Sanjay Kapoor Passes Away: స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ మాజీ భర్త మృతి..

బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త, పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ 53 సంవత్సరాల వయసులో మరణించారు. యూకేలో ఉంటున్న ఆయన గురువారం పోలో ఆడుతుండగా గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. 2017లో ప్రియా సచ్‌దేవ్‌తో ఆయన రెండవ వివాహం చేసుకున్నారు.

New Update
Karisma Kapoor ex-husband Sunjay Kapur

Karisma Kapoor ex-husband Sunjay Kapur

బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ కన్నుమూశారు. ఆయన 53 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. యూకేలో ఉంటున్న ఆయన గురువారం పోలో ఆడుతుండగా గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. సంజయ్ కపూర్ మరణంతో మొత్తం చిత్ర పరిశ్రమ సంతాపం వ్యక్తం చేస్తోంది. సంజయ్ కపూర్ ఆత్మకు శాంతి చేకూరాలని అందరూ ప్రార్థిస్తున్నారు.

 

Also Read: నేను ఎలా బతికి బయటపడ్డానంటే? ప్రమాదంలో బయట పడ్డ ఒకే ఒక్కడు రమేష్ సంచలన విషయాలు..

Sanjay Kapoor Passes Away

సమాచారం ప్రకారం.. జూన్ 12న సంజయ్ కపూర్ పోలో ఆడుతున్నాడు. ఈ సమయంలో అతడికి గుండెపోటు రావడంతో ఒక్కసారిగా నేలకూలారు. దీంతో వెంటనే అతడికి తక్షణ వైద్య సహాయం అందినప్పటికీ.. సంజయ్ అప్పటికే ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు నిర్ధారించారు. 

Also Read: మెడికల్ స్టూడెంట్స్ హాస్టల్ పై కూలిన విమానం.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యాలు!

2003లో కరిష్మా కపూర్‌తో వివాహం

సంజయ్ కపూర్ 2003లో బాలీవుడ్ నటి కరిష్మా కపూర్‌ను వివాహం చేసుకున్నారు. అయితే కొన్ని సంవత్సరాల వివాహం తర్వాత నటి, సంజయ్ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో 2016లో కరిష్మా, సంజయ్ ఒకరినొకరు విడాకులు తీసుకున్నారు. వీరిద్దరికీ ఇద్దరు సంతానం. 

Also Read: బిగ్‌ అప్‌డేట్.. కుప్పకూలిన విమానంలో మాజీ సీఎం

స్పందించని కరిష్మా కపూర్

సంజయ్ కపూర్ తరచుగా ఏదో ఒక కారణంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. అంతేకాకుండా సంజయ్, కరిష్మా కపూర్‌ల లవ్‌స్టోరీ కూడా చక్కర్లు కొట్టింది. ఇక ఇప్పుడు సంజయ్ కపూర్ మరణంపై కరిష్మా కపూర్ ఎలాంటి స్పందన ఇవ్వలేదు. మరోవైపు సంజయ్ అభిమానులు, శ్రేయోభిలాషులు అందరూ ఆయన మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు.

Also Read :  త్వరలోనే ఇండియా నుంచి చైనాకు విమాన ప్రయాణం..!

 

latest-telugu-news | telugu-cinema-news | telugu-film-news | bollywood | karishma kapur | today-news-in-telugu

Advertisment
Advertisment
తాజా కథనాలు