/rtv/media/media_files/2025/06/13/z0PPPEFWGHV5mXOsrWCP.jpg)
Ahmedabad Plane Crash Plane travel insurance
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం తర్వాత, ప్రయాణ బీమా ప్రాముఖ్యత మరోసారి తెరపైకి వచ్చింది. విమాన ప్రమాదంలో మృతి చెందిన ప్రయాణీకులకు ఎంత పరిహారం చెల్లిస్తారు. ప్రయాణ బీమా ఏంటి?.. అది ఎలా వస్తుంది? దాని నియమాలేంటి? అనేది ఇప్పుడు ప్రశ్న. ప్రయాణ బీమా నుండి ఒక వ్యక్తి ఎంత ప్రయోజనం పొందుతారో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒకవేళ ప్రయాణ బీమా లేకపోయినా మృతులకు పరిహారం లభిస్తుందా? లేదా?.. విమానయాన సంస్థల పరిహారం గురించి నియమాలు ఏమిటి? అనేది పూర్తిగా తెలుసుకుందాం.
Also Read : ఉత్సాహంగా ఉండటానికి ప్రతిరోజూ ఈ రసం తాగండి... ఎగిరి గంతులేస్తారు!
Also Read : 22ఏళ్లకే నిండు నూరేళ్లు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఎయిర్ హోస్టెస్ చివరి వీడియో!
పరిహారం నియమాలు
భారతదేశంతో సహా అనేక దేశాలలో విమాన ప్రమాదం జరిగినప్పుడు విమానయాన సంస్థ బాధ్యత మాంట్రియల్ కన్వెన్షన్ 1999 ప్రకారం నిర్ణయిస్తారు. ఈ అంతర్జాతీయ నియమం ప్రకారం.. ప్రమాదానికి ఎవరు కారణమైనా.. చనిపోయిన ప్రతి ప్రయాణీకుడి కుటుంబానికి విమానయాన సంస్థ కనీసం రూ. 1.4 కోట్ల పరిహారం చెల్లించాలి. విమానయాన సంస్థ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని రుజువైతే.. పరిహారం మొత్తం ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. DGCA కింద దేశీయ విమానాలలో కూడా ఇలాంటి నియమాలు వర్తిస్తాయి.
Also Read : ఈ 4 గాడ్జెట్‌లను విమానంలో తీసుకెళ్తే చాలా డేంజర్.. ప్రాణాలే పోతాయ్!
ప్రయాణ బీమా ప్రయోజనం
ప్రయాణీకుడు ప్రయాణ బీమా తీసుకుంటే.. అతడు ఎయిర్‌లైన్ కాకుండా ఇతర ప్రయోజనాలు కూడా పొందవచ్చు. ఈ ప్రయాణ బీమా కింద.. ప్రమాదవశాత్తు మరణానికి రూ. 25 లక్షల నుండి రూ. 1 కోటి వరకు కవర్, వైద్య అత్యవసర/ఆసుపత్రి ఖర్చులపై క్లెయిమ్, సామాను కోల్పోవడం లేదా విమాన రద్దుపై క్లెయిమ్, రూ. 10 లక్షల వరకు వైకల్యానికి కవర్ ప్రయోజనం ఉంటుంది. కొన్ని పాలసీలలో రోజువారీ హాస్పిటల్ నగదు ప్రయోజనం కూడా ఉంటుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. మీరు విమాన ప్రయాణానికి ముందు బీమాను యాక్టివేట్ చేసుకుంటేనే అది చెల్లుతుందని గుర్తించుకోవాలి.
బీమా లేకపోతే ఏమవుతుంది?
మాంట్రియల్ కన్వెన్షన్ ప్రకారం.. ఆఫీసు ట్రిప్‌లో ఉన్నప్పటికీ.. ఎయిర్‌లైన్ నుండి పరిహారం పొందుతారు. దీనికోసం కంపెనీ గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీ నుండి ప్రయోజనం పొందవచ్చు.
క్రెడిట్ కార్డ్ ట్రావెల్ ఇన్సూరెన్స్: టికెట్ అదే కార్డ్‌పై బుక్ చేయబడిందో లేదో చెక్ చేయాలి. టూర్ ఆపరేటర్ లేదా గ్రూప్ టూర్ ద్వారా ప్రయాణించినట్లయితే.. గ్రూప్ ఇన్సూరెన్స్ సహాయపడుతుంది.
ప్రయాణ బీమా ఖర్చు ఎంత?
ప్రయాణ బీమా ఖర్చు మీ ప్రయాణ వ్యవధి, గమ్యస్థానం, వయస్సుపై ఆధారపడి ఉంటుంది.
దేశీయ ప్రయాణానికి రోజుకు రూ. 30 నుండి రూ. 100 ఖర్చు ఉంటుంది.
వారం రోజుల పర్యటనకు రూ.100 నుండి రూ.500 చెల్లించాలి.
విదేశీ ప్రయాణానికి అంచనా ప్రీమియం
ఆసియా దేశాలకు రూ. 300 నుండి రూ. 700, కవరేజ్ రూ. 5 నుండి రూ. 15 లక్షలు
యూరోపియన్ దేశాలకు రూ. 500 నుండి రూ. 1,200, కవరేజ్ రూ. 50 లక్షల నుండి రూ. 1 కోటి వరకు
US/కెనడాకు రూ. 1,000 నుండి రూ. 2,500, రూ. 50 లక్షల నుండి రూ. 1 కోటి వరకు కవరేజ్
ఆస్ట్రేలియా/యుకెకు కవరేజ్ రూ. 700 నుండి రూ. 1,500 వరకు కవరేజ్ రూ. 25 లక్షల నుండి రూ. 1 కోటి వరకు ఉంటుంది.
విమానంలో ప్రయాణించే ముందు ఇవి ముఖ్యం
తరచూ దేశీయ, అంతర్జాతీయ ప్రయాణ బీమా తీసుకోవాలి.
నామినీ వివరాలను సరిగ్గా పూరించాలి. లేదంటే పరిహారంలో సమస్యలు వస్తాయి.
పాలసీలో ప్రమాదవశాత్తు + వైద్య కవర్ ఉండాలి.
బీమా డిజిటల్, ప్రింట్ కాపీలను తీసుకెళ్లాలి.
Also Read : అబ్బా తమ్ముడూ.. పోకో ఫోన్‌పై ఆఫర్ అదిరిపోయింది - ఫీచర్లు హైక్లాస్!
air india plane crash