Air India: బాలీవుడ్ స్టార్ హీరో బావనే కోపైలట్.. ‘12th ఫెయిల్’ నటుడి సంతాపం

అహ్మదాబాద్‌లో ప్రమాదానికి గురైన ఎయిర్ ఇండియా ఫ్లైట్‌ కోపైలట్ క్లైవ్ కుందర్.. బాలీవుడ్ హీరో విక్రాంత్ మాస్సే బంధువు. క్లైవ్ కుందర్ మృతి పట్ల విక్రాంత్ మాస్సే సంతాపం వ్యక్తం చేశారు. క్లైవ్ కుందర్‌ తన మామ క్లిఫోర్డ్ కుందర్ కొడుకు అని ఆయన తెలిపాడు.

New Update
Co-pilot Clive Kunder

అహ్మదాబాద్‌ నుంచి లండన్ బయల్దేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్‌లో కోపైలట్  క్లైవ్ కుందర్ మృతి చెందాడు. ఒక్క ప్రయాణికుడు తప్ప ఆయనతో పాటు విమానంలో ఉన్న అందరూ చనిపోయారు. క్రాష్ అయిన AI171 ఫ్లైట్‌కు క్లైవ్ కుందర్ కోపైలట్‌గా వ్యవహరించాడు. ఆయన ఎవరో కాదు. నటుడు విక్రాంత్ మాస్సే బంధువు. ఈ ప్రమాదం ఆయనకు చాలా బాధ కలిగించిందని ఇన్‌గ్రామ్‌లో పోస్ట్ చేశాడు. క్లైవ్ కుందర్ మృతి పట్ల నటుడు విక్రాంత్ మాస్సే సంతాపం వ్యక్తం చేశారు. విక్రాంత్ మాస్సే 12 ఫెయిల్ సినిమా హీరోగా బాగా ఫెమస్ అయ్యాడు. సబర్మతి ఫైల్స్, మీర్జాపూర్‌, సెక్టార్ 36, మొదలైన అనేక సినిమాల్లో ఆయన నటించారు.  

Also Read :  ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో బాంబ్..?

Air India Flight Co-Pilot - Clive Kunder, Vikrant Massey

Also Read :  ప్రాణాలకు గ్యారెంటీ లేదు బ్రో.. మొన్న పహల్గామ్, నిన్న బెంగళూరు, నేడు అహ్మదాబాద్..!

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల కోసం నా హృదయం విలపిస్తోందని విక్రాంత్ మాస్సే పోస్ట్ చేశారు. ఈ ప్రమాదంలో నా మామ క్లిఫోర్డ్ కుందర్ తన కొడుకు క్లైవ్ కుందర్‌ను కోల్పోవడం మరింత బాధాకరంగా ఉందని ఆయన పేర్కొన్నారు. 

లండన్‌లోని గాట్విక్ విమానాశ్రయానికి వెళ్తున్న AI171 విమానంలో క్లైవ్ కుందర్ ఫస్ట్ ఆఫీసర్. అతనికి 1,100 గంటలకు పైగా విమాన ప్రయాణ అనుభవాన్ని ఉంది. 8,200 గంటలు విమాన ప్రయాణాలు చేసిన లైన్ ట్రైనింగ్ కెప్టెన్ సుమీత్ సభర్వాల్‌కు కోపైలట్‌గా ఉన్నాడు. 

Also Read :  ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య వివాదం ఏంటి..ఎందుకు దాడులు చేసుకుంటున్నాయి?

Also Read :  త్వరలోనే ఇండియా నుంచి చైనాకు విమాన ప్రయాణాలు.!

 

Vikrant Massey | Ahmedabad-London flight crash | air flight to prayag | Air India Flight | amritsar flight news | Clive Kunder | Co-pilot Clive Kunder | latest-telugu-news

Advertisment
Advertisment
తాజా కథనాలు