Lebanon: లెబనాన్ కీలక నిర్ణయం.. పేజర్లు, వాకీటాకీలు నిషేధం

లెబనాన్, సిరియాలో వందల సంఖ్యలో పేజర్లు పేలిన ఘటనలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. దీంతో లెబనాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి తమ దేశం నుంచి వెళ్లే విమానాల్లో పేజర్లు, వాకీటాకీలు తీసుకెళ్లకుండా నిషేధం విధించింది.

New Update
Pagers

లెబనాన్, సిరియాలో వందల సంఖ్యలో పేజర్లు పేలిన ఘటన సంచలనం రేపుతోంది. ఈ నేపథ్యంలో లెబనాన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి తమ దేశం నుంచి వెళ్లే విమానాల్లో పేజర్లు, వాకీటాకీలు తీసుకుపోవడంపై నిషేధం విధించింది. అయితే నిన్న పేజర్లు.. ఇయ్యాల వాకీటాకీలు.. మొత్తంగా లెబనాన్‌ దద్దరిల్లుతోంది. పేజర్ పేలుళ్లతో అక్కడి ప్రజలు గజాగజా వణికిపోతున్నాపు. పేలుడు జరిగిన ప్రాంతంలో పరిస్థితి అత్యంత భయానకంగా ఉంది. ఒక రోజు టెలిఫోన్లు పేలితే మరోరోజు వాకీటాకీలు పేలుతుండడం ప్రకంపనలు రేపుతోంది. ఎప్పుడో మరుగున పడిపోయిన టెక్నాలజీని బెస్‌ చేసుకుని ఈ దాడులు జరుగుతుండడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంతకీ పేజర్ అంటే ఏంటి? అది ఎలా పని చేస్తుందనే ఒకే ఒక ప్రశ్న అందరి మదిలో ఓ విత్తనంలా మొలకెత్తింది.

పేజర్ అనేది మెసేజీలను పంపడానికి, రిసీవ్‌ చేసుకోవడానికి ఉపయోగించే పరికరం. 1990ల చివరలో, 2000ల ప్రారంభంలో మొబైల్స్‌ యుగం రాకముందు పేజర్‌లు విస్తృతంగా ఉపయోగించారు. ఇది ప్రత్యేకంగా వైద్యులు, వ్యాపారవేత్తలు, అత్యవసర సేవల నిపుణులు యూజ్ చేసేవారు. రేడియో ఫ్రీక్వెన్సీని ఉపయోగించి ఎవరైనా మెసేజీని పంపాలనుకున్నప్పుడు, పేజర్ నెట్‌వర్క్ ఆ సందేశాన్ని పంపుతుంది. దాన్ని పేజర్ డివైజ్‌ అందుకుంటుంది. మెసేజీ రిసీవ్‌ అవ్వడానే అది బీప్ లేదా వైబ్రేట్ అవుతుంది. అందుకే ఈ పరికరాన్ని బీపర్ లేదా బ్లీపర్ అని కూడా పిలుస్తారు. ఇవి ఇంటర్నెట్ కాలింగ్ అవసరం లేకుండానే పనిచేస్తాయి. కొండ ప్రాంతాలు లేదా మారుమూల ప్రాంతాల్లో ఇవి మరింత ప్రయోజనకరంగా ఉంటాయి. మొబైల్ ఫోన్ నెట్‌వర్క్‌ కనెక్టవిటీ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా పేజర్ చాలా నమ్మదగిన పరికరం. పేజర్‌లో మూడు రకాలు. మొదటది వన్ వే పేజర్.. ఇందులో మెసేజీలు మాత్రమే స్వీకరించబడతాయి. టూ వే పేజర్‌లో సందేశాలను రిసీవ్ చేసుకోవడంతో పాటు, మీరు మెసేజీలను పంపవచ్చు. మూడో రకం దాంట్లో వాయిస్ మెసేజ్‌లు రికార్డ్ అవుతాయి.

Also read: ట్రంప్ ర్యాలీలో పాల్గొన్నవారికి వింత జబ్బు?


మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత, పేజర్ల వాడకం తగ్గింది. మొబైల్ ఫోన్ ద్వారా వాయిస్ కాల్స్‌, టెక్ట్స్ ఛాటింగ్‌ ఇంటర్నెట్ యాక్సెస్‌తో సహా అనేక రకాల ఫీచర్‌లను అందిస్తాయి. అయితే ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పేజర్లు ఉపయోగిస్తున్నారు. జపాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికీ కమ్యూనికేషన్ కోసం పేజర్లను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా అత్యవసర సేవలకు వినియోగిస్తున్నారు. ఆస్పత్రి సిబ్బంది సెల్యులార్ నెట్‌వర్క్‌లపై ఆధారపడకుండా ఉండేందుకు ఉపయోగిస్తారు. ఎందుకంటే వీటి బ్యాటరీలు చాలా కాలం పాటు ఉంటాయి. ఈ బ్యాటరీలను లిథియంతో రూపొందిస్తారు. ఇవి వేడెక్కగల సామర్థ్యాన్ని కల్గి ఉన్నాయి. అయితే ఈ బ్యాటరీలు పేలిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. అప్పుడు మంటలు వ్యాపించే ఛాన్స్ ఉంటుంది. సరిగ్గా లెబనాన్‌లో జరుగుతోంది ఇదే.

మరోవైపు లెబనాన్‌లో పేజర్లు పేలుళ్ల వెనక ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్‌ హస్తం ఉందని పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు రిపోర్ట్ చేస్తున్నాయి. హిజ్బుల్లాకు చెందిన వేల పేజర్లలో పేలుడు పదార్థాలు ఉన్నాయి. దీని వెనుక ఉన్నది మొస్సాద్ అని..  వాటిని లెబనాన్ అంతటా పేల్చివేసిందని సమాచారం. నిజానికి పేజర్లను ఇప్పుడు పేల్చాలన్న ప్లాన్‌ మొస్సాద్‌కు లేదట. అయితే హిజ్బుల్లా తమ ప్రణాళిక గురించి తెలుసుకుంటుందేమోనన్న అనుమానంతో ముందుగానే ఇజ్రాయెల్ వాటిని పేల్చివేసిందని తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఇజ్రాయెల్‌ క్లారిటీ ఇవ్వలేదు కానీ అమెరికా మీడియా మాత్రం ఇలాంటి కథనాలనే అల్లుతోంది.

Advertisment
తాజా కథనాలు