu Auction: గణపతి లడ్డూలకు భారీ డిమాండ్.. గతేడాది రికార్డులివే!

హైదరాబాద్ నగరంలో గణపతి లడ్డూలకు భారీ డిమాండ్ పెరుగుతోంది. ధనవంతులు, రాజకీయ నాయకులు వందల సంఖ్యలో వేలంపాటలో పాల్గొంటూ లక్షల రూపాయలు పెంచేస్తున్నారు. గతేడాది 2023లో అత్యధిక ధర పలికిన లడ్డూల వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

హమ్మయ్య మార్కెట్ మళ్ళీ లాభాల్లోకి.. !

నిన్న నష్టాలను మూటగట్టుకున్న దేశీ స్టాక్ మార్కెట్ ఈరోజు మాత్రం మళ్ళీ పుంజుకుంది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ 50 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో మన మార్కెట్‌లో జోష్ కనిపించింది.

Gold Price : హమ్మయ్యా…బంగారం ధర తగ్గిందోచ్‌..ఎంతో తెలుసా!

బంగారం ధరలు 4 రోజుల తర్వాత స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములపై రూ.150 తగ్గి రూ. 68 వేల 650 వద్ద స్థిరంగా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు తులంపై రూ.160 మేర తగ్గడంతో ప్రస్తుతం రూ.74 వేల 890 పలుకుతోంది.

తాజా కథనాలు
Image 1 Image 2
stocks