Pawan kalyan:
సార్వత్రిక ఎన్నికల వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan) కాబోయే దేశ ప్రధాని ఎవరనేదానిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోడీ(Narendra modi) రేపు వారణాసి నుంచి నామినేషన్ వేయనుండగా.. ఈ కార్యక్రమంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పాల్గొనేందుకు బయలుదేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన జనసేనాని.. మోడీ మూడోసారి ప్రధాని అవుతారన్నారు.
Pawan kalyan: కాబోయే ప్రధాని ఆయనే.. పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
మోడీ మరోసారి ప్రధాని కాబోతున్నారని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. రేపు మోడీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారణాసి బయలుదేరిన పవన్.. 'ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. తప్పకుండా మోడీ మూడోసారి ప్రధాని అవుతారు. మోడీకి శుభాకాంక్షలు' అని ఆశాభావం వ్యక్తం చేశారు.
Translate this News: