Gold Price : హమ్మయ్యా…బంగారం ధర తగ్గిందోచ్..ఎంతో తెలుసా! బంగారం ధరలు 4 రోజుల తర్వాత స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములపై రూ.150 తగ్గి రూ. 68 వేల 650 వద్ద స్థిరంగా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు తులంపై రూ.160 మేర తగ్గడంతో ప్రస్తుతం రూ.74 వేల 890 పలుకుతోంది. By Bhavana 18 Sep 2024 | నవీకరించబడింది పై 18 Sep 2024 09:17 IST in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Gold Price : బంగారం కొనుగోలు చేసే వారికి ఓ గుడ్ న్యూస్..వరుసగా నాలుగు రోజులుగా పెరుగుతూ హడలెత్తించిన పుత్తడి ధరలు నేడు కొంచెం దిగి వచ్చాయి. ముందు రోజుతో పోలిస్తే బంగారం ధర స్వల్పంగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లలో గోల్డ్ రేట్లు రికార్డ్ గరిష్ఠాల నుంచి తగ్గుముఖం పడుతుండగా దేశీయంగా కూడా ఆ ప్రభావం కనిపిస్తోంది. ప్రస్తుతం పెళ్లిళ్ల ముహూర్తాలు లేకపోవడంతోనూ కొనుగోళ్లు కాస్త నెమ్మదిగా కొనసాగుతున్నాయని బులియన్ మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, పండగల సీజన్ మొదలైన క్రమంలో దేశీయంగా బంగారం దిగుమతులు భారీగానే పెరిగాయి. గత ఆగస్టు నెలలో ఏకంగా 10.6 బిలియన్ డాలర్ల బంగారం దిగుమతి చేసుకున్నట్లు వాణిజ్య మంత్రిత్వ శాఖ మంగళవారం గణాంకాలు విడుదల చేసింది. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే… హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు 4 రోజుల తర్వాత స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములపై రూ.150 తగ్గి రూ. 68 వేల 650 వద్ద స్థిరంగా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం రేటు తులంపై రూ.160 మేర తగ్గడంతో ప్రస్తుతం రూ.74 వేల 890 పలుకుతోంది. ఇక ఢిల్లీ మార్కెట్లో చూసుకుంటే 22 క్యారెట్ల పసిడి ధర తులంపై రూ.150 తగ్గడంతో రూ.68 వేల 800 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల గోల్డ్ ఢిల్లీలో రూ.110 తగ్గాగ రూ. 75, 040 వద్ద కొనసాగుతుంది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగానే తగ్గాయి. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ.1000 మేర తగ్గి రూ. 97 వేల వద్దకు దిగివచ్చింది. ఇక ఢిల్లీలో చూస్తే కిలో వెండి రేటు రూ. 1000 మేర దిగిరావడంతో ప్రస్తుతం కిలో రూ.92 వేలు గా కొనసాగుతుంది. #gold-price #gold-rates-today #gold-rates-today-in-hyderabad మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి