/rtv/media/media_files/2025/06/13/IoNhFkWZtfYvt715KBhM.jpg)
అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాని చనిపోయిన విషయం తెలిసిందే. ఎయిర్ ఇండియా ఫ్లైట్ లండన్ వెళ్తుండగా గురువారం మధ్యాహ్నం టేకాఫ్ అయిన క్షణాల వ్యవధిలోనే కుప్పకూలి పేలిపోయింది. ప్రమాదం జరిగిన తేదీతో ఆయనకు మిస్టీరియస్ కనెక్షన్ ఉంది. 1206 అనే నెంబర్ విజయ్ రూపాని లక్కీ నెంబర్. అయితే అదే రోజు జూన్ 12న ఆయన మరణం బాధగానూ, ఆశ్చరకరంగానూ ఉంది. అంతేకాదు క్రాష్ అయిన విమానంలో విజయ్ రూపాని సీట్ నెంబర్ కూడా 12నే. 2016 నుంచి 2021 వరకు విజయ్ రూపాని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. పదవిలో లేకున్నా ఆయన బీజేపీ పార్టీలో కీలక నేతగా ఉన్నారు.
Vijay Rupani & the mystery of 12 🧿
— Madhuri Adnal (@madhuriadnal) June 12, 2025
🔹 Lucky number – 1206
🔹 Scooty plate – 1206
🔹 All car numbers – 1206
🔹 Boarding time – 12:10
🔹 Ticket serial – 12
🔹 Seat number – 12
🔹 Reported death date – 12/06
Coincidence or cosmic code? 🤯#VijayRupani #1206Mystery #Numerology… pic.twitter.com/wtM20IrIPJ
రాజకీయాల్లోనూ, వ్యక్తిగతంగానూ ఆయనకు 1206 అనే సంఖ్య బాగా కలిసొచ్చింది. దీంతో ఆయన ఫస్ట్ స్కూటీ నెంబర్ ప్లేట్ నుంచి విజయ్ రూపాని దగ్గరున్న అన్నీ కార్లకి ఇదే నెంబర్ ఉంటుంది. ఆయన విమానంలో ఎక్కే ముందు బోర్డింగ్ సమయం కూడా 12.10. టికెట్ సీరియల్ నెంబర్, సీట్ నెంబర్ కూడా 12తో మొదలవుతుంది. ఇప్పుడు చనిపోయిన రోజు కూడా 12తేదీ 06 నెల.
former Gujarat CM | Vijay Rupani | Mystery of the number | lucky number | Ahmedabad-London flight crash | Ahmedabad Plane Crash | ahmedabad | latest-telugu-news