Hezbollah: బీరుట్‌లో ఇజ్రాయెల్ దాడి..హిజ్బుల్లా కీలక కమాండర్ మృతి హిజ్బుల్లాను నాశనం చేసే లక్ష్యంతో ఇజ్రాయెల్ వరుస దాడులు చేస్తోంది. ఈరోజు లెబనాన్‌లో బీరుట్ ప్రాంతంలో వైమానిక దాడులను నిర్వహించింది. ఇందులో 8 మంది చనిపోయారు. వారితో పాటూ హిజ్బుల్లా కీలక కమాండర్ అకిల్ కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. By Manogna alamuru 20 Sep 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Hezbollah Commander: వరుసగా నాలుగు రోజుల నుంచీ హిజ్బుల్లా మీద దాడులకు తెగబడుతోంది ఇజ్రాయెల్. మిలిటెంట్లే లక్ష్యంగా పేజర్లు, వాకీటాకీలను పేల్చింది. ఇందులో 3000 మందికి పైగా గాయపడ్డరు. హిజ్బుల్లా సంస్థకు చెందిన 37 మంది మరణించారు. ఇప్పుడు తాజాగా లెబనాన్‌లోని బీరుట్ మీద వైమానిక దాడులతో విరుచుకుపడింది ఇజ్రాయెల్. ఈ దాడిలో 8మంది స్థానికులు మరణించారు. చాలామందికి గాయాలయ్యాయి. మరవైపు దక్షిణ బీరూట్‌లోని మిలిటెంట్ గ్రూప్ ప్రధాన స్థావరంపై కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ దాడిలో హిజ్బుల్లా ఎలైట్ ఫోర్స్ రద్వాన్ యూనిట్ అధిపతి ఇబ్రహీం అకిల్ చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం మీద హిజ్బుల్లా ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. 1983లో బీరుట్‌లోని యుఎస్ రాయబార కార్యాలయంపై బాంబు దాడి చేసి 63 మంది మృతి ఘటనలో అకిల్ ప్రధాన సభ్యుడు. ఇతడి కోసం అమెరికా 7 మిలియన్ల బహుమతి ప్రకటించింది. అక్టోబర్ 07న ఇజ్రాయిల్‌పై హమాస్ దాడి తర్వాత పశ్చిమాసియాను యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అప్పటి నుంచి ఏడాదిగా ఇరు వర్గాల మధ్యా యుద్ధం జరుగుతూనే ఉంది. హమాస్‌కు మద్దతిచ్చిన హిజ్బుల్లాను కూడా ఇజ్రాయెల్ టార్గెట్ చేసింది. తాజా వైమానిక దాడితో ఏడాదిలో లెబనాన్ రాజధాని బీరూట్‌పై ఇది మూడో దాడి. Also Read: Hyderabad: హైడ్రా కు విస్తృత అధికారాలు మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి