/rtv/media/media_files/1chrEXjy38MxbLIjNxSI.jpg)
గత రెండు రోజులుగా తిరుమల లడ్డూ విషయంలో చెలరేగుతున్న వివాదం గురించి తాజాగా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ స్పందించారు. ఈ విషయం చాలా మందిని బాధపెట్టిందన్నారు.ఈ విషయం నిజంగా నమ్మలేని, భయంకరమైన నిజమని అని ఆయన అన్నారు. కలియుగ వైకుంఠ క్షేత్రంలో ఇలాంటి ఘటనలు జరగడమనేది చాలా బాధాకరమైన విషయమని తెలియజేశారు. టెండరింగ్ ప్రక్రియే తప్పు అంటూ ఆయన విమర్శించారు.
మాలాంటి ఎన్నో కోట్ల మంది మనోభావాలు దెబ్బతిన్నాయి.. తిరుమల లడ్డు పై చిలుకూరు ప్రధాన అర్చకులు రంగరాజన్ #TirupatiLaddu#Rangarajan#Chilakurupriest#RTVpic.twitter.com/KGQ2mAvwSE
— RTV (@RTVnewsnetwork) September 20, 2024
నిజనిజాలపై ఏపీ ప్రభుత్వం వెంటనే ఈ విషయం గురించి విచారణ చేపట్టాలని ఆయన అన్నారు. ఈ మేరకు ఓ వీడియో సందేశాన్ని రంగరాజన్ ఈ సందర్భంగా విడుదల చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆకాంక్షిస్తున్నట్లు జాతీయ స్థాయిలో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేస్తే ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట వేయోచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయం గురించి కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తిరుమల పవిత్రతను కాపాడాలని ఆయన వేడుకున్నారు.