🔴Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదం.. లైవ్ అప్డేట్స్!

ఎయిర్ ఇండియా విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులు, సిబ్బంది అందరూ మరణించారు. లండన్ వెళ్తున్న విమానం గురువారం మధ్యాహ్నం గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలోని మేఘనినగర్‌లో కూలిపోయింది.

author-image
By Manoj Varma
New Update
Air India plane crash may have occurred due to bird hits or major technical fault, say experts

Air India plane crash may have occurred due to bird hits or major technical fault, say experts

 

  • Jun 13, 2025 21:23 IST

    Plane Crash : సంజయ్ గాంధీ, వైఎస్సార్ నుంచి విజయ్ రూపానీ వరకు.. విమాన ప్రమాదాల్లో చనిపోయిన నేతలు వీరే!

    గురువారం అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో సుమారు 241 మంది ప్రయాణికులు మరణించారు. ఈ ప్రమాదంలో  గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా మరణించారు. ఆయనలాగే ఇప్పటివరకు ఇలా విమాన, హెలికాప్టర్‌ ప్రమాదాల్లో మరణించిన నేతలు చాలామందే ఉన్నారు.

    Plane Crash



  • Jun 13, 2025 19:49 IST

    Plane Crash : ఇకపై ఎయిర్ ఇండియా విమానం ఎక్కను...వార్నర్ సంచలన ప్రకటన

    అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. విమాన ప్రమాదంపై స్పందించిన ఆస్ట్రేలియా క్రికెటర్ డెవిడ్‌ వార్నర్‌ ఎయిర్‌ఇండియాపై సంచలన ప్రకటన చేశారు. ఇకమీదట తాను ఎయిర్‌ ఇండియా విమానాలు ఎక్కబోనని తేల్చి చెప్పారు.

    David Warner



  • Jun 13, 2025 19:39 IST

    Venu Swamy : విమాన ప్రమాదంపై ముందే చెప్పిన వేణు స్వామి.. వీడియో తెగ వైరల్!

    గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ (ఫ్లైట్ AI-171) టేకాఫ్ అయిన కొన్ని సెకన్లకే కూలిపోయింది. అహ్మదాబాద్ నుండి లండన్‌కు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

    venuswamy video



  • Jun 13, 2025 19:11 IST

    Google: నల్లరిబ్బన్‌తో గూగుల్ నివాళి

    అహ్మదాబాద్  విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రమాద ఘటనపై ప్రతి ఒక్కరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా విమాన ప్రమాద మృతులకు ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ నివాళులర్పించింది. సెర్చ్ బార్ కింద నల్ల రిబ్బన్ ఉంచి నివాళులు అర్పించింది.
    google



  • Jun 13, 2025 18:52 IST

    Air India Plane Crash: విమాన ప్రమాదం.. ఎయిర్ ఇండియాకు DGCA కీలక ఆదేశాలు

    అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం దృష్ట్యా డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది. భారత్‌లోని  అన్ని బోయింగ్‌ 787 విమానాల్లో భద్రతా తనిఖీలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని ఎయిర్‌ఇండియాకు డీజీసీఏ ఆదేశాలు ఇచ్చింది.

    plane dgca



  • Jun 13, 2025 17:28 IST

    PM Modi : విజయ్ రూపానీ లేడంటే నమ్మలేకపోతున్నా.. మోదీ ఎమోషనల్ ట్వీట్!

    అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కుటుంబాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం పరామర్శించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్టు పెట్టారు.

    vijay-rupani cm
    vijay-rupani cm

     



  • Jun 13, 2025 17:25 IST

    Flight Accident: నా బిడ్డ, తల్లి శవాలు ఎక్కడ?: విమాన ప్రమాదంలో మరో కన్నీటి కథ!

    అహ్మదాబాద్‌ ప్రమాదంలో షార్లాబెన్ ఠాకూర్ అనే మహిళ BJ మెడికల్ కాలేజీ, హాస్టల్ క్యాంటీన్‌లో వంట మనిషితోపాటు ఓ చిన్నారి మృతి చెందారు. తల్లి కూర్చున్న ప్రదేశం పూర్తిగా కాలిపోయిందని తల్లి, కుమార్తె ఆధ్య మృతదేహాన్ని కనుగొనాలని ఆమె కొడుకు రవి ప్రార్థిస్తున్నాడు.

    Flight Accident
    Flight Accident

     



  • Jun 13, 2025 15:28 IST

    BIG BREAKING : విమాన ప్రమాద ఘటనలో కీలక పరిణామం.. బ్లాక్ బాక్స్ లభ్యం

    అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది.  ఘటనా స్థలంలో బ్లాక్ బాక్స్ లభ్యమైంది. బ్లాక్ బాక్స్ ను విశ్లేషిస్తేనే ప్రమాదానికి గల అసలు కారణాలు వెల్లడవుతాయి.

    black box
    black box

     



  • Jun 13, 2025 15:17 IST

    Ahmedabad Tragedy : కేంద్రం సీరియస్‌.. బోయింగ్ పై బ్యాన్!

    అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి బయలుదేరిన కొన్ని సెకన్లకే ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ విమానం కూలిపోయింది. ఈ  విమానంలో 242 మంది ఉండగా అందులో 241 మంది మృతి చెందారు. ఈ ఘటన ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒకరు మాత్రమే ఈ ప్రమాదం నుండి బయటపడ్డారు.

    airindia flight



  • Jun 13, 2025 15:06 IST

    Plane Crash : భర్త బర్త్ డే సెలబ్రేషన్స్ కోసం లండన్ వెళ్తూ.. అనంతలోకాలకు

    ఆమె తన భర్త పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించాలని భావించింది. లండన్‌లో ఉన్న తన భర్తను కలిసేందకు బయలు దేరింది. విమానం గాల్లో ఎగిరిన కొన్ని నిమిషాలకే అనంతలోకాలకు చేరుకుంది.

    plane-carsh birthday london



  • Jun 13, 2025 15:06 IST

    Air India Crash: ఎలా బతికి బయటపడ్డానో తెలియదు... ప్రధాని మోదీతో రమేష్ ఏమన్నాడంటే..

    అహ్మదాబాద్‌ ఎయిరిండియా విమాన ప్రమాదం యావత్‌ ప్రపంచాన్ని తీవ్రంగా కలిచివేసింది. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడింది రమేష్‌ ఒక్కడే. ప్రస్తుతం అహ్మదాబాద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతన్ని ప్రధాని మోదీ పరామర్శించారు. ఘటన గురించి అడిగి  తెలుసుకున్నారు.  

    Prime Minister Modi visits Ramesh



  • Jun 13, 2025 14:51 IST

    Plane Crash: విమానంలో ఎక్కడ కూర్చుంటే సేఫ్‌నో తెలుసా?

    అహ్మదాబాద్‌లోని మేఘని నగర్ సమీపంలో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం తర్వాత చాలా మందిలో ఒక అనుమానం రావడం సహజం. అదెంటంటే అసలు విమానంలో ఎక్కడ కూర్చుంటే ప్రమాదాలు జరిగినా రక్షణ ఉంటుంది అని.

    Plane Crash : కూప్పకూలిన విమానం.. ఆరుగురు దుర్మరణం!



  • Jun 13, 2025 13:32 IST

    22ఏళ్లకే నిండు నూరేళ్లు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఎయిర్ హోస్టెస్ చివరి వీడియో!

    ఎయిర్ ఇండియా ప్రమాదంలో చనిపోయిన ఎయిర్ మణిపూర్ హోస్టెస్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నగాన్తోయ్‌ శర్మ(22) ఫ్లైట్ బయల్దేరే ముందు రీల్ చేసింది. ఆమె ఫొటోలు, వీడియోలు చూస్తూ కుటుంబ సభ్యులు గుండెలు పలిగేలా రోధిస్తున్నారు.

    Nganthoi Sharma



  • Jun 13, 2025 13:31 IST

    Ahmedabad Plane Crash: కాలిబూడిదైన విమానం.. చెక్కు చెదరని భగవద్గీత (వీడియో)

    అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ హిందువులు ఎంతో పవిత్రంగా భావించే భగవత్ గీత మాత్రం చెక్కు చెదర్లేదు. ఈ ప్రమాదంలో శిథిలాల కింద దొరికిన భగవత్‌గీత పై చిన్న కాలిన మరక కూడా లేకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. 

    Bhagavad Gita Found Unburned In Air India Accident
    Bhagavad Gita Found Unburned In Air India Accident Photograph: (Bhagavad Gita Found Unburned In Air India Accident)

     



  • Jun 13, 2025 11:57 IST

    ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో బాంబ్..!

    థాయ్‌లాండ్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో వెంటనే థాయ్‌ల్యాండ్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్ చేశారు సిబ్బంది. విమానంలో బాంబ్ స్వాడ్ తనిఖీలు చేస్తున్నారు.

    bomb threat call



  • Jun 13, 2025 11:50 IST

    ప్రాణాలకు గ్యారెంటీ లేదు బ్రో.. మొన్న పహల్గామ్, నిన్న బెంగళూరు, నేడు అహ్మదాబాద్..!

    ప్రాణం ఎప్పుడు, ఎలా పోతుందో చెప్పలేం. ఇటీవల కాలంలో జరిగిన ఇన్సిడెంట్సే నిదర్శనం. ఏప్రిల్ 22న పహల్గాంలో టెర్రరిస్టుల కాల్పులో 26 మంది టూరిస్టులు, బెంగళూరులో జూన్ 4న తొక్కిసలాటలో 11మంది అభిమానులు, అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు.

    Ahmedabad Plane Crash, Pahalgam Terror Attack, RCB Victory Parade Incidents
    Ahmedabad Plane Crash, Pahalgam Terror Attack, RCB Victory Parade Incidents

     



  • Jun 13, 2025 11:32 IST

    త్వరలోనే ఇండియా నుంచి చైనాకు విమాన ప్రయాణాలు.!

    చైనా విదేశాంగశాఖ ఉప మంత్రి సన్‌ వీడాంగ్‌తో భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ భేటీ అయ్యారు. కైలాస్ మానస సరోవర యాత్రకు చైనా అందిస్తున్న సహకారాన్ని మిస్రీ అభినందించారు. త్వరలోనే తుది నిర్ణయం వెలువడుతుందని ఆయన అన్నారు.

    china and india



  • Jun 13, 2025 11:12 IST

    విమాన ప్రమాదానికి 3 కారణాలివే.. అంతా బ్లాక్ బాక్స్‌లోనే.. ఎక్స్పర్ట్ సంచలనం!

    అహ్మదాబాద్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. దీనిపై ఏఏబీ దర్యాప్తు చేపట్టింది. బ్లాక్ బాక్స్ దొరికితేనే కానీ అసలు విషయం తెలియదు. కానీ విమాన ప్రమాదానికి ప్రధానంగా మూడు కారణాలు ఉండి ఉండొచ్చునని నిపుణులు చెబుతున్నారు.

    Air India plane crash may have occurred due to bird hits or major technical fault, say experts
    Air India plane crash may have occurred due to bird hits or major technical fault, say experts

     



  • Jun 13, 2025 10:43 IST

    జస్ట్ మిస్.. అమెరికాలో మరో విమాన ప్రమాదం..!

    అమెరికాలో ఘోర విమాన ప్రమాదం తప్పింది. బోస్టన్‌లోని గాన్ ఎయిర్‌పోర్టులో ఫైట్ ల్యాండ్ అవుతుండగా రన్‌వే నుంచి విమానం పక్కకు దూసుకెళ్లింది. అప్రమత్తమైన పైలట్ చాకచక్యంగా ఫ్లైట్‌ను అదుపు చేశాడు. ఎయిర్‌పోర్ట్‌ సిబ్బంది ప్యాసింజర్లును సురక్షితంగా కిందకి దించారు.

    Boston Logan Airport



  • Jun 13, 2025 10:20 IST

    Bhagavad Gita Was Found



  • Jun 13, 2025 09:51 IST

    ఖుష్బు రాజ్‌పురోహిత్ చివరి వీడియో



  • Jun 13, 2025 09:40 IST

    Visuals From Civil Hospital Where Police Serve Refreshments To The Families



  • Jun 13, 2025 09:37 IST

    Due To The Emerging Situation In Iran



  • Jun 13, 2025 09:36 IST

    ANI



  • Jun 13, 2025 09:35 IST

    తండ్రి కోసం ఉద్యోగాన్ని వదిలేయాలనుకున్నాడు...కానీ ఏకంగా ప్రాణాలే..

    నిన్న జరిగిన అహ్మదాబాద్ లో జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ లో ఇద్దరు పైలెట్లతో పాటూ మరో 241 మంది చనిపోయారు. మరణించిన పైలెట్లలో కెప్టెన్ సుమిత్ సభర్వాల్ తన 90 ఏళ్ళ తండ్రిని చూసుకోవడానికి ఉద్యోగాన్ని వదిలేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

    flight
    Captain Sumeet Sabharwal

     



  • Jun 13, 2025 08:56 IST

    విమాన ప్రమాదానికి.. మాజీ CM మృతికి.. 1206 నెంబర్‌కు ఉన్న లింక్ ఇదే..!

    గుజరాత్ మాజీ CM విమాన ప్రమాదంలో మరణించిన తేదీతో ఆయనకు మిస్టీరియస్ కనెక్షన్ ఉంది. 1206 అనే నెంబర్ విజయ్ రూపాని లక్కీ నెంబర్. 12తేదీ 06నెలలో ఆయన మరణం బాధగానూ, ఆశ్చరకరంగానూ ఉంది. అయిన సీట్ నెంబర్ 12, కార్ల నెంబర్ 1206యే.

    Vijay Rupani



  • Jun 13, 2025 08:55 IST

    విమాన ప్రమాదం జరిగితే ఎయిరిండియా పరిహారం ఎంత?.. ప్రయాణ బీమా లేకపోతే ఏమవుతుంది? నియమాలు ఏంటి?

    అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం తర్వాత ప్రయాణబీమా నుండి ఒక వ్యక్తి ఎంత ప్రయోజనం పొందుతారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ ప్రయాణ బీమా లేకపోయినా మృతులకు పరిహారం లభిస్తుందా? లేదా?, విమానయాన సంస్థల పరిహారం గురించి నియమాలు ఏంటి? అనేది పూర్తిగా తెలుసుకుందాం.

    Plane travel insurance
    Plane travel insurance Photograph: (Plane travel insurance)

     



  • Jun 13, 2025 08:54 IST

    ఆపరేషన్ రైజింగ్ లయన్..ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్‌ చీఫ్‌ మృతి..

    మిడిల్ ఈస్ట్ మళ్ళీ రగులుతోంది. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. రాజధాని టెహ్రాన్ మీద కూడా దాడులు జరిగాయి. ఈ భీకర దాడుల్లో ఇరాన్‌ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్‌ చీఫ్‌ సహా పలువురు కీలక వ్యక్తులు మరణించినట్లు తెలుస్తోంది.

    iran
    Iran Revolutionary Guards Chief Hossein Salami

     

     



  • Jun 13, 2025 08:11 IST

    అహ్మదాబాద్‌లో నేడు ప్రధాని పర్యటన..

    ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లోని ఫ్లైట్ క్రాష్ ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. ఆయన ఉదయం 8:30 గంటలకు అక్కడికి చేరుకొని ప్రమాదానికి కారణాలు, సహాయక చర్యలను అధికారులను అడిగి తెలుసుకోనున్నారు.

    PM Modi
    PM Modi

     

     

     



  • Jun 13, 2025 07:55 IST

    భార్యను కలవడానికి వెళ్తూ..తిరిగి రాని లోకాలకు గుజరాత్ మాజీ సీఎం రూపానీ

    అహ్మదాబాద్ విమానం ఘోర ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఇందులో మొత్తం 265 మంది మృతి చెందారు. వీరిలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా ఉన్నారు. ఆయన మరణాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ ధ్రువీకరించారు.

    flight
    Gujarath Former CM Vijay Rupani

     

     

     



  • Jun 13, 2025 07:43 IST

    మరణించే ముందు విమాన ప్రమాదంపై సంజయ్ కపూర్ పోస్ట్

    నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ తన మరణానికి కొన్నిగంటల ముందు అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై బాధను వ్యక్తం చేశారు. ‘‘ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం బాధిత కుటుంబాలందరికీ నా సంతాపం. ఈ సమయంలో దేవుడు వారికి బలాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను’’ అని రాసుకొచ్చారు. 

    sanjay kapoor shared post on ahmedabad plane crash before passed away
    sanjay kapoor shared post on ahmedabad plane crash before passed away

     



  • Jun 13, 2025 07:33 IST

    బాలీవుడ్ స్టార్ హీరో బావనే కోపైలట్.. ‘12th ఫెయిల్’ నటుడి సంతాపం

    అహ్మదాబాద్‌లో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా ఫ్లైట్‌ కోపైలట్ క్లైవ్ కుందర్.. బాలీవుడ్ హీరో విక్రాంత్ మాస్సే బంధువు. క్లైవ్ కుందర్ మృతి పట్ల విక్రాంత్ మాస్సే సంతాపం వ్యక్తం చేశారు. క్లైవ్ కుందర్‌ తన మామ క్లిఫోర్డ్ కుందర్ కొడుకు అని ఆయన తెలిపాడు.

    Co-pilot Clive Kunder



  • Jun 13, 2025 07:08 IST

    విమాన ప్రమాదంపై విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తొలి రియాక్షన్

    అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై విరాట్, రోహిత్ స్పందించారు. ఈ సంఘటనతో పూర్తిగా షాక్‌కు గురయ్యామని అన్నారు. ఈ ప్రమాదంలో బాధితుల కోసం ప్రార్థిస్తున్నామని.. వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నామని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్టు చేశారు.

    Ahmedabad Plane Crash virat kohli and rohit sharma first reaction
    Ahmedabad Plane Crash virat kohli and rohit sharma first reaction

     

     



  • Jun 13, 2025 07:07 IST

    A- 171 విమాన ప్రమాదానికి గల ఐదు కారణాలు

    భారత గగనతలంలో ఘోరం జరిగింది. అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ ఫ్లైట్ కుప్పకూలిపోయింది. ఇందులో ఒక్కరు తప్ప మొత్తం 265 మంది చనిపోయారు.

    flight accident
    A-171 Flight accident

     



  • Jun 13, 2025 07:07 IST

    స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ మాజీ భర్త మృతి..

    బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ 53 సంవత్సరాల వయసులో మరణించారు. యూకేలో ఉంటున్న ఆయన గురువారం పోలో ఆడుతుండగా గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. 2017లో ప్రియా సచ్‌దేవ్‌తో ఆయన రెండవ వివాహం చేసుకున్నారు.

    Karisma Kapoor ex-husband Sunjay Kapur
    Karisma Kapoor ex-husband Sunjay Kapur

     

     

     



  • Jun 13, 2025 07:05 IST

    బోయింగ్ డ్రీమ్ లైనర్లపై చర్చ..బోయింగ్ 787లో లోపాలు..ఏడాది క్రితమే ఫిర్యాదు

    అహ్మదాబాద్లో కూలిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 యే కాకుండా డ్రీమ్ లైనర్ మోడల్స్ 777లో కూడా లోపాలున్నాయని గతేడాదే ఆరోపణలు వచ్చాయి.787లో ప్రతీ రెండు విడి భాగాలకు మధ్య గ్యాపులుంటాయని..వియాన తయారీలో కంపెనీ అడ్డదారులు తొక్కిందని ఒక ఇంజనీర్ ఫిర్యాదు ఇచ్చారు.

    flight
    AI 171 Horror

     



Advertisment
Advertisment
తాజా కథనాలు