22ఏళ్లకే నిండు నూరేళ్లు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఎయిర్ హోస్టెస్ చివరి వీడియో!

ఎయిర్ ఇండియా ప్రమాదంలో చనిపోయిన ఎయిర్ మణిపూర్ హోస్టెస్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నగాన్తోయ్‌ శర్మ(22) ఫ్లైట్ బయల్దేరే ముందు రీల్ చేసింది. ఆమె ఫొటోలు, వీడియోలు చూస్తూ కుటుంబ సభ్యులు గుండెలు పలిగేలా రోధిస్తున్నారు.

New Update
Nganthoi Sharma

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. క్షేమంగా వారి ప్రయాణం ఉంటుందని అనుకులే లోపే గాల్లోకి ఎరిగిన క్షణాల్లోనే ఫ్లైట్ కుప్పకూలిపోయింది. అందులోని ఎయిర్ హోస్టెస్ విమానం బయల్దేరడానికి కొన్ని క్షణాల ముందు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మణిపూర్‌ చెందిన ఎయిర్ హోస్టెస్ నగాన్తోయ్‌ శర్మ 2021లో ఎయిర్ ఇండియాలో ఉద్యోగం సంపాదించింది. ఎంతో కష్టపడి 19ఏళ్లకే ఆమె తన కలలను సాకారం చేసుకొంది. రెండేళ్ల క్రితమే ఆమె జాబ్‌లో జాయింన్ అయ్యింది. తనపై తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను నెరవేర్చి కుటుంబానికి ఒక భరోసాగా నిలిచింది 22 ఏండ్ల నగాన్తోయ్‌ శర్మ గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆమె కూడా చనిపోయింది. 

నగాన్తోయ్‌ శర్మ ప్రమాదం జరిగిన రోజు ఉదయం11.30 గంటలకు లండన్‌ వెళ్తున్నట్లు తన అక్కకు ఫోన్ చేసి చెప్పింది. మళ్లీ మాట్లాడటం కుదరదేమో.. జూన్ 15న తిరిగి వస్తానని సోదరితో అంది. నగాన్తోయ్‌ శర్మ చివరి మాటలు తలచుకుని ఆమె కుటుంబం కన్నీటిపర్యంతమవుతోంది. ఫ్లైట్‌లో ఆమె చేసిన రీల్ కూడా ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆమె తల్లిదండ్రులు రోదిస్తున్న వీడియో, ఆమె ఎయిర్ హోస్టెస్‌గా రికార్డ్ చేసిన వీడియో చూసిన నెటిజన్లు సైతం కన్నీళ్లు  పెట్టుకుంటున్నారు. ఆమె దిగిన ఫొటోలను కళ్ల ముందు పెట్టుకుని జ్ఞాపకాలు నెమరువేర్చుకుంటూ కుటుంబసభ్యులు కన్నీరు కారుస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు