సింగరేణి కార్మికులకు గుడ్‌న్యూస్‌..ఒక్కొక్కరికీ రూ.లక్షా 90 వేల బోనస్‌

సింగరేణి కార్మికులకు రేవంత్ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. శాశ్వత ఉద్యోగుల్లో ఒక్కొక్కరికీ రూ.లక్షా 90 వేల బోనస్‌ ఇస్తున్నట్లు ప్రకటిస్తుంది. మరోవైపు కాంట్రక్టు కార్మికులకు కూడా రూ.5 వేల బోనస్‌ ప్రకటించారు.

New Update
Singareni

తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు శుభవార్త చెప్పింది. తొలిసారిగా కార్మికులకు పెద్ద మొత్తంలో బోనస్‌ ప్రకటించింది. ఒక్కో కార్మికుడికి రూ.లక్షా 90 వేల బోనస్‌ ఇస్తున్నట్లు చెప్పింది. సింగరేణికి వచ్చే లాభాల్లో కార్మికులు ఆనందం చూడాలన్నదే లక్ష్యంగా రాష్ట్ర సర్కార్‌ బోనస్‌ ఇచ్చింది. ఇక 2023-24 ఏడాదిలో సింగరేణి సంస్థ నుంచి రూ.4,701 కోట్ల లాభం వచ్చింది. అయితే ఇందులో రూ.2,289 కోట్లు సింగరేణి విస్తరణకు పెట్టుబడిగా పెట్టామని సీఎం రేవంత్‌ అన్నారు. రూ.796 కోట్ల లాభాలు కార్మికులకు పంచుతామని తెలిపారు.  

Also Read: హిమాయత్‌సాగర్‌ కబ్జాలపై హైడ్రా యాక్షన్.. 83 కట్టడాలు నేలమట్టం!

ప్రస్తుతం సింగరేణి సంస్థలో మొత్తం 41 వేల 837 మంది శాశ్వత ఉద్యోగులున్నారు. వీరితో పాటు కాంట్రక్టు వర్కర్లుగా పనిచేస్తున్నవాళ్లు 25 వేల మంది ఉన్నారు. అయితే రాష్ట్ర సర్కార్‌.. సింగరేణి శాశ్వత ఉద్యోగులకు ఒక్కొక్కరికీ రూ.లక్షా 90 వేల బోనస్‌ ప్రకటించింది. మరోవైపు కాంట్రక్టు కార్మికులకు కూడా రూ.5 వేల బోనస్‌ ప్రకటించారు. సింగరేణి చరిత్రలో మొదటిసారిగా మానవతా దృక్పథంతో కాంట్రాక్టు కార్మికులకు బోనస్ ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కార్మికులందరికీ దసరా పండగ కంటే ముందుగానే ఈ బోనస్‌ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

అలాగే భవిష్యత్తులో లాభాలతో పాటు సింగరేణి వ్యవస్థ వల్ల తర్వాత తరానికి ఉపయోగపడేలా రామగుండంలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. రామగుండంలో వెయ్యి మెగావాట్ల పవర్‌ప్రాజెతక్టు, అలాగే 500 మెగావాట్ల పంప్‌ స్టోరేజ్‌ ఏర్పాటు చేయనున్నారు. థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌కు సంబంధించి రాజస్థాన్‌లోని జైపూర్‌లో కూడా విస్తరించాలని రాష్ట్ర సర్కార్‌ నిర్ణయించింది. అంతేకాదు టీఎస్‌జెన్‌కో కలిసి జాయింట్‌ వెంచర్‌గా మరో ప్రాజెక్టు కూడా చేయనున్నారు. 

Also Read: బీజేపీ ఎంపీ రఘునందన్ రావుపై కేసు నమోదు!

Advertisment
తాజా కథనాలు