/rtv/media/media_files/2025/06/13/EeMEnhcQLgsULeRQxtwo.jpg)
sanjay kapoor shared post on ahmedabad plane crash before passed away
బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ తుదిశ్వాస విడిచారు. జూన్ 12న పోలో ఆడుతుండగా.. సంజయ్ అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మరణించారు. సంజయ్ కపూర్ తన మరణానికి కొన్ని గంటల ముందు అహ్మదాబాద్ విమాన ప్రమాదం గురించి తన బాధను వ్యక్తం చేశాడు. ఈ మేరకు తన ట్వీట్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేశారు.
Also Read: నేను ఎలా బతికి బయటపడ్డానంటే? ప్రమాదంలో బయట పడ్డ ఒకే ఒక్కడు రమేష్ సంచలన విషయాలు..
సంజయ్ కపూర్ పోస్ట్ ప్రకారం..
సంజయ్ కపూర్ జూన్ 12న సాయంత్రం 5:11 గంటలకు తన ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. ఆ పోస్ట్‌లో గుజరాత్‌లోని అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. ‘‘అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం గురించి భయంకరమైన వార్త. బాధిత కుటుంబాలందరికీ నా సంతాపం మరియు ప్రార్థనలు ఉన్నాయి. ఈ క్లిష్ట సమయంలో దేవుడు వారికి బలాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను.’’ అని రాసుకొచ్చారు.
Also Read: మెడికల్ స్టూడెంట్స్ హాస్టల్ పై కూలిన విమానం.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యాలు!
Terrible news of the tragic Air India crash in Ahmedabad. My thoughts and prayers are with all the families affected. May they find strength in this difficult hour. 🙏 #planecrash
— Sunjay Kapur (@sunjaykapur) June 12, 2025
సంజయ్ కపూర్ పోస్ట్ పై యూజర్లు స్పందించారు. ఒక యూజర్ సంజయ్ పోస్ట్ పై ఓం శాంతి అని రాశారు. ఈ సమయంలో జీవితంపై నమ్మకం లేదని మరొక యూజర్ అన్నారు. ఈ రోజు నిజంగా చాలా చెడ్డ రోజు అని మరో యూజర్ అన్నారు.
ఈ సమయంలో బాదిత కుటుంబాల కోసం సంజయ్ ప్రార్థించాడు. కానీ ప్రజల కోసం ప్రార్థించే వ్యక్తి కొన్ని గంటల్లోనే ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచిపెట్టి వెళ్లిపోతాడని ఎవరూ ఊహించి ఉండరు. సంజయ్ కపూర్ ఆకస్మిక మరణంతో ఆయన అభిమానులు, సినీ ప్రియులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.
Also read: విమాన ప్రమాదంపై ప్రపంచ దేశాల సంతాపం
Ahmedabad Plane Crash | Sanjay Kapoor Passes Away