iPhone 16 సిరీస్ కోసం ఎగబడిన జనం.. ఉదయం నుంచే స్టోర్ ముందు భారీ క్యూలైన్లు

యాపిల్ ప్రేమికులు ఎదురుచూసే ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు ఈరోజు నుంచి మార్కెట్లో లభ్యమవుతున్నాయి. దీంతో కొనుగోలు దారులు ఉదయం నుంచే యాపిల్ స్టోర్ల ముందు బారులుదీరారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

author-image
By Manoj Varma
New Update
iPhone 16

Apple iPhone 16 : ఐఫోన్ ప్రేమికులు ఎంతగానే ఎదురుచూసే 16 సిరీస్ ఫోన్లను యాపిల్ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఈరోజు ఉదయం నుంచి ఈ ఐఫోన్ 16 సిరీస్ ఫోన్ల విక్రయం కొనసాగుతోంది. కొత్తగా వచ్చిన ఈ సిరీస్‌ ఫోన్లు కొనుగోలు చేయడానికి ఆపిల్ స్టోర్‌ల వద్ద జనం భారీగా ఎగబడ్డారు. ఏఐ సాంకేతికతో రూపొందించిన ఈ ఐఫోన్ సిరీస్ 16ను కొనుగోలు చేయడానికి స్టోర్ వద్ద భారీగా క్యూలైన్లు కట్టారు. ముంభై, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో ఆపిల్ స్టోర్లు కొనుగోలుదారులతో నిండిపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఐఫోన్ అంటే ఆ మాత్రం క్రేజ్ ఉండటం సహజమేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

యాపిల్ కంపెనీ ఐఫోన్ 16 సిరీస్లను మొత్తం నాలుగు మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ లను విడుదల చేసింది. మిగతా సిరీస్‌లతో పోలిస్తే 16 సిరీస్‌లో కెమెరా కంట్రోల్ బటన్, యాక్షన్ బటన్‌ అనే వాటిని కూడా యాడ్ చేశారు. ఇందులో ఏ 18 అనే కొత్త చిప్‌తో ప్రత్యేకంగా తయారు చేశారు. అయితే ఐఫోన్ 16 ప్రారంభ ధర రూ.79,900 ఉండగా, ఐఫోన్ 16 ప్లస్ ప్రారంభ ధర రూ. 89,900, ఐఫోన్ 16 ప్రో ధర రూ. 1,19,900, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ధర రూ. 1,44,900గా కంపెనీ నిర్ణయించింది. 128జీబి, 256 జీబీ, 512 జీబీల్లో లభిస్తాయి.  

మిగతా మోడళ్లలో పోలిస్తే.. ఐఫోన్ 16 సీరిస్ ఫోన్లు ఎయిరోస్పేస్ గ్రేడ్ అల్యూమినియంతో తయారు చేశారు. ఇవి ఐఓఎస్ 18తో పనిచేస్తాయి. 48 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా బ్యాక్ సైడ్ ఉండగా, 12 ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా కూడా ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 12 ఎంపీ కెమెరా అమర్చారు. ఐఫోన్ 16 ప్రో, ప్రో మ్యాక్స్ మోడళ్లకి ఏ 18 ప్రో చిప్ అమర్చారు. అలాగే ఈ ప్రో మోడళ్లలో 4కె ఉండే క్వాలిటీతో వీడియోలు తీయవచ్చు.

Also Read :  జగన్‌కు షాక్.. టీడీపీలోకి మాజీ ఎమ్మెల్యే!

 

Advertisment
Advertisment
తాజా కథనాలు