అదృశ్యమైన ముగ్గురు గురుకుల విద్యార్థుల ఆచూకీ లభ్యం

నల్గొండ మైనార్టీ గురుకుల పాఠశాలలో అదృశ్యమైన విద్యార్థులను పోలీసులు పట్టుకున్నారు. కల్లు ప్యాకెట్ దొరకడంతో భయపడి ఈ నెల ఈ నెల 17న స్కూల్ నుంచి ముగ్గురు స్టూడెంట్స్ పారిపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు హైదరాబాద్ లో వీరిని పట్టుకున్నారు. 

New Update
gurukula students missing

నల్గొండలోని కొండభీమనపల్లిలో ఉన్న మైనార్టీ గురుకుల పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థులు మంగళవారం రోజు పారిపోయారు. ప్రిన్సిపాల్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు హైదరాబాద్ లో విద్యార్థులను పట్టుకున్నారు. వివరాల ప్రకారం.. కొండభీమనపల్లి మైనార్టీ గురుకుల పాఠశాలలో ముజిబ్, ఎస్.కె. తౌఫిక్, రెహమాన్ అనే ముగ్గురు విద్యార్థులు పదవ తరగతి చదువుతున్నారు. సెప్టెంబర్ 16న వీరికి స్కూల్ లేకపోవడంతో పక్కనే ఉన్న బీసీ గురుకుల పాఠశాల గోడ దూకి అక్కడి నుంచి ఒక కల్లు ప్యాకెట్ తీసుకున్నారు. వీరు ప్యాకెట్ తీసుకుంటుండగా స్కూల్ సూపర్ వైజర్ జ్యోతి చూశారు. అది కల్లు ప్యాకెట్ అని తేలడంతో ముగ్గురు విద్యార్థులను మందలించి ప్రిన్స్‌పాల్‌కు సమాచారం అందించారు.

సీసీ కెమెరాల ద్వారా ఛేదించారు

దీంతో ఆ విద్యార్థులు భయపడి ఉదయం అల్పహారం సమయంలో గోడ దూకి పారిపోయారు. ఆ కల్లు ప్యాకెట్‌కి మాకు ఎలాంటి సంబంధం లేదని వారు రాసిన లేఖ దొరికింది. వెంటనే స్కూల్ ప్రిన్సిపల్ ఈ విషయమై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. ఆ ముగ్గురు విద్యార్థులు ఉప్పాగు దగ్గర హైదరాబాద్ బస్సు ఎక్కినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. బుధవారం రోజున రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహింపట్నం వద్ద చికెన్‌షాప్‌లో పనిచేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. సీసీ కెమెరాల ద్వారా వారిని గుర్తించిన పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసును పరిష్కరించిన దేవరకొండ పోలీసులను స్కూల్ ప్రిన్సిపల్ అభినందించారు.

Also Read: కార్పొరేట్ హత్యలు.. పని చేస్తున్నామా..చావుకు దారులు వేసుకుంటున్నామా?

Advertisment
తాజా కథనాలు