Live News Updates: కడుపు తెచ్చుకో..రూ.లక్ష అందుకో.. స్కూల్, కాలేజ్ విద్యార్థులకు సంచలన ఆఫర్‌..

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
LIVE BLOG

LIVE BLOG

🔴Live News Updates:

AP: జగన్ కు బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు!

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు బంగారుపాళ్యం పర్యటన సందర్భంగా పోలీసుల ఆంక్షలు విధించారు. మామిడి రైతుల సమస్యల పట్ల సమీక్ష కార్యక్రమానికి 500 మందికి మాత్రమే అనుమతినిచ్చారు.

jagan

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేపు బంగారుపాళ్యం పర్యటన సందర్భంగా పోలీసుల ఆంక్షలు విధించారు. మామిడి రైతుల సమస్యల పట్ల సమీక్ష  కార్యక్రమానికి 500 మందికి మాత్రమే అనుమతినిచ్చామని జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు. గతంలో సత్యసాయి,ప్రకాశం, గుంటూరు జిల్లాలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పలు ఆంక్షలను కూడా విధించారు.

Also Read: యుగాంతం ఎఫెక్ట్‌.. భారత్‌లో ఒకేరోజు మూడు భూకంపాలు

పుంగునూరు పరిసర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని...అందుకే అక్కడ 500  కంటే ఎక్కువ మంది పాల్గొనకూడదని చెప్పామన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీనికి పుంగనూరు పట్టణ వైసీపీ నాయకులు, కార్యకర్తలు సహకరించాలని  పుంగనూరు సి.ఐ.సుబ్బారాయడు కోరారు. 

Also Read: బుద్ధిలేని బంగ్లాదేశ్.. టర్కీతో కలిసి భారత్ పై కుట్ర.. అదే జరిగితే ఇండియాకు ఇబ్బందేనా?

జగన్ వాహనమే కారణం..

మరోవైపు వారం క్రితంసింగయ్య మృతికి వైఎస్‌ జగన్‌ ప్రయాణించిన వాహనమే కారణమని ఫోరెన్సిక్‌ నివేదిక ఇచ్చింది. ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలించిన ఫోరెన్సిక్‌ అధికారులు.. ఘటన సమయంలో సెల్‌ఫోన్లలో రికార్డయిన వీడియోలు అసలైనవేనని వెల్లడించారు. మార్ఫింగ్‌ వీడియోలంటూ పలువురు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఫోరెన్సిక్‌ నివేదిక కీలకంగా మారింది. ఈ మేరకు జగన్ ర్యాలీ సందర్భంగా చిత్రీకరించిన కార్యకర్తల 6 ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Also Read: నితీశ్‌ కుమార్ సంచలన నిర్ణయం.. మహిళలకు 35 శాతం రిజర్వేషన్‌

వాటిని ఫోరెన్సిక్‌ విభాగానికి పంపించారు. ఫోన్లలో తీసిన వీడియోలు పరిశీలించగా.. అవన్నీ ఒరిజినల్‌వేనని స్పష్టమైంది. ఇక జూన్‌ 18న పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా జగన్‌ వాహనం కింద పడి సింగయ్య చనిపోయారు. మొదట దేవినేని అవినాష్‌ అనుచరుడి వాహనం ఢీకొన్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో వారు అదే విషయాన్ని విలేకరుల సమావేశంలో ప్రకటించారు. అనంతరం జగన్‌ వాహనం కింద పడి సింగయ్య మరణించిన దృశ్యాలు వెలుగులోకి రావడంతో కేసు మలుపుతిరిగింది. 

  • Jul 09, 2025 21:35 IST

    కడుపు తెచ్చుకో..రూ.లక్ష అందుకో.. స్కూల్, కాలేజ్ విద్యార్థులకు సంచలన ఆఫర్‌..

    రష్యాలో తీవ్రమైన జనాభా సంక్షోభం ఏర్పడింది.ఈ కారణంగా తన జనాభాను పెంచుకోవాలని నిర్ణయం తీసుకుంది. దీనికోసం స్కూల్, కాలేజీ స్టూడెంట్స్ కనుక గర్భం తెచ్చుకుంటే వారికి ఏకంగా రూ.లక్ష ప్రోత్సాహకాలను అందిస్తామని ప్రకటించింది.

     



  • Jul 09, 2025 20:09 IST

    తెలంగాణకు ద్రోహం చేసిందే కేసీఆర్‌ : సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో కృష్ణా నది జలాలపై ఏపీద్వారా జరిగిన అక్రమ జల వినియోగంపై తెలంగాణ ప్రభుత్వం నేడు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ నిర్వహించింది.ఈ ప్రజంటేషన్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలోనే కృష్ణా జలాల్లో నీటి దోపిడీ మొదలైందన్నారు.

    Revanth



  • Jul 09, 2025 18:53 IST

    హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ దందాలో సంచలనం... 25 మంది ప్రముఖులకు షాక్‌

    హైదరాబాద్‌ లో మల్నాడు రెస్టారెంట్ డ్రగ్స్ కేసులో విచారణ కొనసాగుతోంది. రెస్టారెంట్లు వేదికగా డ్రగ్స్‌ వినియోగిస్తున్నట్లు ఈగల్‌ టీం గుర్తించింది. మల్నాడు, టేల్స్‌ ఆఫ్ తెలుగు రెస్టారెంట్‌ యజమాని సూర్య ఈ కేసులో కీలకంగా ఉన్నారని ఈగల్‌ టీం స్పష్టం చేసింది.

    Drugs Racket Busted in Hyderabad



  • Jul 09, 2025 18:53 IST

    నాకు నోబెల్ బహుమతి రావాలి.. అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

    మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పరిపాలనకు నోబెల్ బహుమతి రావాలని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ నిరంతరం అడ్డంకులు పెట్టినప్పటికీ ఢిల్లీ ప్రజలకు మంచి పాలనను అందించానని చెప్పారు.

     

    Arvind Kejriwal
    Arvind Kejriwal

     



  • Jul 09, 2025 18:52 IST

    HCA అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్టు

    హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్ అయ్యారు. ఐపీఎల్ క్రికెట్ వ్యవహారంలో ఆయన్ని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

     

    HCA President Jagan Mohan Rao arrested by CBI
    HCA President Jagan Mohan Rao arrested by CBI

     



  • Jul 09, 2025 17:42 IST

    మామిడి రైతులకు అన్యాయం... ప్రభుత్వాన్ని నిద్రలేపేందుకే వచ్చా.. జగన్‌ కీలక వ్యాఖ్యలు

    మామిడి రైతులను ప్రభుత్వ పట్టించుకోవడం లేదని, వారికి అన్యాయం చేస్తోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపించారు. నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించిన జగన్‌ బంగారుపాళ్యం మార్కెట్ యార్డును సందర్శించారు. రైతులతో ముఖాముఖి నిర్వహించారు.

     

    YS Jagan On AP Liquor Scam
    YS Jagan On AP Liquor Scam

     



  • Jul 09, 2025 17:41 IST

    గుంటనక్క టర్కీపై భారత్ రివేంజ్.. ఆ దేశంపైకి మన మిస్సైళ్లు!

    భారత్‌ నుంచి గ్రీస్‌ అత్యాధునిక లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్‌ క్రూయిజ్‌ మిస్సైల్‌ (LRLACM)ను కోరుతోంది. ఒకవేళ భారత్‌.. గ్రీస్‌కు ఈ క్షిపణిని ఇస్తే అది వ్యూహాత్మక చర్య కావొచ్చని నిపుణులు భావిస్తున్నారు.

     

    India’s
    India’s "unofficial offering" of S400-evading cruise missile to Greece shakes Turkey

     



  • Jul 09, 2025 16:43 IST

    గగన్‌యాన్‌ ప్రాజెక్టులో పురోగతి.. పరీక్షలు విజయవంతం

    గగన్‌యాన్ ప్రాజెక్టులో ఇస్రో మరో ముందడుగు వేసింది. సర్వీస్‌ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్‌కు సంబంధించి రెండు హాట్‌ టెస్టులు సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించింది. మహేంద్రగిరిలోని ప్రొపల్షన్ కాంప్లెక్స్‌లో జులై 3న ఈ పరీక్షలు నిర్వహించినట్లు ఇస్రో పేర్కొంది.

     

    Isro successfully conducts hot tests of Gaganyaan propulsion system
    Isro successfully conducts hot tests of Gaganyaan propulsion system

     



  • Jul 09, 2025 16:42 IST

    మైలార్‌దేవ్‌పల్లిలో దారుణం.. మొగున్ని బండరాయితో కొట్టిచంపిన భార్య

    హైదరాబాద్ లోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది.. బండరాయితో తలపై కొట్టి భర్తను హత్య చేసింది భార్య. మద్యానికి బానిసైన భర్త షేక్ మహ్మద్ నిత్యం పెట్టే వేధింపులు భరించలేక హత్య చేసినట్లు భార్య స్పష్టం చేసింది.

     

    murder
    murder

     



  • Jul 09, 2025 16:25 IST

    పుష్పరాజ్ కి విలన్ గా ఆస్కార్ విజేత ... అల్లు అర్జున్ - అట్లీ కాంబో నుంచి అదిరే అప్డేట్!

    అల్లు అర్జున్- అట్లీ సినిమాలో  హాలీవుడ్ సూపర్ స్టార్, ఆస్కార్ విజేత విల్ స్మిత్ విలన్‌గా నటించబోతున్నాడనే వార్త  ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. '

     

    Will Smit as villain in allu arjun atlee project
    Will Smit as villain in allu arjun atlee project

     



  • Jul 09, 2025 16:24 IST

    ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఎవర్నీ వదలం...కల్తీ కల్లు ఘటనపై మంత్రి జూపల్లి సంచలన వ్యాఖ్యలు

    కూకట్‌పల్లి  క‌ల్తీ క‌ల్లు బాధితుల‌ను ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి  జూపల్లి కృష్ణారావు ఈ రోజు ప‌రామ‌ర్శించారు. నిమ్స్‌ అస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రజ‌ల ప్రాణాల‌తో చెల‌గాట‌మాడే వారిని వ‌ద‌లమని స్పష్టం చేశారు.

    Jupally Krishna Rao



  • Jul 09, 2025 15:20 IST

    హైదరాబాద్ పబ్ లలో మరోసారి డ్రగ్స్ కలకలం.. చెప్పుల్లో దాచి సరఫరా..

    హైదరాబాద్ లోని ఓ రెస్టారెంట్‌లో గుట్టుగా సాగుతున్న డ్రగ్స్ దందాను ఈగల్ టీం బయటపెట్టింది. కొంపల్లిలోని మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు టీం గుర్తించింది. రెస్టారెంట్ ఓనర్ సూర్య నేతృత్వంలో డ్రగ్ దందా జరుగుతున్నట్లు గుర్తించారు.

     

     drugs
    drugs

     



  • Jul 09, 2025 14:24 IST

    ఆధార్‌ ఎప్పటికీ తొలి గుర్తింపు కాదు.. ఉడాయ్ సీఈవో కీలక వ్యాఖ్యలు

    సాధారణంగా మన గుర్తింపు కోసం చూపించే మొదటి ప్రూఫ్‌ ఆధార్ కార్డ్. అయితే ఉడాయ్ సీఈవో తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆధార్ కార్డ్ ఎప్పటికీ తొలి గుర్తింపు కాదని తెలిపారు. నకిలీ ఆధార్‌కార్డులకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

     

    Aadhaar Card
    Aadhaar Card

     



  • Jul 09, 2025 14:23 IST

    కుప్పకూలిన ఎయిర్‌ఫోర్స్ యుద్ధ విమానం..

    రాజస్థాన్‌లోని చురు జిల్లాలో ఓ ఎయిర్‌ఫోర్స్ ఫైటర్‌ జెట్‌ కుప్పకూలింది. భానుడా అనే గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

     

    Fighter jet crashes in Bhanuda village in Rajasthan's Ratangarh
    Fighter jet crashes in Bhanuda village in Rajasthan's Ratangarh

     



  • Jul 09, 2025 13:21 IST

    YCP Nallapareddy: వైసీపీకి బిగ్ షాక్ ... మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డిపై కేసు నమోదు!

    వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసు నమోదైంది. కోవూరు టీడీపీ ఎమ్మెల్యే  వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై నల్లపరెడ్డి చేసిన కామెంట్స్‌ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.  

    ycp-prasanna



  • Jul 09, 2025 12:53 IST

    Hyderabad Metro : మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్... ఎల్‌ అండ్‌ టీ సంచలన నిర్ణయం!

    హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. త్వరలో కొత్త మెట్రో రైళ్లకు ఎల్‌అండ్‌టీ సంస్థ కసరత్తు చేపట్టింది. ఈ మేరకు తయారీ సంస్థ  బీఈఎంఎల్‌తో ఒప్పందం కుదుర్చుకోనుంది. ప్రస్తుతం మూడు రూట్లలో 57 మెట్రోలు తిరుగుతున్నాయి. ప్రయాణికుల రద్దీ కూడా ఎక్కువైంది.

    hyd-metro



  • Jul 09, 2025 12:53 IST

    AP Crime: విశాఖలో దారుణ హత్య.. చికిత్స పొందుతూ లోహిత్ మృతి

    విశాఖ మాధవదారలో దారుణ హత్య జరిగింది. ఎయిర్‌పోర్టు పీఎస్ పరిధిలో లోహిత్ అనే యుకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షల కారణంగానే లోహిత్‌ను హత్య చేసినట్లు సమాచారం. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ లోహిత్ మృతి చెందాడు.

     

    vishaka crime news
    vishaka crime news

     



  • Jul 09, 2025 12:26 IST

    Prabhas Marriage: ప్రభాస్ పెళ్లి ఫిక్స్ .. ఆ ఆలయంలో శ్యామలా దేవి ప్రత్యేక పూజలు!

    పాన్ ఇండియా స్టార్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లి గురించి టాలీవుడ్‌లో ఎప్పుడూ ఏదో ఒక చర్చ నడుస్తూనే ఉంటుంది. డార్లింగ్ పెళ్లి ఎప్పుడెప్పుడా ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

     

    Prabhas marriage
    Prabhas marriage

     



  • Jul 09, 2025 11:21 IST

    KTR Tweet: డబుల్ ఇంజిన్‌ గుజరాత్ నమూనాకు మరో అద్భుతమైన ఉదాహరణ: కేటీఆర్ విమర్శలు

    గుజరాత్‌లోని మహిసాగర్ నదిపై ఉన్న గంభీర బ్రిడ్జి అకస్మాత్తుగా కూలింది. ఈ ప్రమాదంలో నదిలో వాహనాలు పడి ముగ్గురు ప్రయాణికులు మృతి చెందగా.. పలువురు గల్లంతయ్యారు. బ్రిడ్జి కూలడంతో తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా స్పందించి పలు విమర్శలు చేశారు.

     

    Gujarat Crime News
    Gujarat Crime News

     



  • Jul 09, 2025 11:21 IST

    Rain Alert: భారీ వరదలు.. అతలాకుతలంగా మారిన టెక్సాస్

    అమెరికాలోని టెక్సాస్‌లో తీవ్ర విషాదాన్ని కలిగిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదల తాకిడికి దాదాపు 200 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలే కావడం విషాదకరం. ఇంకా 160 మందికి పైగా గల్లంతైనట్లు అధికారులు పేర్కొంటున్నారు.

     

    Texas floods
    Texas floods

     



  • Jul 09, 2025 11:20 IST

    TG News: హైదరాబాద్‌లో రెచ్చిపోయిన దొంగలు.. మూడు ATMలలో చోరీ

    హైదరాబాద్‌లోని జీడిమెట్ల ప్రాంతంలో దొంగల గ్యాంగ్ బీభత్సం సృష్టించింది. కేవలం ఒకే గంట వ్యవధిలో మూడు వేర్వేరు ATMలలో చోరీలకు పాల్పడి స్థానికుల్లో భయాన్ని కలిగించారు. మార్కండేయనగర్‌లోని హెచ్డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంకుల ATM కేంద్రాలో చోరీ చేశారు.

     

    Hyderabad bank  theft
    Hyderabad bank theft

     



  • Jul 09, 2025 11:20 IST

    TG Crime: కొడుకు ఇద్దరు భార్యల లొల్లి... మధ్యలో అత్త బలి!

    హైదరాబాద్‌లోని బహదూర్‌పురలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలను ఆపే క్రమంలో వృద్ధ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు కిషన్‌బాగ్‌కు చెందిన మహమూద్‌గా గుర్తింపు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

     

    Bahadurpura Crime News
    Bahadurpura Crime News

     



  • Jul 09, 2025 11:20 IST

    AP Crime: కొంపముంచిన ఓవర్ స్పీడ్.. పుణ్యక్షేత్రాల కోసమని వెళ్లి అనంత లోకాలకు!

    తిరుమలలో రోఘ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. శ్రీవారి దర్శనం ముగిసి అరుణాచలేశ్వర స్వామివారి దర్శనాని వెళ్తుండగా కారు పాల ట్యాకర్‌ను వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తల్లీ కుమారుడి మృతి చెందగా కుతూరు, తండ్రికి తీవ్ర గాయాలయ్యాయి.

     

    Vijayawada Crime news
    Vijayawada Crime news

     



  • Jul 09, 2025 10:04 IST

    Viral Video : పప్పు బాలేదని తుప్పు రేగొట్టిన ఎమ్మెల్యే.. చొక్కా విప్పి మరీ.. వీడియో వైరల్

    ముంబైలోని ఎమ్మెల్యే గెస్ట్ హౌస్‌లో క్యాంటీన్ సిబ్బందిపై శివసేన (షిండే వర్గం) ఎమ్మెల్యే దాడికి దిగారు. బుల్ధానాకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంజయ్ గైక్వాడ్, ఎమ్మెల్యే గెస్ట్ హౌస్ క్యాంటీన్‌లో వడ్డించే ఫుడ్ పై అసంతృప్తిగా ఉన్నారు

    shinde-mla



  • Jul 09, 2025 10:02 IST

    Nimisha Priya: కేరళ నర్సుకు జులై 16న ఉరిశిక్ష.. ఎందుకంటే?

    కేరళకు చెందిన నర్సు నిమిషా ప్రియకు యెమెన్ ఉరిశిక్షను ఖరారు చేసింది.  ఆదేశ అధ్యక్షుడి ఆమోదంతో ఈ నెల 16న ఈ శిక్షను యెమెన్‌ దేశం అమలు చేయనున్నారు. ఈ విషయాన్ని ,మానవ హక్కుల కార్యకర్త శామ్యూల్ జెరోమ్ తెలిపారు.

    nimisha-priya



  • Jul 09, 2025 10:01 IST

    AP Crime: పీఎం కిసాన్‌ యాప్‌ ఫేక్ లింక్ పంపి రూ.10 లక్షలు కొట్టేశారు!

    సైబర్‌ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. పీఎం కిసాన్‌ యోజన నకిలీ యాప్‌ లింకు పంపి.. రూ.10 లక్షల నగదు కాజేశారు.ఈ  ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. కొత్తపల్లికి చెందిన రాజాశెట్టి తిరుపతిలోని ఓ గోల్డ్‌ షోరూమ్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్నారు.

    pm-kisan-cyber



  • Jul 09, 2025 10:00 IST

    Congress vs BRS: టీవీ డిబెట్లో తన్నుకున్న లీడర్లు.. కాంగ్రెస్ నేత దవడ పగిలింది!

    ఓ టీవీ డిబెట్ లో ఇద్దరు రాజకీయ నాయకులు సహనం కోల్పోయారు. కెమెరా ఉందన్న సోయి కూడా మరిచిపోయారు. మాటమాట పెరగడంతో ఊగిపోయారు.  ఒకరిపై కూడా ఒకరు దాడి చేసుకున్నారు.  ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    fightting



  • Jul 09, 2025 09:59 IST

    Nidhhi Agerwal: నెంబర్ ఇస్తే పెళ్లి సంబంధం మాట్లాడుతా.. నిధి అగర్వాల్‌కు ఫ్యాన్ ప్రపోజల్ !

    హీరోయిన్ నిధి అగర్వాల్ ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తున్న క్రమంలో  ఓ అభిమాని పెళ్లి చేసుకుంటాను మీ అమ్మ నెంబర్ పంపు అంటూ నిధిని అడగడం నెట్టింట వైరల్ గా మారింది. 

     

    Nidhi Agarwal
    Nidhi Agarwal Photograph: (Nidhi Agarwal)

     



  • Jul 09, 2025 07:30 IST

    Crime: అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో అత్త, మేనల్లుడికి పెళ్లి .. బిగ్ ట్విస్ట్ ఏంటంటే?

    బీహార్‌లోని సుపాల్ జిల్లాలో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో గ్రామస్తులు ఓ మహిళను, ఆమె భర్త మేనల్లుడిని దారుణంగా కొట్టి వారిద్దరికి బలవంతంగా పెళ్లి చేశారు. వారిద్దరికీ తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

    bihar-crime



  • Jul 09, 2025 07:30 IST

    FATF Report on Pulwama Attack: పుల్వామా దాడికి అమెజాన్ లో పేలుడు పదార్థాలు..పే పాల్ ద్వారా మనీ

    ఉగ్రవాద సంస్థలు విపరీతంగా అభివృద్ధి చెందాయి. దాడులు చేయడానికి డిజటల్ పే, ఈ కామర్స్ ల ద్వారా మనీ సేకరిస్తున్నాయి అని చెబుతోంది ఎఫ్ఏటీఎఫ్. పుల్వామా దాడే ఇందుకు ఉదాహరణ అని చెబుతోంది. 

     

    pulwama
    Pulwama Attack

     



  • Jul 09, 2025 07:23 IST

    Bharat Bandh: నేడు భారత్ బంద్..స్కూళ్లు, కాలేజీలతో పాటుగా ఇవి కూడా క్లోజ్!

    కేంద్రం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, రైతు వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా నిరసన తెలపడానికి కీలక ప్రభుత్వ రంగాలకు చెందిన 25 కోట్లకు పైగా కార్మికులు నేడు దేశవ్యాప్తంగా భారీ సమ్మెకు సిద్ధమవుతున్నారు.

    bharat-bandh



  • Jul 09, 2025 06:46 IST

    Cumin Coriander Benefits: కొత్తిమీర-జీలకర్ర ఆరోగ్యానికి ప్రయోజనాలు తెలుసా..?

    కొత్తిమీర, జీలకర్ర కలయిక రుచితోపాటు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ రెండింటినీ కలిపి ఆహారంలో కలిపినప్పుడు.. అలాంటి ఆహారం తృప్తి స్థాయిని పెంచుతుంది. దీనివల్ల తిన్న తర్వాత సంతృప్తి చెందుతారు, అతిగా తినడం నివారించవచ్చు. బరువు తగ్గడానికి ఇది చాలా ముఖ్యమైనది.

     

    Cumin Coriander Benefits
    Cumin Coriander Benefits

     



  • Jul 09, 2025 06:36 IST

    Ramya Murder : నాకు దక్కనిది ఇంకెవరికీ దక్కొద్దని .. రమ్య హత్య కేసులో బిగ్ ట్విస్ట్ !

    రమ్య హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రియుడు ఆమెను హత్య చేసినట్లుగా పోలీసులు నిర్ధారించారు. ప్రేమ పెళ్లికి యువతి తల్లిదండ్రులు నో చెప్పడం, వారం రోజులుగా ఫోన్లకు యువతి కూడా స్పందించకపోవడంతో కక్ష పెంచుకున్న ప్రియుడు రమ్యను హత్య చేశాడు.

    ramya-murder



Advertisment
Advertisment
తాజా కథనాలు