Canara Bank:కెనెరా బ్యాంకులో 3000 ఉద్యోగాలు.. రేపటినుంచే అప్లికేషన్స్! నిరుద్యోగులకు శుభవార్త. డిగ్రీ అర్హతతో కెనెరా బ్యాంక్ లో 3000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజైంది. అర్హతగల అభ్యర్థులు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 4వరకు ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి. https://canarabank.com/pages/Recruitment By srinivas 20 Sep 2024 in జాబ్స్ నేషనల్ New Update షేర్ చేయండి Canara Bank Jobs: నిరుద్యోగులకు కెనెరా బ్యాంక్ గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా తమ శాఖలో ఖాళీగా ఉన్న 3000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈమేరకు రీజియన్ల వారీగా బ్యాంకు శాఖల్లో అప్రెంటిస్‌షిప్ శిక్షణలో భాగంగా అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సెప్టెంబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 4 ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవాల్సి ఉండగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మొత్తం ఖాళీలు: 3,000 అర్హత: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీలో డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత తప్పనిసరి. వయోపరిమితి:2024 సెప్టెంబర్ 01 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, బీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల వయో సడలింపు ఉంది. దరఖాస్తులు:సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 4వరకు ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి. శిక్షణ కాలం:ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు యేడాదిపాటు శిక్షణ ఉంటుంది. మరిన్ని వివరాలకోసం వెబ్ సైట్ సంప్రదించండి. https://canarabank.com/pages/Recruitment #jobs-notification #canara-bank మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి