Ahmedabad Plane Crash: విమాన ప్రమాదంపై విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తొలి రియాక్షన్

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంపై విరాట్, రోహిత్ స్పందించారు. ఈ సంఘటనతో పూర్తిగా షాక్‌కు గురయ్యామని అన్నారు. ఈ ప్రమాదంలో బాధితుల కోసం ప్రార్థిస్తున్నామని.. వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నామని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్టు చేశారు.

New Update
Ahmedabad Plane Crash virat kohli and rohit sharma first reaction

Ahmedabad Plane Crash virat kohli and rohit sharma first reaction

అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంతో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. సర్దార్ వల్లభాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన రెండు నిమిషాల్లోనే విమానం ముక్కలుగా విరిగిపోయింది. విమానం కూలిపోయిన ప్రదేశంలో నల్లటి పొగ చాలా ఎత్తుకు ఎగసిపడింది. 

Also Read: నేను ఎలా బతికి బయటపడ్డానంటే? ప్రమాదంలో బయట పడ్డ ఒకే ఒక్కడు రమేష్ సంచలన విషయాలు..

Ahmedabad Plane Crash

చుట్టూ అరుపులు వినిపించాయి. ఈ ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో 229 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, 12 మంది సహాయ సిబ్బంది, విమానం మెడికల్ కాలేజీ హాస్టల్ మీద పడడంతో అక్కడి విద్యార్థులు 24 మంది మృత్యువాత పడ్డారు. ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. 

Also Read: మెడికల్ స్టూడెంట్స్ హాస్టల్ పై కూలిన విమానం.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యాలు!

విరాట్ కోహ్లీ రియాక్షన్

ఈ విషాద ప్రమాదం గురించి భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ స్పందించారు. ఈ సంఘటనతో తాను పూర్తిగా షాక్‌కు గురయ్యానని అన్నారు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్టును పంచుకున్నారు. దీనిపై విచారం వ్యక్తం చేశారు. ‘‘అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం వార్త విని నేను పూర్తిగా షాక్‌కు గురయ్యాను. ఈ ప్రమాదంలో బాధితుల కోసం నేను ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని ఆయన రాసుకొచ్చారు. 

Also Read:బిగ్‌ అప్‌డేట్.. కుప్పకూలిన విమానంలో మాజీ సీఎం

రోహిత్ రియాక్షన్

అలాగే ఈ ఘటనపై మరో భారత క్రికెటర్ రోహిత్ కూడా ఈ హృదయ విదారక ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. ‘‘అహ్మదాబాద్ నుండి చాలా విచారకరమైన, హృదయ విదారక వార్త. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి, వారి కుటుంబాలకు నేను ప్రార్థిస్తున్నాను’’ అని రాసుకొచ్చారు. 

Also read: విమాన ప్రమాదంపై ప్రపంచ దేశాల సంతాపం

అంతేకాకుండా ఈ ప్రమాదం గురించి మాజీ స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ కూడా ట్వీట్ చేశారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఈ విమాన ప్రమాదం తనను పూర్తిగా దిగ్భ్రాంతికి గురి చేసిందని, బాధపెట్టిందని ఆయన అన్నారు. ఈ సంఘటనపై ఇర్ఫాన్ పఠాన్ కూడా విచారం వ్యక్తం చేశారు.

rohith-sharma

Advertisment
Advertisment
తాజా కథనాలు