Stock Markets: ఒక్కరోజులో 6లక్షల కోట్లు..మార్కెట్ల సరికొత్త రికార్డ్ మార్కెట్ ఆఖరి రోజైన శుక్రవారం స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో ముగిసింది. సెన్సెక్స్ 1359 పాయింట్లు, నిఫ్టీ 375 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. బీఎస్‌ఈలో మొత్తం విలువ ఒక్కరోజులోనే 6 లక్షల కోట్ల సంపద పెరిగింది. By Manogna alamuru 20 Sep 2024 | నవీకరించబడింది పై 20 Sep 2024 17:54 IST in బిజినెస్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Stock Markets: దేశీ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, ఫెడ్ వడ్డీ రేట్లలలో కోతలతో రోజంతా మార్కెట్ మంచి ఊపు మీద సాగింది. దీంతో సరికొత్త జీవనకాల గరిష్ఠాలను అందుకున్నాయి. సెన్సెక్స్ తొలిసారి 84 వేల మార్కు దాటడమే కాకుండా.. 84,500 ఎగువన ముగిసింది. ఇంట్రాడేలో నిఫ్టీ సైతం 24,800 దాటి చివరికి కాస్త దిగువన ముగిసింది. బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ ఒక్కరోజులోనే రూ.6 లక్షల కోట్లు పెరిగి రూ.472 లక్షల కోట్లకు చేరింది. ఇక డాలర్‌తో రూపాయి మారం విలువ 83.68 దగ్గర హై గా ఉంది. ఈరోజు ఉదయం ప్రారంభం నుంచే సెన్సెక్స్ భారీ లాభాల్లో ఉంది. ఉదయం 83,603.04 పాయింట్ల దగ్గర మొదలైంది. దాంతో పాటూ రోజంతా కూడా 84 వేల మార్కు పైనే సాగింది. అఆగే ఇంట్రీడేలో అయితే ఏకంగా 84,544.31 దగ్గరకు వెళ్ళింది. ఇది కూడా ఒక కొత్త రికార్డ్ అనే చెప్పాలి. చివరకు రోజు ముగిసేసరికి 84,544.31 దగ్గర ముగిసింది. ఇక నిఫ్టీ 375 పాయింట్లు లాభపడి 83,603.04 పాయింట్ల దగ్గర ముగిసింది. దీనికి కారణం అంతర్జాతీయ మార్కెట్‌లో సానుకూల సంకేతాలే అని తెలుస్తోంది. ఫెడ్ రేట్లలో కోత విధించడంతో నిన్న అమెరికా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.ఆ ప్రభావం దేశఈ ఆర్కెట్ల మీద బాగా పడింది. దాంతో పాటూ ఆసియా మార్కెట్లయిన జపాన్, చైనా తమ వడ్డీ రేట్లను మరికొంతకాలం పాటు స్థిరంగా ఉంచుతామని ప్రకటించడం కూడా బాగా కలిసొచ్చింది.ఫెడ్ రేట్ల ఆధారిత రంగాలైన బ్యాంకులు, రియల్ ఎస్టేట్, ఆటో సెక్టార్ షేర్లలో కొనుగోళ్ల ఉత్సాహం కనిపించింది. దాంతో పాటూ ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, మహీంద్రా అండ్ మహీంద్రా లాంటి షేర్లు భారీగా లాభపడ్డాయి. సెన్సెక్స్ లో ఎస్‌బీఐ, ఇండస్ ఇండ్ బ్యాంక్, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు తప్ప మిగిలిన అన్ని షేర్లూ లాభపడ్డాయి. మహీంద్రా అండ్ మహీంద్రా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్‌అండ్‌టీ, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు ఎక్కువగా లాభాలను చవి చూశాయి. ఇక నిఫ్టీలో ఎం అండ్ ఎం, ఐసీఐసీఐ బ్యాంక్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, కోల్ ఇండియా, ఎల్ అండ్ టీ అత్యధికంగా లాభపడ్డాయి. ఆటో, బ్యాంక్, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్‌ఎంసిజి, పవర్, టెలికాం, మెటల్, రియల్టీ 1-2 శాతంతో అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. బీఎస్‌ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు 1 శాతం చొప్పున పెరిగాయి. Today's stock market update as M&M,ICICIBANK were top gainers,while GRASIM and SBIN lagged.#StockMarketUpdate #todaystockmarket #RTV pic.twitter.com/Cw4vim5dQd — RTV (@RTVnewsnetwork) September 20, 2024 Also Read: Cricket: టీమ్ ఇండియా బౌలర్ బుమ్రా అరుదైన ఘనత మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి