ఎలాన్ మస్క్‌కు షాక్.. స్టార్‌లింక్ శాటిలైట్లతో ఇతర పరిశోధనలకు ఆటంకం మారుమూల ప్రాంతాలకు ఇంటర్నేట్ సేవలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్న ఎలాన్‌మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్లపై ఖగోళ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ శాటిలైట్లు కీలకమైన రేడియో సిగ్నళ్లను బ్లాక్ చేస్తున్నాయని చెబుతున్నారు. By B Aravind 20 Sep 2024 in ఇంటర్నేషనల్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి ఈ ప్రంపంచంలో ఉన్న మారుమూల ప్రాంతాలతో పాటు ఎక్కడికి వెళ్లిన ఇంటర్నెట్ సేవలు ప్రజలకు అందించాలనే లక్ష్యంతో స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్లు పనిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి విప్లవాత్మక సాంకేతిక పురోగతికి శ్రీకారం చుట్టిన ఈ స్టార్‌లింక్ శాటిలైట్లు.. ఇప్పుడు విశ్వ పరిశోధనలకు ఇబ్బందులు కలిగిస్తున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ స్టార్‌లింక్ శాటిలైట్లు కీలకమైన రేడియో సిగ్నళ్లను బ్లాక్ చేస్తున్నాయని.. ప్రతిసారి కొత్త స్టార్‌లింక్ శాటిలైట్ ప్రయోగం వల్ల పరిస్థితి మరింత దిగజారుతోన్నట్లు నెదర్లాండ్‌కు చెందిన పరిశోధకులు గుర్తించారు. Also Read: విరుచుకుపడిన ఇజ్రాయెల్...1000 రాకెట్లు ధ్వంసం! స్టార్‌లింక్ శాటిలైట్ల సంఖ్య రోజురోజుకు పెరగడం వల్ల ఇలా ఖగోళ పరిశోధనల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. బ్లాక్ హోల్స్, దూరంగా ఉండే గెలాక్సీలపై జరిపే పరిశోధనలపై ప్రభావం చూపిస్తున్నాయని చెబుతున్నారు. విశ్వాన్ని అన్వేషించే శక్తివంతమైన సంస్థలో ఒకటైన ‘ది యూరిపోయిన్ లో ఫ్రీక్వెన్సీ అర్రే రేడియో టెలిస్కోప్ నెట్‌వర్క్ (LOFAR) అనే సంస్థ.. ఈ స్టార్‌లింక్ శాటిలైట్స్‌పై ఆందోళన వ్యక్తం చేస్తోంది. అంతేకాదు ఈ స్టార్‌లింక్ శాటిలైట్ల సంఖ్య పెరగడం కూడా విశ్వ పరిశోధనలకు సవాలు విసురుతోందని వార్నింగ్ ఇస్తోంది. స్పేస్ ఎక్స్ సంస్థ తమ ప్రయోగాలు ప్రారంభించినప్పటి నుంచి వాటి రెడియో ఉద్గారాలు.. ఎక్సోప్లానెట్స్, బ్లాక్‌హోల్స్‌లాంటి వాటిని గుర్తించే LOFAR సామర్థ్యానికి ఆటంకాలు కలిగిస్తున్నాయని చెపుతోంది. Also Read: ట్రంప్ ర్యాలీలో పాల్గొన్నవారికి వింత జబ్బు? గత ఏడాదే అంతరిక్షంలో అడ్డుతగులుతున్న సిగ్నళ్లను గుర్తించామని LOFAR సంస్థ సెంటిఫిక్ అండ్ జనరల్ డైరెక్టర్ జెస్సికా డెంప్‌సే చెప్పినట్లు ఓ ఆంగ్ల మీడియా చెప్పింది. ఆ సిగ్నళ్లు భూఉపరితల కక్ష్యలో తిరుగుతున్న మొదటి తరం స్టార్‌లింక్ శాటిలెట్ల నుంచి వస్తున్నట్లు కనిపెట్టామని ఆమె చెప్పినట్లు పేర్కొంది. ఇదిలాఉండగా ప్రపంచవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలకు వేగంగా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు దాదాపు ఆరు వేలకు పైగా స్పేస్‌లో స్టార్‌లింక్ శాటిలైట్లు పనిచేస్తున్నాయి. వీటి నుంచి విడుదలయ్యే ఎలక్ట్రోమ్యాగ్నటిక్ రేడియేషన్.. లోఫర్ లాంటి రేడియో టెలిస్కోప్‌ల సిగ్నళ్లకు ఆంటకం కలిగిస్తున్నాయి. అయితే మొదట్లో శాటిలైట్లలో లోపపూరిత బ్యాటరీల వల్ల ఇబ్బందులు తలెత్తినట్లు ఖగోళ శాస్త్రవేత్తలు భావించారు. ఇక స్పేస్‌ఎక్స్ ఆధునికీకరించిన స్టార్‌లింక్ వీ2 మినీ శాటిలైట్ల ప్రయోగం అనంతరం ఈ సమస్యలు మరింత తీవ్రమయ్యాయని చెబుతున్నారు. ఈ స్టార్‌లింక్ శాటిలైట్లు 30 రేట్లు ఎక్కువగా ఉద్గారాలు విడుదల చేస్తున్నాయని.. దీనివల్ల ఇవి మిగతా వాటిపైన ప్రభావం చూపిస్తూ ఇతర పరిశోధనలకు ఆంటకం కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. #telugu-news #elon-musk #starlink #space-x మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి