Air India Plane Crash: విమాన ప్రమాదం.. ఎయిర్ ఇండియాకు DGCA కీలక ఆదేశాలు

అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం దృష్ట్యా డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది. భారత్‌లోని  అన్ని బోయింగ్‌ 787 విమానాల్లో భద్రతా తనిఖీలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని ఎయిర్‌ఇండియాకు డీజీసీఏ ఆదేశాలు ఇచ్చింది.

New Update
plane dgca

Air India Plane Crash: అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం దృష్ట్యా డీజీసీఏ కీలక ఆదేశాలు జారీ చేసింది. భారత్‌లోని  అన్ని బోయింగ్‌ 787 విమానాల్లో భద్రతా తనిఖీలు చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు తనిఖీలు చేసి నివేదిక ఇవ్వాలని ఎయిర్‌ఇండియాకు డీజీసీఏ ఆదేశాలు ఇచ్చింది. 2025 జూన్ 15 అర్ధరాత్రి (00:00 గంటలు) నుండి భారతదేశం నుండి విమానాలు బయలుదేరే ముందు తప్పనిసరి వన్-టైమ్ స్పెషల్ చెక్ ప్రక్రియను అమలు చేయాలని DGCA ఎయిర్ ఇండియాను ఆదేశించింది. 

Also Read: విమాన ప్రమాదం.. ఎయిర్ ఇండియాకు DGCA కీలక ఆదేశాలు

Also Read: మరోసారి బెదిరింపులు.. పోలీసులు పట్టించుకోవడం లేదంటున్న రాజాసింగ్!

ఇలాంటి సంఘటనలు జరగకుండా

విమానానికి ముందు ఇంధన పారామీటర్ పర్యవేక్షణ, క్యాబిన్ ఎయిర్ కంప్రెసర్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ ఇంజిన్ కంట్రోల్ టెస్ట్, ఇంజిన్ ఫ్యూయల్ యాక్యుయేటర్ ఆపరేషన్, ఆయిల్ సిస్టమ్, హైడ్రాలిక్ సిస్టమ్ సర్వీస్ చెక్ వంటి అనేక ముఖ్యమైన సాంకేతిక తనిఖీలు చేయాలని DGCA ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా, ప్రయాణీకుల ప్రాణాలకు భద్రత కల్పించేందుకు ఎయిర్ ఇండియా భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో DGCA ఈ చర్య తీసుకున్నట్లు సమాచారం.

Also Read: విజయ్ రూపానీ లేడంటే నమ్మలేకపోతున్నా.. మోదీ ఎమోషనల్ ట్వీట్!

డీజీసీఏ ఆదేశాలతో  ఎయిర్ ఇండియా చర్యలు ప్రారంభించింది. అన్ని 787 సిరీస్ విమానాలపై ప్రత్యేక ఆడిట్ రూపొందిస్తుంది.  బోయింగ్ విమానాల్లో భద్రతా ప్రమాణాలపై సమీక్ష నిర్వహించనుంది. కాగా అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలో జరిగిన ఘోర ప్రమాదంలో దాదాపు 265 మంది మరణించారు. 

Advertisment
తాజా కథనాలు