జైలుకు జానీ మాస్టర్.. కోర్టు కీలక ఆదేశం

కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను లైంగిక ఆరోపణల కేసులో పోలీసులు నేడు కోర్టులో హాజరు పరిచారు. దీంతో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. జానీ మాస్టర్ ను విచారించేందుకు పోలీసులు కోర్టును 9 రోజుల కస్టడీని కోరారు. దీనిపై కోర్టు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

author-image
By Anil Kumar
New Update
jaani master

Jaani Master :

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు రావడం ఇండస్ట్రీని కుదిపేసింది. అతని దగ్గర పనిచేసే మహిళా కొరియోగ్రాఫర్ ను లైంగిక వేధింపులకు గురిచేసినట్లు, అత్యాచారానికి పాలపడినట్లు బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

అనంతరం దర్యాప్తు చేపట్టి.. అతన్ని నిన్న గోవాలో అరెస్టు చేసి.. నేడు హైదరాబాద్ లోని ఉప్పరపల్లి కోర్టులో హాజరు పరిచారు. దీంతో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇక జానీ మాస్టర్ ను విచారించేందుకు పోలీసులు కోర్టును 9 రోజుల కస్టడీని కోరారు. కాగా దీనిపై కోర్టు ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. 

ఇదిలా ఉంటే నిన్న గోవాలో జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసిన స్‌వోటీ పోలీసులు..  అతన్ని రహస్య ప్రదేశంలో విచారణ జరిపారు. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్ విచారణలో కీలక విషయాలను వెల్లడించారు.' అమ్మాయిపై లైంగిక దాడి చేయలేదు. కావాలనే కొందరు అమ్మాయితో ఫిర్యాదు చేయించారు. నాపై తప్పుడు కేసు నమోదు చేయించారు. నేను లీగల్‌గా పోరాడుతా. నిజాయితీగా బయటకు వస్తా. నన్ను ఇరికించిన వారిని వదలను' అని చెప్పినట్లు తెలుస్తోంది.

Advertisment
తాజా కథనాలు