విరుచుకుపడిన ఇజ్రాయెల్...1000 రాకెట్లు ధ్వంసం! లెబనాన్ లో పేజర్లు, వాకీటాకీల పేలుళ్ల నేపథ్యంలో పశ్చిమాసియాలో మరోసారి యుద్దమేఘాలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటి వరకు దాదాపు వంద రాకెట్ లాంఛర్లలో ఉన్న 1000 రాకెట్లను తమ యుద్ద విమానాలను ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. By Bhavana 20 Sep 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి లెబనాన్ లో పేజర్లు, వాకీటాకీల పేలుళ్ల నేపథ్యంలో పశ్చిమాసియాలో మరోసారి యుద్దమేఘాలు ఆవరించాయి. హెజ్‌బొల్లాను లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్ దళాలు భీకర దాడులకు పాల్పడుతున్నాయి. దక్షిణ లెబనాన్ లోని హెజ్‌బొల్లా స్థావరాలపై ఐడీఎఫ్ వైమానిక దాడులకు పాల్పడుతుంది. గురువారం మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు దాదాపు వంద రాకెట్ లాంఛర్లలో ఉన్న 1000 రాకెట్లను తమ యుద్ద విమానాలను ధ్వంసం చేసినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. ఈ రాకెట్లను ఇజ్రాయెల్ భూభాగం పై దాడి చేసేందుకు సిద్ధం చేయగా... వాటిని నిర్వీర్యం చేసినట్లు తెలిపింది. హెజ్‌బొల్లా సభ్యులకు చెందిన పేజర్లు, వాకీటాకీల పేలుళ్ల ఘటన నేపథ్యంలో ఈ సంస్థ అధిపతి హసన్ నస్రల్లా మాట్లాడారు. ఆ సమయంలోనూ ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేయడం గమనార్హం. దాదాపు నాలుగు వేల పేజర్లను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారని.. 4000 మందిని ఒకేసారి చంపేందుకు కుట్ర పన్నారని నస్రల్లా ఆరోపించారు. రెండో రోజు దాడిలో వాకీటాకీలు పేల్చి.. మరో వెయ్యి మందిని హతమార్చేందుకు యత్నిస్తున్నారని అన్నారు. రెడీగా ఉన్న అమెరికా.. ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణలతో దాదాపు ఏడాది కాలంగా పశ్చిమాసియా తగలబడుతూనే ఉంది. ఇప్పుడు ఈ యుద్దం లెబనాన్ కు విస్తరించనుందన్న భయాందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతో అమెరికా అప్రమత్తమైంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో ఏడాది నుంచి తమ సైన్యాన్ని అక్కడే ఉంచిన అమెరికా...తాజా పరిణామాలతో అలర్ట్ అయ్యింది. ఇజ్రాయెల్ పై ప్రతీకారం తీర్చుకుంటామని హెజ్‌బొల్లా శపథం చేయడంతో యుద్ద విమానాలు, నౌకలు , బలగాలతో సిద్ధమవుతోంది. హెజ్బుల్లా ఉగ్ర కార్యకలాపాలు, మౌలిక సదుపాయాల నాశనమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్పింది. వాటిపై ఖతర్ ఎయిర్ లైన్స్ నిషేధం... పేజర్లు, వాకీటాకీల పేలుళ్లతో అప్రమత్తమైన లెబనాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక పై తమ దేశం నుంచి వెళ్లే విమానాల్లో పేజర్లు, వాకీటాకీలు తీసుకుపోవడాన్ని నిషేధించిన సంగతి తెలిసిందే. అటు ఖతర్ ఎయిర్ లైన్స్ కూడా దీని పై ప్రకటన చేసింది. లెబనాన్ ఆదేశాలకు అనుగుణంగా బీరుట్ నుంచి రాకపోకలు సాగించే ఖతర్ విమానాల్లో పేజర్లు, వాకీటాకీలను నిషేధిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. తరువాత ఆదేశాలు వచ్చేంత వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి