/rtv/media/media_files/2025/06/12/sFYvNskENFNrTzV4Fjhw.jpg)
Air India plane crash may have occurred due to bird hits or major technical fault, say experts
బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ ఎయిర్ క్రాఫ్ట్ బయలుదేరిన చాలా కొద్దిసేపటికే నేల కూలింది. మేడే కాల్ చేసినా దానికి ప్రతి స్పందన వచ్చేలోపు ప్రమాదం జరిగిపోయింది. దీంతో పైలెట్లతో సహా మొత్తం ప్యాసెంజర్లతో కలిపి 269 మంది చనిపోయారు. అయితే ఈ ప్రమాదానికి ప్రధానంగా మూడు టెక్నికల్ ప్రాబ్లెమ్స్ కారణం అయి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రమాదానికి మూడు కారణాలు..
వాటిల్లో మొదటిది విమానం బయలుదేరినప్పుడు ల్యాండింగ్ గేర్ విస్తరించి ఉందని...దాని రెక్కల ఫ్లాప్ లు పూర్తిగా మూసుకున్నాయని చూపిస్తోంది. అయితే ఇలా ఉండడం అన్ యూజవల్ అంటున్నారు. విమానం టేకాఫ్ అయ్యేటప్పుడు కేవలం 5 లేదా అంత కంటే ఎక్కువ ఫ్లాప్ లు పెట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఫ్లైట్ ఎత్తుకు చేరుకోగానే అన్ని ఫ్లాప్ లూ ఉపసంహరిస్తారు. అలాగే ల్యాండింగ్ గేర్ ను కూడా విమానం పూర్తిగా గాల్లోకి ఎగిరాక మూస్తారు. కానీ బోయింగ్ 787 ల్యాండింగ్ గేర్ అంతకు ముందే మూసుకున్నట్లు వీడియోలు చూపిస్తున్నాయి. దీనిని పైలెట్ చూశారు. మళ్ళీ సరి చేశారు. ఆ క్రమంలో విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే విద్యుత్ వైఫల్యానికి గురైనట్లు కూడా కనిపించిందని నిపుణులు చెబుతున్నారు.
విమానం ప్రమాదంపై మరో అనుమానం ఏంటంటే ల్యాండింగ్ గేర్ కింది స్థానంలో ఇరుక్కుపోయి ఉండవచ్చిన వీడియోల ద్వారా గ్రహించవచ్చని అంటున్నారు. ఇది హైడ్రాలిక్ వైఫల్యం వల్ల జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. అటు వంటి టైమ్ లో డ్రాగ్‌ను తగ్గించడానికి మరియు వేగాన్ని పొందడానికి సిబ్బంది ముందుగానే ఫ్లాప్‌లను ఉపసంహరించుకోవడానికి ప్రయత్నించి ఉండవచ్చని చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదం పైలెట్లు ముందుగానే తెలుసుకున్నారని..అయినా కూడా ఫ్లైట్ ను టేకాఫ్ చేశారని చెబుతున్నారు. అంటే వారికి విమానం మీద పూర్తి నియంత్రణ ఉండి ఉండవచ్చని అంటున్నారు.
మొత్తానికి 600 అడుగుల ఎత్తులో ఉన్న విమానంలో ల్యాండింగ్ గేర్ , ఫ్లాప్ లు పూర్తిగా మూసుకుని ఉండడం...దాని వలన క్యాస్కేడింగ్ సాంకేతిక వైఫల్యం లేదా హైడ్రాలిక్ సమస్య తలెత్తి ఫ్లైట్ యాక్సిడెంట్ అయిందని చెబుతున్నారు. తక్కువ ఎత్తులో ఉన్నప్పుడే స్పష్టమైన స్టాల్ తగినంత లిఫ్ట్ ,అధిక డ్రాగ్ కారణంగా సంభవించి ఉండవచ్చు...ఆ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చిన అంటున్నారు.