Hydra: హిమాయత్‌సాగర్‌ కబ్జాలపై హైడ్రా యాక్షన్.. 83 కట్టడాలు నేలమట్టం!

హైడ్రా నెక్ట్స్ ఫోకస్ హిమాయత్ సాగర్‌. ఇక్కడ కేంద్ర మాజీ మంత్రులు, వ్యాపారవేత్తల ఫామ్ హౌజ్‌లతోపాటు ఇతర 83 అక్రమ నిర్మాణాలున్నట్లు అధికారులు గుర్తించారు. మరో రెండు రోజుల్లో వీటిని నేలమట్టం చేయనున్నట్లు తెలుస్తోంది. 

New Update
hmsgar

 

Himayath sagar: హిమాయత్ సాగర్‌ వైపు హైడ్రా బుల్డోజర్లు కదలివెళ్తున్నాయి. హిమాయత్ సాగర్ లో ఆక్రమణలను మరో రెండు రోజుల్లో నేలమట్టం చేయనున్నారు. ఇప్పటికే వాటర్‌ బోర్డు హైడ్రాకు పూర్తి నివేదిక అందించగా.. హైడ్రా చీఫ్‌ రంగనాథ్‌ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఈ మేరకు గురువారం సచివాలయంలో ఉన్నతాధికారులతో రంగనాథ్ సమావేశమవగా..  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హిమాయత్‌సాగర్‌ ఆక్రమణల వివరాలకు సంబంధించి హైడ్రాకు వివరించినట్లు తెలుస్తోంది. ఇందులో కేంద్ర మాజీ మంత్రులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, పలు పార్టీల నాయకుల ఫాం హౌజ్‌లు, ఇతర నిర్మాణాలతో పాటు మొత్తం 83 ఆక్రమణలను అధికారులు గుర్తించినట్లు సమాచారం. 

ఇండ్లు, షెడ్లు, తాత్కాలిక నిర్మాణాలు, ప్రహరీ గోడలతోపాటు 10 పర్మినెంట్ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే వీటి కూల్చివేతల విషయాన్ని హైడ్రా ముందుగానే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తోందని, 1908లో వచ్చిన వరదలను దృష్టిలో పెట్టుకుని 1927లో ఈసా నదిపై హిమాయత్‌ సాగర్‌ను నిర్మించారు. గత నెల 18వ తేదీన గండిపేటలోని చిలుకూరు, ఖానాపూర్‌ గ్రామాల పరిధిలో 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 24 ఆక్రమణలను తొలగించింది. ఇక ఉస్మాన్‌సాగర్‌తో కలిసి ఒకప్పుడు హైదరాబాద్‌కు ప్రధాన తాగు నీటి వనరుగా ఉంది. జనాభా పెరుగులతో ప్రభుత్వాలు కృష్ణా, గోదావరి జలాలు అందుబాటులోకి రావడంతో హిమాయత్ సాగర్ ఆక్రమణకు గురైంది. 

Also Read: పవర్ స్టార్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చే న్యూస్.. షూటింగ్ లో జాయిన్ అయిన పవన్

Advertisment
తాజా కథనాలు