Flight Accident: A- 171 విమాన ప్రమాదానికి గల ఐదు కారణాలు

భారత గగనతలంలో ఘోరం జరిగింది. అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ ఫ్లైట్ కుప్పకూలిపోయింది. ఇందులో ఒక్కరు తప్ప మొత్తం 265 మంది చనిపోయారు.

New Update
flight accident

A-171 Flight accident

అహ్మదాబాద్ ఎయిర్ క్రాఫ్ట్ కూలిన ఘటన తీరని విషాదాన్ని మిగిల్చింది. బయలు దేరిన కొద్దిసేపటికే కూలిపోయిన ఫ్లైట్ తరువాత మంటల్లో దగ్ధం అయిపోయింది. ప్రయాణికులు 229 మందితో పాటూ ఇద్దరు పైలెట్లు, సహాయ సిబ్బంది 12 మంది మొత్తం అందరూ చనిపోయారు. అలాగే విమానం మెడికల్ కాలేజీ హాస్టల్ మీద పడడంతో అక్కడి విద్యార్థులు 24 మంది మృత్యువాత పడ్డారు. ఒక్కరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. 

Also Read :  విమాన ప్రమాదానికి 3 కారణాలివే.. అంతా బ్లాక్ బాక్స్‌లోనే.. ఎక్స్పర్ట్ సంచలనం!

విమానం కూలిపోయిందిలా..

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిరిండియా బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమానం మధ్యాహ్నం 1.38 గంటలకు టేకాఫ్ అయింది. విమానాశ్రయానికి దగ్గరలో ఉండగా ఫ్లైట్ లో ఏదో సమస్య తలెత్తింది. దీంతో వెంటనే పైలెట్లు మేడే కాల్ ఇచ్చారు. ఆ తర్వాత విమానం కిందకు దిగిపోవడం మొదలైంది. మేడే కాల్ తర్వాత ఏటీసీ సిబ్బంది పైలెట్లతో సంప్రదించడానికి ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. తిరిగి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునేందుకు ప్రయత్నించిన ఏఐ171 విమానం.. అత్యంత తక్కువ ఎత్తుకు వచ్చి, కొన్ని సెకన్లలోనే విమానాశ్రయ వెలుపల మేఘానీనగర్‌లో మెడికల్ హాస్టల్ మీద కూలిపోయింది. దాని వెంటనే ఫ్లైట్ పేలిపోయి పెద్దగా మంటలు, నల్లని పొగలు వ్యాపించాయి.  బోయింగ్ 787-7 విమాన ప్రమాదంపై దర్యాప్తు చేయనున్నారు. ఇందులో భారతీయ నిపుణులతో పాటూ బ్రిటన్ కు చెందిన వారు కూడా పాల్గొననున్నారు.

Also Read :  జస్ట్ మిస్.. అమెరికాలో మరో విమాన ప్రమాదం..!

అయితే ఫ్లైట్ యాక్సిడెంట్ కు ఐదు కారణాలు ఉండవచ్చునని ఊహిస్తున్నారు. 

1. టేకాఫ్ అయిన వెంటనే ఇంజిన్ వైఫల్యం కీలకమైన క్లైమ్-అవుట్ దశలో ఒకటి లేదా రెండు ఇంజిన్లలలో లోపం వచ్చి ఉండవచ్చును. దీని వలన ఫ్లైట్ కూలిపోయి ఉంటుందని అనుమానిస్తున్నారు. 

2. టేకాఫ్ తర్వాత సాంకేతిక స్నాగ్ హైడ్రాలిక్ వైఫల్యం లేదా టెక్నికల్ వైఫల్యం వల్ల కూడా విమానం కూలిపోయే అవకాశం ఉంది. వీటివల్లరికవరీ అయ్యే ఛాన్స్ కూడా ఉందని చెబుతున్నారు. 

3. ఇంజిన్ ఫ్లేమ్అవుట్ లేదా థ్రస్ట్ కోల్పోవడం ఫ్లేమ్అవుట్  లేదా ఇంజిన్ థ్రస్ట్‌లో లోపం వస్తే విమానం పైకి ఎగురలేదు. అదే కనుక జరిగితే తక్కువ ఎత్తులో విమానం ప్రయాణించాల్సి వస్తుంది. దీనివలన దేనినైనా ఢీకొట్టడం...క్రమంగా కిందికి పడుకోవడం జరుగుతుంది. 

4. ఏవియానిక్స్ లేదా ఎలక్ట్రికల్ పనిచేయకపోవడం విమానంలోని ఎలక్ట్రానిక్ వ్యవస్థలలో తీవ్రమైన వైఫల్యం నావిగేషన్, కమ్యూనికేషన్ లేదా నియంత్రణ లోపాలవలన కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. 

5. పరికరం లేదా సెన్సార్ వైఫల్యం సెన్సార్లు పనిచేయకపోవడం వల్ల ఎత్తు, వేగం రీడింగ్‌లు తప్పుగా ఉండటం వల్ల పైలట్‌లు తప్పుదారి పట్టించే అవకాశం ఉంది. దీనివలన పైలెట్ ప్రమాదాన్ని పసిగట్టలేక వెంటనే చర్యలు తీసుకోలేకపోవచ్చునని అంటున్నారు.  ఏది ఏమైనా బ్లాక్ బాక్స్ దొరికి..దర్యాప్తులో అసలు నిజాలు తెలిస్తే కానీ విమానం ఎలా కూలిపోయిందో తెలియదు. 

Also Read :  రాహుల్ గాంధీ మ్యాచ్ ఫిక్సింగ్ వ్యాఖ్యలపై మహారాష్ట్ర సీఎం ఫైర్

Also Read :  ముంబయ్ నుంచి లండన్ విమానం..మూడు గంటలు గాల్లోనే..వెనక్కి..

today-latest-news-in-telugu | reason | Ahmedabad-London flight crash

Advertisment
Advertisment
తాజా కథనాలు