BIG BREAKING : విమాన ప్రమాద ఘటనలో కీలక పరిణామం.. బ్లాక్ బాక్స్ లభ్యం

అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది.  ఘటనా స్థలంలో బ్లాక్ బాక్స్ లభ్యమైంది. బ్లాక్ బాక్స్ ను విశ్లేషిస్తేనే ప్రమాదానికి గల అసలు కారణాలు వెల్లడవుతాయి.

New Update
black box

black box

అహ్మదాబాద్ లో జరిగిన విమాన ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది.  ఘటనా స్థలంలో బ్లాక్ బాక్స్ లభ్యమైంది. బ్లాక్ బాక్స్ ను విశ్లేషిస్తేనే ప్రమాదానికి గల అసలు కారణాలు వెల్లడవుతాయి. జరిగిన ప్రమాదంపై ఉన్నాతాధికారులు అహ్మదాబాద్ విమానాశ్రయంలో సమీక్ష నిర్వహిస్తున్నారు.  విమాన ప్రమాదానికి గల కారణలపై చర్చిస్తున్నారు. 


అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నిన్న లండన్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ విమానం టేకాఫ్ అయిన నిమిషంలోనే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమాన సిబ్బంది, ప్రయాణికులతో సహా మొత్తం 265 మంది మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు.  విమానం కూలిన ప్రదేశంలో సహాయక చర్యలు పూర్తయ్యాయి.

Advertisment
Advertisment
తాజా కథనాలు